ఆర్థిక మంత్రిత్వ శాఖ
హిందీ, ఇంగ్లీషు సహా 13 ప్రాంతీయ భాషలలో ప్రభుత్వరంగ బ్యాంకులు క్లెరికల్ రిక్రూట్‌మెంట్లు నిర్వహించాలని సూచించిందన ఆర్థిక మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
30 SEP 2021 4:23PM by PIB Hyderabad
పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు క్లెరికల్ రిక్రూట్‌మెంట్లు కొనసాగించాలని, కాగా, ఇకపై ప్రకటించబోయే ఖాళీలకు సంబంధించి జరుపబోయే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలను ఇంగ్లీషు, హిందీతో పాటుగా 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో క్లెరికల్ కేడర్ పరీక్షలను ప్రాంతీయ భాషలలో నిర్వహించే అవకాశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సూచన ఆధారంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కమిటీ చేసిన సూచనలు అందుబాటులోకి వచ్చేవరకు ఐబిపిఎస్ ప్రారంభించిన పరీక్షా ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేశారు.
స్థానిక యువతకు ఉపాధిలో సమాన అవకాశాలను ఇచ్చి, తద్వారా స్థానిక, ప్రాంతీయ భాషల ద్వారా వినియోగదారులపై పైచేయి కలిగి ఉండేలా చేయాలన్న లక్ష్యంతో కమిటీ పని చేసింది.
ప్రాంతీయ భాషలలో క్లెరికల్ పరీక్షలను నిర్వహించాలన్న నిర్ణయం భవిష్యత్తులలో ఎస్‌బిఐ భర్తీలకు కూడా వర్తిస్తుంది. ఇప్పటికే ఎస్‌బిఐ ఖాళీలను ప్రకటించి, నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు ప్రకటనకు అనుగుణంగా పూర్తి అవుతాయి.
(रिलीज़ आईडी: 1759714)
आगंतुक पटल : 787