నీతి ఆయోగ్
2021-22 ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా మహిళా అవార్డుల ఐదవ ఎడిషన్ కోసం దరఖాస్తులు కోరుతున్న నీతి ఆయోగ్ కు చెందిన మహిళా ఎంటర్ ప్రెన్యుయర్ షిప్ ప్లాట్‌ఫారం
Posted On:
02 OCT 2021 1:25PM by PIB Hyderabad
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా నీతి ఆయోగ్ ఫ్లాగ్ షిప్ కార్యక్రమంలో భాగంగా మహిళా ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్ ప్లాట్‌ఫారం (డబ్ల్యు ఇపి) అమృత్ మహోత్సవ్‌లో భాగంగా 75 మంది విజయసాధకులను సత్కరించనుంది. ఈ వేదికను ఏర్పాటు చేసి ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. దీనిని ఏర్పాటు చేసినప్పటినుంచి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఉమన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా 2021 అవార్డులు మహిళా ఎంటర్ ప్రెన్యుయర్ల కృషికి గుర్తింపునిస్తుంది. ఇది సాక్షత్ , సమర్ధ భారత్‌కు వీలు కల్పిస్తుంది. ఇది గతిన వ్యాపారాలు నిర్మించడం లేదా విభిన్న , ప్రత్యేక వ్యాపార పరిష్కారాల ద్వారా సవాళ్లను అధిగమించడం వంటి వాటిని సాధించినందుకు గుర్తుగా వారి కృషికి గుర్తింపునిచ్చే కార్యక్రమం.
దేశవ్యాప్తంగా అద్భుత విజయాలు సాధించి మార్పుకు దోహదపడిన మహిళలను గుర్తించేందుకు నీతి ఆయోగ్ కృషిలో భాగమే ఈ డబ్ల్యుటిఐ అవార్డులు. 2018 నుంచి ఈ డబ్ల్యు టిఐ అవార్డులను మహిళా ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్ ప్లాట్‌ఫాం ద్వారా ఇస్తున్నారు. ఇది ప్రత్యేకంగా మహిళా ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్‌పై దృష్టిపెడుతుంది. ఈ అవార్డులు మహిళలను ఎంటర్ ప్రెన్యుయర్లుగా ప్రోత్సహిస్తుంది. గత అవార్డుల సందర్భంగా ఎందరో మహిళలు వ్యాపార, వాణిజ్య , సామాజిక రంగాలలో చేసిన అద్భుత కృషి అందరి దృష్టికి వచ్చింది..
ఈ సంవత్సరం డబ్ల్యుటిఐ అవార్డులను యుఎన్, సిఐఎస్ సి ఒ సిఎస్ ఆర్, ఫిక్కి, గ్రాంట్ థ్రాంన్‌టన్ భారత్ ల భాగస్వామ్యంతో అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన అప్లికేషన్లు https://wep.gov.in/ లఓ అందుబాటులో ఉన్నాయి. 2021 డిసెంబర్ 31 వరకు వీటిని స్వీకరిస్తారు. మహిళా ఎంటర్‌ప్రెన్యుయర్లు తమ పేర్లు తామే నామినేట్ చేసుకోవచ్చు లేదా ఇతరులైనా వారి పేర్లు నామినేట్ చేయవచ్చు. ఇందుకుసంబంధించి ఏడు కేటగిరీలలో ఏ ఒక్కదానికైనా లేదా ఎక్కువ అవార్డులకైనా దరఖాస్తు చేయవచ్చు. ఈ ఏడు కేటగిరీలు, పబ్లిక్, కమ్యూనిటీ సర్వీస్, తయారీ రంంంగం, తయారీ యేతర రంగం,ఆర్ధిక వృద్ధికి దోహదపడే ఆర్ధిక ఉత్పత్తులు, వాతావరణ కార్యాచరణ, సంస్కృతి కళలు, చేతి వృత్తలు, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఇందులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సవివర దరఖాస్తు, అర్హతలకు సంబంధించిన అంశాలు అన్నీ https://wep.gov.in/wep-faqs.లో అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తులుదాఖలు చేయడానికి గడువుతేదీ ముగిసిన తర్వాత, మూడు దశలలో వీటి పరిశీలన ప్రక్రియ ఉంటుంది. స్వతంత్ర వ్యవస్థ ద్వారా దీని పరిశీలన నిర్వహింప చేససస్తారు. 75 మంది ప్రేరణాత్మక మహిళలను గుర్తిస్తారు. ఈవిజేతలను అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన 2022 మే 8 న మంగళవారం సత్కరిస్తారు. భారత దేశ స్వాతంత్ర 75 వసంతాల సందర్భంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దీనిని నిర్వహిస్తారు.
మహిళా ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్ ప్లాట్‌పారం, దేశంలో ఎంటర్ ప్రెన్యుర్ వాతావరణాన్ని పరివర్తన చెందించేందుకు ఉద్దేశించినది. స్టేక్‌హోల్డర్లకు తగిన సమాచారాన్ని అందించి వారందరిని ఒక్కతాటిపైకకకి తెచ్చి వారిని ఒక చోటికి చేర్చే కార్యక్రమం ఇది. ఇచ్ఛాశక్తి, జ్ఞాన శక్తి, కర్మశక్తి అనే మూడు ప్రధాన అంశాల ఆధారంగా ఇది ప్రేరణాత్మక మహిళా ఎంటర్ ప్రెన్యుయర్ల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారం. ఈ ప్లాట్‌ఫారం మహిలకు తమ తమ వ్యాపారాలకు సంబంధించి ఇంక్యుబేటర్ మద్దతు, మెంటార్‌షిప్, ఫండింగ్ సదుపాయాలు, పన్నుచెల్లింపు, ఇతర రకాల మద్దతు వంటి వాటిని , మార్గినిర్దేశాన్ని కల్పిస్తుంది.
ప్రస్తుతం మహిళా ఎంటర్ ప్రెన్యుయర్ షిప్ ప్లాట్‌ఫారం లో 21 వేల రిజిస్టర్డ్ వినియోగదారులు ఉన్నారు. 37 మంది భాగస్తులతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. (ప్రస్తుతం ఉన్నవి 30 కాగా, 7 కొత్తగా ఆమోదం పొందిన భాగస్వామ్య సంస్థలవి, వీటి కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.)
మరిన్ని వివరాలకు సంబంధించిన ప్రధాన లింక్‌లు...
https://wep.gov.in/.
https://www.niti.gov.in/women-entrepreneurship-platform
https://www.niti.gov.in/sites/default/files/2021-03/MovingTheNeedle_08032021-compressed.pdf
***
(Release ID: 1760975)
Visitor Counter : 250