ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

రాజ్ కోట్-కనాలూస్ రైలు మార్గం డబ్లింగ్ కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి


ఈ ప్రాజెక్టు కు మొత్తం అంచనా వ్యయం 1,080.58 కోట్ల రూపాయలు ఉండవచ్చు;   దీని వ్యయం 1,168.13 కోట్ల రూపాయల కు పెరగవచ్చు

ఈ రైలు డబ్లింగ్ తాలూకు మొత్తం పొడవు 111.20 కిలో మీటర్లు

ఈ సెక్షన్ డబ్లింగ్ తో దీని సామర్థ్యం పెరగనుంది.  అంతేకాకుండా, వ్యవస్థ లోకి మరిన్ని రైళ్ళ రాకపోకల కు అవకాశం ఏర్పడుతుంది.  రాజ్ కోట్ నుంచి కనాలూస్   వరకు ప్రతిపాదించిన డబ్లింగ్ పని సౌరాష్ట్ర ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి కి బాట ను పరుస్తుంది

Posted On: 29 SEP 2021 3:54PM by PIB Hyderabad

రాజ్ కోట్- కనాలూస్   రైలు మార్గం డబ్లింగ్  కు గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల పై ఏర్పాటైన మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది.  ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 1,080.58 కోట్ల రూపాయలు గా ఉండవచ్చు.  అంతేకాకుండా, దీని మొత్తం వ్యయం 1,168.13 కోట్ల రూపాయల కు పెరిగే ఆస్కారం ఉంది.  ఈ మార్గం డబ్లింగ్ మొత్తం 111.20 కి.మీ పొడవు తో ఉంటుంది.  నాలుగు సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయడం జరుగుతుంది.

ఈ సెక్షను లో ప్రస్తుతం జరుగుతున్న సరకుల రవాణా లో ఆహార ధాన్యాలు, ఎరువులు, సిమెంటు, బొగ్గు, ఇంకా పిఒఎల్ ఉన్నాయి.  ఈ సరకుల ను ఈ ప్రాజెక్టు మార్గాన్ని ఆనుకొని ఉన్న పరిశ్రమల నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది.  రిలయన్స్ పెట్రోలియమ్, ఎస్సార్ ఆయిల్, టాటా కెమికల్ వంటి పెద్ద పరిశ్రమల నుంచి భవిష్యత్తు లో గణనీయమైన స్థాయి లో సరకుల చేరవేత కు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.  రాజ్ కోట్- కనాలూస్   మధ్య ఒకే మార్గం తో కూడిన బ్రాడ్ గేజ్ సెక్షన్ లో సామర్ధ్యాని కి మించి రాకపోకలు జరిగాయి.  దీనికి కార్యకలాపాల లో ఒత్తిడి ని తగ్గించడం కోసం ఒక సమాంతర బిజి లైను ను అదనం గా సమకూర్చవలసిన అవసరం ఉంది.  ఈ సెక్షన్ లో ప్రయాణికుల రైళ్ళు /మెయిల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు 30 జతలు రాకపోకలు జరుపుతున్నాయి.  ఈ మార్గం లో డబ్లింగ్ అనంతరం ప్రయాణికుల కు రాకపోకల తో పాటుగా, సరకు రవాణా తాలూకు ఒత్తిడి చెప్పుకోదగిన స్థాయి లో సడలిపోతుంది.  ఈ సెక్షన్ లో రెండు మార్గాల ను అందుబాటులోకి తీసుకు వచ్చిన అనంతరం వ్యవస్థ లోకి మరిన్ని రైళ్ళ రాకపోక లను మొదలు పెట్టవచ్చును.  రాజ్ కోట్ నుంచి  కనాలూస్  వరకు రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసినందువల్ల అది సౌరాష్ట్ర ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి కి దారి తీయగలుగుతుంది.



 

****



(Release ID: 1759361) Visitor Counter : 153