రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రజా రవాణా, లాజిస్టిక్స్‌ను 100 శాతం హరిత, స్వచ్ఛ ఇంధన వనరులకు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: శ్రీ నితిన్ గడ్కరీ
प्रविष्टि तिथि:
01 OCT 2021 4:23PM by PIB Hyderabad
ప్రజా రవాణా, లాజిస్టిక్స్‌ను 100 శాతం హరిత, స్వచ్ఛ ఇంధన వనరులకు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, 'కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ' మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ వెల్లడించారు. "ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ టెక్నాలజీ" సమావేశంలో వర్చువల్ పద్ధతిలో పాల్గొన్న శ్రీ గడ్కరీ; రవాణా రంగం ప్రయోజనం కోసం హైడ్రోజన్ సాంకేతికతలను అభివృద్ధి చేసే లక్ష్యంతో, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జాతీయ హైడ్రోజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. హరిత హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంలో భారత్‌ను అగ్రగామిగా నిలపాలన్నది కూడా ఈ కార్యక్రమం ఉద్దేశంగా చెప్పారు.
హరిత హైడ్రోజన్ ఉత్పత్తి వ్యయంలో 70% విద్యుత్ ధరల నుంచి తిరిగి వస్తుంది. కాబట్టి, పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి మిగులే విద్యుత్, హరిత హైడ్రోజన్ ఉత్పత్తి ఆర్థికతను పూర్తిగా మార్చగలదు. హరిత హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా చెబుతారు. "సున్నా కార్బన్ ఉద్గారాల" లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడే ఏకైక ఇంధనంగా గడ్కరీ పేర్కొన్నారు.
భారతదేశ 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు ప్రారంభమైనందున ఈ ఏడాది ప్రత్యేకమైనదిగా శ్రీ గడ్కరీ అభివర్ణించారు. అన్ని రంగాలలో ఆత్మనిర్భర్‌గా అవతరించడానికి ప్రధాని నేతృత్వంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మన ఆటోమొబైల్ రంగం దేశానికే గర్వకారణమని, ఇది భారతదేశ ఉత్పత్తిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుందని అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సరితూగడమే కాదు, అంతకంటే మెరుగైన స్థితికి తీసుకువెళుతుందనే నమ్మకం ఉందని కేంద్ర మంత్రి అన్నారు.
దేశ వాహన పరిశ్రమలో 'ఆధునిక వాహన సాంకేతిక ఉత్పత్తుల'ను పెంచడం లక్ష్యంగా 'ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకం' (పీఎల్‌ఐ) పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. శిలాజ ఇంధన ఉద్గారాలను తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రూ.42,500 కోట్లకు మించిన కొత్త పెట్టుబడులు, 7.5 లక్షల అదనపు ఉద్యోగాలు వస్తాయని
ప్రభుత్వం భావిస్తోందని శ్రీ గడ్కరీ చెప్పారు.
దిగుమతి చేసుకుంటున్న ఇంధనానికి ప్రత్యామ్నాయం, తక్కువ ఖర్చుతో కూడినది, కాలుష్యం లేనిది, దేశీయ రవాణా అవసరాలను తీర్చగలిగే పరిష్కారం ప్రజా రవాణాకు అత్యవసరమని; ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇథనాల్, పెట్రోల్ రెండింటితోనూ నడిచే వాహనాలను అనుమతించే 'సౌలభ్య-ఇంధన' వాహనాలను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని శ్రీ గడ్కరీ చెప్పారు. సౌలభ్య ఇంజిన్ ఆధారిత వాహనాలు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, కెనడాలో నడుస్తున్నాయని తెలిపారు. ఆ సాంకేతికత అందుబాటులోనే ఉందని, భారతదేశంలోని రవాణా రంగాన్ని శాశ్వతంగా మార్చే అడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ప్రజా భద్రత దృష్ట్యా, ప్రతి సంవత్సరం మాదిరిగానే రహదారుల్లో మెరుగుదల అవసరమని మంత్రి చెప్పారు. దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపారు. ఐరోపా దేశాల్లో సున్నా ప్రమాదాలు, సున్నా ప్రాణనష్టం సాధించిన 'జీరో విజన్'ను మన దేశంలోనూ అనుసరిస్తున్నామని శ్రీ గడ్కరీ వివరించారు.
***
(रिलीज़ आईडी: 1760078)
आगंतुक पटल : 156