కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలి క‌మ్యూనికేష‌న్స్ శాఖ కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కె. రాజారామ‌న్

Posted On: 01 OCT 2021 1:04PM by PIB Hyderabad

 భార‌త ప్ర‌భుత్వ టెలిక‌మ్యూనికేష‌న్స్  శాఖ కార్య‌ద‌ర్శి అన్షు ప్ర‌కాష్ ఐఎఎస్ (యుటిః 86) ప‌ద‌వీకాలం 30 సెప్టెంబ‌ర్ 2021న పూర్తి కావ‌డంతో ఆ స్థానంలో కె. రాజారామ‌న్ ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. ఇంత‌కు ముందు ఆయ‌న ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఆర్థిక వ్య‌వ‌హారాల శాఖ‌, పెట్టుబ‌డులు& మౌలిక స‌దుపాయాల అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. 

 


త‌మిళ‌నాడు కేడ‌ర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీసుల అధికారి కె. రాజారామ‌న్‌. ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంలో ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ఆర్ధిక వ్య‌వ‌హారాల శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా, ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని వ్య‌య శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంలో ఆయ‌న చెన్నై మెట్రో రైల్వే లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్‌,  వాణిజ్య ప‌న్నుల క‌మిష‌న‌ర్ స‌హా ప‌లు కీల‌క ప‌ద‌వుల‌ను నిర్వ‌హించారు. 

***


 



(Release ID: 1760084) Visitor Counter : 45