సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డీడీ కాశ్మీర్ లో గంటసేపు లడఖీ భాషలో కార్యక్రమాల ప్రసారం


ఇటీవల లేహ్ లో శ్రీ అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా నిర్ణయం

Posted On: 02 OCT 2021 4:45PM by PIB Hyderabad

డీడీ కాశ్మీర్ లో ఇకపై లడఖీ భాషలో గంటసేపు ప్రసారం అవుతాయి. ఇంతవరకు 30 నిముషాల సేపు ఈ ప్రసారాలు జరిగేవి. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి లడఖీ ప్రసారాల సమయాన్ని గంటకి పొడిగించారు. దీనిలో వార్తలను ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తారు. స్థానిక సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రాంతంలో అమలు జరుగుతున్న అధివృద్ధి కార్యక్రమాలు, లడఖ్ స్థానిక వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న లక్షంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇటీవల లేహ్ లో పర్యటించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ లేహ్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని డీడీ కాశ్మీర్ లో లడఖీ కార్యక్రమాలను ఎక్కువ సమయం ప్రసారం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇంతవరకు లడఖీ భాషలో సాయంకాలం  6.30 నుంచి 7 వరకు డీడీ కాశ్మీర్ లో ప్రసారం అయ్యేవి. ఇకపై ఇవి సాయంకాలం 6.30 నుంచి 7 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు ప్రసారం అవుతాయి.



(Release ID: 1760487) Visitor Counter : 127