ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
89 కోట్ల మైలురాయిని దాటేసిన భారత సంచిత కోవిడ్ -19 టీకా కవరేజీ
- గడిచిన 24 గంటలలో 64.40 లక్షలకు పైగా టీకాలు ఇవ్వడం జరిగింది.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.86 శాతంగా నమోదయింది; మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం
- గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయ్యాయి
- భారతదేశ యాక్టివ్ కేస్‌లోడ్ (2,75,224) మొత్తం కేసులలో 0.82 శాతంగా నమోదైంది
- గడిచిన 98 రోజులకు 3% కంటే తక్కువ వీక్లీ పాజిటివిటీ రేటు (1.70%) నమోదైంది
Posted On:
01 OCT 2021 10:04AM by PIB Hyderabad
గడిచిన 24 గంటల్లో 64,40,451 టీకాలను వేయడం ద్వారా, భారతదేశపు కోవిడ్-19 టీకా కవరేజ్ ఈ రోజు ఉదయం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న తాత్కాలిక నివేదికల ప్రకారం 89 కోట్ల (89,02,08,007) మైలురాయిని దాటింది. ఇది 86,46,674 సెషన్ల ద్వారా సాధించబడింది.
ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక నివేదిక ప్రకారం సంచిత సంఖ్య వివరాలు ఇలా ఉన్నాయి..
హెచ్‌సీడబ్ల్యులు
|
మొదటి డోసు
|
1,03,72,796
|
రెండో డోసు
|
88,95,117
|
ఎఫ్ఎల్‌డబ్ల్యులు
|
మొదటి డోసు
|
1,83,52,779
|
రెండో డోసు
|
1,50,06,337
|
18-44 సంవత్సరాల వారికి
|
మొదటి డోసు
|
36,05,69,116
|
రెండో డోసు
|
8,30,27,778
|
45-59 సంవత్సరాల వారికి
|
మొదటి డోసు
|
15,95,61,641
|
రెండో డోసు
|
7,68,32,812
|
60 సం.ల వయసు పైబడిన వారు
|
మొదటి డోసు
|
10,13,72,713
|
రెండో డోసు
|
5,62,16,918
|
మొత్తం
|
89,02,08,007
|
గత 24 గంటల్లో 28,246 మంది రోగులు కోలుకోవడంతో కోలుకున్న రోగుల సంచిత సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి) 3,30,43,144 కి పెరిగింది. పర్యవసానంగా, భారత రికవరీ రేటు 97.86%గా చేరింది. రికవరీ రేటు ప్రస్తుతం మార్చి 2020 నుండి అత్యధిక శిఖరం వద్ద నిలిచింది.

కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నిరంతర మరియు సహకార ప్రయత్నాల కారణంగా రోజువారీ కొత్త కేసల సంఖ్య
50,000 రోజుల కంటే తక్కువగా ఉంటున్న ధోరణి కొనసాగుతోంది. ఈ ధోరణి కొనసాగుతుండడం ఇప్పుడు వరుసగా ఇది 96 రోజులు కావడం విశేషం. గడిచిన 24 గంటల్లో 26,727 కొత్త కేసులు నమోదయ్యాయి.

యాక్టివ్ కేస్‌లోడ్ ప్రస్తుతం 2,75,224 గా ఉంది. ఇది 196 రోజుల్లో అత్యల్పం. యాక్టివ్ కేసులు ప్రస్తుతం దేశంలోని మొత్తం పాజిటివ్ కేసులలో 0.82 శాతంగా ఉన్నాయి

దేశవ్యాప్తంగా పరీక్ష సామర్థ్యం విస్తరిస్తూనే ఉంది. గత 24 గంటల్లో మొత్తం 15,20,899 పరీక్షలు నిర్వహించారు. భారతదేశం ఇప్పటివరకు 57.04 కోట్ల (57,04,77,338) కోవిడ్ సంచిత పరీక్షలను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 పరీక్షా సామర్థ్యం మెరుగుపరచబడినప్పటికీ, గత 98 రోజులుగా వీక్లీ పాజిటివిటీ రేటు 1.70% అంటే 3% కంటే తక్కువగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.76%గా నివేదించబడింది. గత 32 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3% కంటే తక్కువగా ఉంది. మరియు వరుసగా 115 రోజులకు 5% కంటే తక్కువగా ఉంటూ వస్తోంది.

****
(Release ID: 1759990)
Visitor Counter : 200