గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శ్రీ హర్దీప్ సింగ్ పూరి సఫాయి మిత్రలను సత్కరించారు;


అన్ని పట్టణ స్థానిక సంస్థలు తమ ప్రాంతాలలో పారిశుధ్య కార్మికులను సన్మానిస్తున్నాయి

Posted On: 02 OCT 2021 2:27PM by PIB Hyderabad

కేంద్ర గృహనిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలు & పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఈరోజు న్యూ ఢిల్లీలోని సెంట్రల్ పార్క్ వద్ద సఫాయ్ మిత్రాస్ మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులను సన్మానించారు. ఆయనతో పాటు గృహ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్, విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ మీనాకాశి లేఖి, గృహ మరియు పట్టణ వ్యవహారాల కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా, ఛైర్‌పర్సన్, ఎన్‌డిఎంసి శ్రీ ధర్మేంద్ర మరియు వైస్ ఛైర్‌పర్సన్,ఎన్‌డిఎంసి శ్రీ సతీష్ ఉపాధ్యాయలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ పూరి మాట్లాడుతూ " మహాత్మా గాంధీ పరిశుభ్రతకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారని, మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని మరియు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని 1916 లోనే పౌరులకు పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతిపిత సంకల్పానికి ఒక నిర్దిష్ట రూపాన్ని అందించారు మరియు 7 సంవత్సరాల క్రితం స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌పిఎం) ని ప్రారంభించారు. ఈ మిషన్ భౌతిక మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను సృష్టించడమే కాకుండా ప్రజలలో అవగాహన కల్పించడంలో మరియు ప్రజల ఉద్యమంగా మార్చడంలో విజయవంతమైంది. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి సఫాయ్ మిత్రులు మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులు  అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, ముఖ్యంగా కోవిడ్ కాలంలో, ఎస్‌బిఎంవిజయం వారికి పెద్ద మొత్తంలో రుణపడి ఉంటుందని" శ్రీ పూరి అన్నారు. ఎస్‌బిఎం విజయానికి విశ్వసనీయత ఉందని, దాని కొలత మరియు ధృవీకరణ థర్డ్ పార్టీ ద్వారా జరుగుతుందని ఆయన అన్నారు. 2019 నాటికి దేశమంతా బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మారిందని, నిన్న ప్రధాని ప్రారంభించిన ఎస్‌బిఎం-2.0, వచ్చే ఐదేళ్లలో దేశాన్ని చెత్త రహితంగా మార్చాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ పూరి చెప్పారు. అమృత్ -2.0 గురించి మాట్లాడుతూ ఇది నగరాలను 'ఆత్మనిర్భర్' మరియు 'వాటర్ సెక్యూరిటీ' చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు.

రాబోయే రెండు రోజుల్లో, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది సఫాయి మిత్రలు మరియు స్వచ్ఛత వారియర్స్ అర్బన్ స్థానిక సంస్థలచే సత్కరించబడతారని,  వెబ్ పోర్టల్ ద్వారా అది రికార్డ్ చేయబడుతుందని మంత్రి చెప్పారు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో వారి ప్రధాన పాత్ర మరియు సహకారాన్ని గుర్తించడానికి ఇది ఒక మార్గం అని ఆయన అన్నారు.

గౌరవనీయులైన ప్రధాన మంత్రి నాయకత్వం మరియు చొరవ ఎస్‌బిఎం విజయానికి కీలకమైనవని శ్రీ కౌశల్ కిషోర్ అన్నారు. మిషన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల అలవాటులో పరిశుభ్రత  భాగమైందని ఆయన అన్నారు. తద్వారా వ్యాధులు వ్యాప్తి తగ్గడంతో పాటు మెరుగైన ఆరోగ్యం మరియు మెరుగైన జీవితానికి దారితీసింది. మద్యపానం లేదా మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండటం ద్వారా పౌరులు తమ పరిసరాలను శుభ్రపరచడమే కాకుండా వారి అంతర్గత స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

మన పరిసరాలలో పెద్ద మార్పును తీసుకురావడంలో సఫాయ్ మిత్రాస్ యొక్క ముఖ్యమైన పాత్రపై శ్రీమతి లేఖి నొక్కిచెప్పారు.

సఫాయి మిత్రుల సహకారానికి శ్రీ మిశ్రా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ సమయంలో ఎంఓహెచ్‌యుఎ ద్వారా కొత్త ప్రోటోకాల్‌లు జారీ చేయబడ్డాయని, పరిశుభ్రతతో పాటు కార్మికుల భద్రతకు భరోసా ఇచ్చామని ఆయన చెప్పారు. కోవిడ్ -19 సమయంలో వారి సహకారం లేకుండా, స్వచ్ఛత కార్యకలాపాలు పూర్తి వేగంతో చేపట్టకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన అన్నారు. ఇప్పుడు మ్యాన్‌హోల్స్ మెషిన్ హోల్స్‌గా మారాయని, శుభ్రం చేయడానికి మురుగు కాలువలోకి దిగే సందర్భాలు అరుదుగా మారుతున్నాయని, ఒకవేళ ఎవరైనా చేయాల్సి వచ్చినప్పటికీ, అది పూర్తి రక్షణ గేర్‌తో మరియు ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా, శ్రీ పూరి అక్కడ ఉన్న వారందరితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ కూడా చేశారు.


 

***


(Release ID: 1760500) Visitor Counter : 139