వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

"ప్రపంచ సగటు 64 శాతం కంటే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ఫిన్‌టెక్


దత్తత రేటు 87 శాతం కలిగి ఉంది": శ్రీ పీయూష్ గోయల్

ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద డిజిటల్ మార్కెట్‌లలో ఒకటిగా మారుతుందని తెలిపిన వాణిజ్య మంత్రి

యుపిఐ బ్యాంకింగ్ ఇంటర్‌ఫేస్ గత నెలలో అత్యధికంగా 3.6 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది

గత సంవత్సరం 2 ట్రిలియన్ లావాదేవీలు ఆధార్ ఉపయోగించి ప్రాసెస్ అయ్యాయి

లాక్డౌన్, కోవిడ్ 2 వ వేవ్ సమయంలో కాంటాక్ట్‌లెస్ బ్యాంకింగ్‌ని ప్రోత్సహించడం ద్వారా
భారతదేశపు ఫిన్‌టెక్ పరిశ్రమ ప్రజలకు అండగా నిలిచిందని వివరించిన మంత్రి

Posted On: 30 SEP 2021 2:15PM by PIB Hyderabad

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మార్కెట్లలో ఒకటిగా అవతరిస్తుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు & ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 2 వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ -2021 లో ప్రసంగిస్తూ, " ప్రపంచ సగటు 64 శాతం తో పోలిస్తే ప్రపంచంలోనే అత్యధిక ఫిన్‌టెక్ దత్తత రేటు భారతదేశంలో 87 శాతం ఉంది. మే 2021 నాటికి, భారతదేశ యునైటెడ్ చెల్లింపుల ఇంటర్‌ఫేస్ (యుపిఐ) 224 బ్యాంకుల భాగస్వామ్యంతో, 68 బిలియన్ డాలర్ల విలువైన 2.6 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. ఆగస్ట్ 21 లో అత్యధికంగా 3.6 బిలియన్ లావాదేవీలను నమోదు చేసింది” అని శ్రీ గోయల్ అన్నారు. గత సంవత్సరం ఏఈపిఎస్ (ఆధార్-ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) ఉపయోగించి 2 ట్రిలియన్ లావాదేవీలు ప్రాసెస్ అయ్యాయని ఆయన చెప్పారు.

మహమ్మారి సమయంలో భారతదేశ ఫిన్‌టెక్ పరిశ్రమ ప్రజలకు అండగా నిలిచిందని, ముఖ్యంగా లాక్డౌన్, కోవిడ్ 2 వ వేవ్ సమయంలో భద్రంగా ఇళ్ల నుండే కీలకమైన కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పించిందని మంత్రి చెప్పారు.
"ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు" అని ప్రధాని మోదీ చెప్పినట్లుగా, ఇప్పుడు పౌరులు బ్యాంకుల వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు, బ్యాంకులు వారి ఇళ్లకు, వారి మొబైల్ ఫోన్‌లకు వచ్చాయి "అని ఆయన చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో 15 ఆగస్టు 2014 న తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో జన్ ధన్ యోజనను ప్రకటించినప్పటి నుండి భారతదేశం మిషన్ మోడ్‌లో డిజిటల్ పరివర్తనను చేపట్టిందని, 2 కోట్లకు పైగా ఈ పథకం కింద ఖాతాలు ప్రారంభం అయ్యాయని శ్రీ పియూష్ గోయల్ అన్నారు. ఇది ప్రపంచ రికార్డుగా పరిగణించవచ్చని ఆయన చెప్పారు.

"జే ఏ ఎం (జాన్ ధన్, ఆధార్, మొబైల్) త్రయం, డిబిటి తో పాటు, పారదర్శకత, సమగ్రత మరియు సకాలంలో ఆర్థిక ప్రయోజనాలు మరియు సేవలను భారతదేశ విస్తారమైన జనాభాకు అందించిందన్నారు. " జే ఏ ఎం త్రయం ఫిన్‌టెక్ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం భారతదేశానికి సాంకేతిక సామర్థ్యాలను అందిపుచ్చుకునేలా చేసింది" అని కేంద్ర మంత్రి తెలిపారు.

నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ కింద త్వరలో భారతదేశంలోని ప్రతి గ్రామం హైస్పీడ్ ఇంటర్నెట్‌ను కలిగి ఉంటుందని, ఈ శక్తిని భారతదేశాన్ని ఫిన్‌టెక్ ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. " మొబైల్, ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు వేగవంతమైన విస్తరణతో భారతదేశం అతిపెద్ద డిజిటల్ మార్కెట్‌లలో ఒకటిగా మారుతుందని నేను నమ్ముతున్నాను. భారతదేశం ఆత్మనిర్భర్‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, మన పరిశ్రమ, పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయగల పరిష్కారాలను ఉత్పత్తి చేయడానికి స్థానిక ప్రతిభను ఉపయోగించాలని కోరుకుంటున్నాము" అని శ్రీ గోయల్ వివరించారు. 

 ఫిన్‌టెక్ ఈ రోజు మొబైల్ యాప్‌లు, ఇ-కామర్స్ స్టోర్లు & అనేక ఇతర డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ల కోసం పెట్టుబడులను తీసుకువచ్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. "ఫిన్‌టెక్ సెక్టార్‌లో పెట్టుబడుల ప్రవాహం 2016 లో ప్రారంభమైనప్పటి నుండి 10 బిలియన్ డాలర్లకు పెరిగింది, ఇది ఏకకాలంలో కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ప్రపంచంలోని 3 వ అతి పెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా బలం వృద్ధి చెందుతుంది, ఇది అభివృద్ధి కోసం తహతహ లాడుతోంది” అని ఆయన తెలిపారు.ఎంబెడెడ్ ఫైనాన్స్ ఆవిర్భావం అనేది ఒక ఆసక్తికర అంశం. నేడు నాన్-ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఫిన్‌టెక్ పరిష్కారాలను స్వీకరించడంలో చురుకుగా ఉన్నాయి. వాటి విలువ గొలుసులు, మనం మరింత ఎక్కువ వినియోగించాలి ఫిన్‌టెక్ సేవలు అనులోమానుపాతంలో పెరుగుతాయి అని శ్రీ గోయల్ తెలిపారు. 
"మా ఎంఎస్ఎంఈలు కూడా క్రెడిట్, చెల్లింపులు, అకౌంటింగ్, పన్ను ఫైలింగ్ కోసం ఫిన్‌టెక్ పరిష్కారాలను వేగంగా స్వీకరించాయి. ప్రభుత్వం ఇటీవల ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్‌మెంట్ నెట్‌వర్క్ (ఓసిఈఎన్), అకౌంట్ అగ్రిగేటర్ (ఏఏ) ఫ్రేమ్‌వర్క్‌ను ప్రారంభించింది. ఇవి చాలా హానికి అవకాశం ఉన్న విభాగాలకు, ప్రత్యేకించి చిన్న వ్యాపారాలకు అధికారిక క్రెడిట్ ప్రవాహాన్ని కలిపిస్తాయి, పంపిణీ సంస్థలు ఖర్చులను తగ్గించడం ద్వారా ఆర్థిక సంస్థలు పెద్ద విభాగాలకు చేరుకోవడానికి సౌలభ్యాన్ని తీసుకువస్తాయి అని ఆయన తెలిపారు. 

2,100 ఫిన్‌టెక్‌లను కలిగిన భారత్ ఫిన్‌టెక్ మార్కెట్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి అని అన్నారు శ్రీ పియూష్ గోయల్ తెలిపారు. "చాలా భారతీయ ఫిన్‌టెక్ మార్కెట్లు యూనికార్న్‌లుగా ఉన్నాయి. భారతదేశ మార్కెట్ ప్రస్తుతం 31 బిలియన్ డాలర్లుగా ఉంది, 2025 నాటికి 84 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా ఉంది " అని ఆయన వెల్లడించారు. 

 

 

***



(Release ID: 1759709) Visitor Counter : 246