యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త భార‌త హాకీకి పున‌ర్‌వైభ‌వంహాకీకి

Posted On: 29 SEP 2021 11:32AM by PIB Hyderabad

భార‌త్‌కు  ఒలింపిక్స్‌లో హాకీ విభాగం నుంచి పతకం అందాల‌న్న కోరిక నెర‌వేరేందుకు మ‌న‌దేశ హాకీ జ‌ట్టుకు దాదాపుగా 41 సంవత్సరాల కాలం పట్టింది. టోక్యో ఒలింపిక్స్ 2020 లో దృఢమైన పురుషుల హాకీ జట్టు  భార‌త్‌కు ప‌త‌కం అందించి  తీపి విజయాన్ని సాధించిపెడుతూ  చరిత్రను తిరగరాసింది. టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త జ‌ట్టు సాధించిన‌ కాంస్యం కేవలం పతకం మాత్రమే కాదు.. అది కోట్లాది మంది దేశ ప్రజల ఆశల్ని, కలల సాకారం చేసిన మ‌ధురానుభూతి.  గ‌తంలో ప్రపంచ హాకీని భారతదేశం శాసించింది. ఒలింపిక్స్‌లో ఎనిమిది సార్లు  స్వర్ణ ప‌త‌క విజేతగా నిలిచింది. అయితే, గత నాలుగు దశాబ్దాలలో ఆధునిక హాకీకి అనుగుణంగా ఎద‌గ‌లేక‌పోతోంది. ఆస్టర్ టర్ఫ్ యొక్క ఆగమనం,ఆట నియమాలలో అపూర్వమైన మార్పులు ప్రపంచ స్థాయి పోటీలలో పోరాడుతున్న‌ భారత హాకీ అదృష్టం మందగింపున‌కు కారణమయ్యాయి. కానీ భారత హాకీ జట్టు కింది స్థాయి నుండి పైకి లేచి పుంజుకునే మార్గంలో సాగుతోంది. మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో చివరకు ఒలింపిక్స్‌లో అత్యధిక మంది కోరిన పతకాన్ని భారత్ గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయానికి భారత బృందాన్ని అభినందించిన‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, “ఇది స‌రికొత్త భారతదేశం, పూర్తి విశ్వాసంతో కూడిన భారతదేశం. ఇది చారిత్రాత్మక రోజు, ఈ రోజు ప్రతి భారతీయుడి జ్ఞాపకార్థం ఎప్ప‌టికీ నిలిచి ఉంటుంది.  స్వ‌దేశానికి కాంవారు మన దేశంలోని యువతకు కొత్త ఆశను అందించారు. వారు మన దేశంలోని యువతకు కొత్త ఆశను అందించారు."  అని పేర్కొన్నారు.  అభినందన వేడుకలో బృందంలోని క్రీడాకారులు అంద‌రూ త‌మ‌త‌మ సంత‌కాల‌తో కూడిన హాకీ స్టిక్‌ను ప్రధాన మంత్రికి అందజేశారు. ఇప్పుడు లక్షలాది మంది భావి హాకీ క్రీడాకారులకు రెక్కలు అందించిన ఈ స్టిక్, ప్రధాన మంత్రి అందుకున్న బహుమతుల ఆన్‌లైన్ బిడ్ వ‌స్తువుల‌లో చేర్చబడింది. ఈ స్టిక్‌ను ఎవరు పొందాలనుకుంటున్నారో వారు,, ప్ర‌ధాని ఆన్‌లైన్ బిడ్డింగ్ సైట్ - pmmementos.gov.in/ లో పాల్గొని పొంద‌వ‌చ్చు. సెప్టెంబర్ 17 నుండి ప్రారంభమైన ఈ ఆన్‌లైన్ బిడ్ అక్టోబర్ 7 వరకు కొనసాగుతుంది. వేలం ద్వారా సేకరించిన మొత్తం నమామి గంగే ప్రాజెక్ట్, గంగా నది పరిరక్షణ మరియు పునరుజ్జీవన కార్యక్రమానికి ఖర్చు చేయబడుతుంది.
                                                                               

*****


(Release ID: 1759470) Visitor Counter : 183