ప్రధాన మంత్రి కార్యాలయం
జల్జీవన్ మిశన్ అంశం పై గ్రామ పంచాయతీలు, పానీ సమితిలతో అక్టోబరు 2నమాట్లాడనున్న ప్రధాన మంత్రి
‘జల్ జీవన్ మిశన్ ఏప్’ ను, ‘రాష్ట్రీయజల్ జీవన్ కోశ్’ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు
Posted On:
01 OCT 2021 12:16PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 అక్టోబర్ 2న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జల్ జీవన్ మిశన్ అంశం పై గ్రామ పంచాయతీలతోను, పానీ సమితులు/ విలేజ్ వాటర్ ఎండ్ శానిటేశన్ కమిటీల (విడబ్ల్యుఎస్ సి స్) తోను సమావేశం కానున్నారు.
జల్ జీవన్ మిశన్ లో భాగం అయిన పథకాలలో సాధ్యమైనంత ఎక్కువ పారదర్శకత్వాన్ని, జవాబుదారుతనాన్ని ప్రోత్సహించాలన్న, మిశన్ స్టేక్ హోల్డర్స్ లో చైతన్యాన్ని పెంచాలన్న ఉద్దేశ్యాల తో ‘జల్ జీవన్ మిశన్ ఏప్’ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి ‘రాష్ట్రీయ జల్ జీవన్ కోశ్’ ను కూడా ప్రారంభించనున్నారు. ఈ నిధి కి ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా, ఏ కంపెనీ అయినా, లేదా ఏ సమాజ సేవాభిలాషులు అయినా.. వారు భారతదేశాని కి చెందిన వారు అయినా గాని, లేదా విదేశాల లో ఉంటున్నా గానీ గ్రామీణ ప్రాంతాల కుటుంబాల కు, పాఠశాలల కు, ఆంగన్ వాడీ కేంద్రాల కు, ఆశ్రమశాలల కు, ఇంకా ఇతర సార్వజనిక సంస్థల కు నల్లా నీటి కనెక్శన్ లను అందించడం కోసం తమ వంతు తోడ్పాటు ను అందించవచ్చును.
అదే రోజు న ‘జల్ జీవన్ మిశన్’ అంశం పై దేశవ్యాప్తం గా గ్రామ సభల ను కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభల లో గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ ల తాలూకు ప్రణాళిక ల రూపకల్పన, వాటి నిర్వహణ లను గురించి చర్చించడం తో పాటు దీర్ఘకాలిక జల సురక్ష దిశ లో కార్యాలను చేపట్టడం జరుగుతుంది.
పానీ సమితులు/విడబ్ల్యుఎస్ సి లను గురించి:
పల్లెల లో నీటి సరఫరా వ్యవస్థ ల ప్రణాళిక రచన, కార్యాచరణ, నిర్వహణ, మరమ్మతుల లో పానీ సమితులు ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషిస్తాయి. ఈ పనుల ద్వారా ప్రతి కుటుంబాని కి శుద్ధమైన నల్లా నీటి ని క్రమం తప్పక దీర్ఘకాలం పాటు అందేటట్లు చూడటం జరుగుతుంది.
మొత్తం 6 లక్షల కు పైగా గ్రామాల లో నుంచి సుమారు 3.5 లక్షల గ్రామాల లో పానీ సమితుల ను/విడబ్ల్యుఎస్ సి లను ఏర్పాటు చేయడం జరిగింది. ఫీల్డ్ టెస్ట్ కిట్స్ ను ఉపయోగించడం ద్వారా నీటి నాణ్యత ను పరీక్షించడం కోసం 7.1 లక్షల మంది కి పైగా మహిళల కు శిక్షణ ను ఇవ్వడమైంది.
జల్ జీవన్ మిశన్ ను గురించి:
ప్రతి ఒక్క కుటుంబాని కి శుద్ధమైన నల్లా నీటి ని అందించడం కోసం జల్ జీవన్ మిశన్ ను ప్రధాన మంత్రి 2019 ఆగస్టు 15 న ప్రకటించారు. ఆ మిశన్ ప్రారంభించేటప్పటి కి కేవలం 3.23 కోట్ల గ్రామీణ కుటుంబాలు నల్లా నీటి సరఫరా సదుపాయాని కి నోచుకొన్నాయి. ఇది 17 శాతాని కి సమానం గా ఉంది.
గడచిన రెండు సంవత్సరాల కాలం లో కోవిడ్-19 మహమ్మారి స్థితి ఉత్పన్నం అయినప్పటికీ కూడాను 5 కోట్ల కు పైగా కుటుంబాల కు నల్లా నీటి కనెక్శన్ లను సమకూర్చడం జరిగింది. ఇప్పటివరకు చూస్తే రమారమి 8.26 కోట్ల గ్రామీణ కుటుంబాలు వారి ఇళ్ళ లో నల్లాల ద్వారా నీటి ని అందుకొంటున్నాయి. అంటే ఈ సదుపాయం పొందిన వారు 43 శాతాని కి చేరుకొన్నారన్న మాట. 78 జిల్లాల లో, 58 వేల గ్రామ పంచాయతీల లో, 1.16 లక్షల పల్లెల లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్క గ్రామీణ కుటుంబం నల్లా నీటి సరఫరా సదుపాయాన్ని అందుకొంటున్నది. ఇంతవరకు, నల్లానీటి సరఫరా సౌకర్యాన్ని 7.72 లక్షల (76 శాతం) పాఠశాలల్లోను, 7.48 లక్షల (67.5 శాతం) ఆంగన్ వాడీ సెంటర్ ల లోను ఏర్పాటు చేయడమైంది.
ప్రధాన మంత్రి ప్రస్తావిస్తున్న ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ దృష్టి కోణాన్ని ఆచరణ లోకి తీసుకు రావడం కోసం, అలాగే, ‘బాటమ్ అప్ అప్రోచ్’ ను అనుసరిస్తూ రాష్ట్రాల భాగస్వామ్యం ద్వారా 3.60 లక్షల కోట్ల రూపాయల బడ్జెటు తో ‘జల్ జీవన్ మిశన్’ ను అమలుపరచడం జరుగుతున్నది. దీనికి అదనం గా, 2021-22 నుంచి 2025-26 సంవత్సరాల మధ్య కాలం లో పల్లెల లో స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం సంబంధి సదుపాయాల కల్పన కై 15వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక గ్రాంటు రూపం లో పంచాయతీరాజ్ ఇన్స్ టిట్యూశన్స్ కు 1.42 లక్షల కోట్ల రూపాయల ను ఇవ్వడమైంది.
***
(Release ID: 1759919)
Visitor Counter : 277
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam