రక్షణ మంత్రిత్వ శాఖ
సిఐఎస్‌సి బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ
Posted On:
01 OCT 2021 11:54AM by PIB Hyderabad
కీలకాంశాలుః
నియమిత ఫైటర్ పైల్; దఆదాపు 38 ఏళ్ళ విశిష్టమైన వృత్తిజీవితం
ఎన్‌డిఎ పూర్వ విద్యార్ధి & 5,000 గంటల విమానాలు నడిపిన అనుభవం
1986లో శౌర్యచక్ర, 1987లో ఎవిఎస్ఎం గ్రహీత
ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సిఐఎస్‌సి), చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చైర్మన్ గా ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ 01 అక్టోబర్, 2021న బాధ్యతలు స్వీకరించారు. న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థలిలో మృతిచెందిన వీరులకు సిఐఎస్‌సి నివాళులు అర్పించారు, అనంతరం త్రివిధ దళాల గార్డ్ ఆఫ్ ఆనర్‌ను స్వీకరించారు.
ఫైటర్ పైలెట్ గా 1983లో నియమితులైన ఎయిర్ మార్షల్ కృష్ణ 38 ఏళ్ళ తన వృత్తి జీవితంలో విశిష్ట సేవలను అందించారు. ఫ్లైయింగ్ ఇనస్ట్రక్టర్‌గాను, ప్రయోగాత్మక టెస్ట్ పైలెట్‌గానూ అర్హత కలిగిన కృష్ణ, భారత వైమానిక దళం (ఐఎఎఫ్)కు గల పలురకాల ఫైటర్, రవాణా విమానాలను, హెలికాప్టర్లను నడిపారు. ఆయనకు నిర్వహణ, బోధన, టెస్ట్ ఫ్లైయింగ్‌లో 5,000 గంటల అనుభవం ఉంది. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడెమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ల పూర్వ విద్యార్ధి.
తన ఘనమైన వృత్తి జీవితంలో సిఐఎస్‌సి అనేక కీలక కమాండ్, స్టాఫ్ పదవులను నిర్వహించారు. ఆయన ఫ్రంట్‌లైన్ ఫైటర్ స్క్వాడ్రన్, ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్‌ను నిర్వహించారు.ఞక ఫార్వార్డ్ ఎయిర్ బేస్‌కు ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా, ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టం టెస్టింగ్ సంస్థకు కమాండెంట్‌గా ఉండటమే కాక, ఫ్రంట్ లైన్ ఎయిర్‌బేస్ ను నిర్వహించారు.
ఎయిర్ మార్షల్ బిఆర్ కృష్ణ వైమానిక దళ కేంద్రకార్యాలలయంలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్రాజెక్ట్‌లు), అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (ప్లాన్స్) పదవులను నిర్వహించారు. ఎయిర్ మార్షల్‌గా ఆయన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌కు సీనియర్ స్టాఫ్ అధికారిగా & ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరించారు. ఆయన సిఐఎస్‌సి బాధ్యతలు స్వీకరించక ముందు పశ్చిమ ఎయిర్ కమాండ్ ను నిర్వహిస్తున్నారు. ఆయన సాహసానికి 1986లో శౌర్యచక్రను, విశిష్ట సేవలకు 1987లో అతి విశిష్ట సేవా మెడల్‌ను అందుకున్నారు.
***
(Release ID: 1759985)
Visitor Counter : 215