భారత ఎన్నికల సంఘం
లోక్.సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల షెడ్యూల్!
Posted On:
28 SEP 2021 12:23PM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 3 పార్లమెంటరీ నియోజకవర్గాలకు, 30 శాసనసభ నియోజవర్గాలకు ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, వరదలు, పర్వదినాలు, కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న శీతాకాల పరిస్థితులను, సంబంధిత రాష్ట్రాలనుంచి, కేంద్ర పాలిత ప్రాంతాలనుంచి అందిన సమాచారం, అభిప్రాయాలపై సమీక్ష జరిపిన అనంతరం ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాద్రా నాగర్ హవేళీ, డామన్-డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాలు, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ పరిధిలోన ఉన్న 3 లోక్ సభ నియోజకవర్గాలు, కొన్ని ఇతర రాష్ట్రాల్లోని 30 శాసనసభ నియోజకవర్గాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉప ఎన్నికల షెడ్యూలును ఈ దిగువన చూడవచ్చు. :
లోక్ సభ నియోజకవర్గాలు
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
లోక్.సభ నియోజకవర్గం సంఖ్య, పేరు
|
-
|
దాద్రా నాగర్ హవేళీ-
డామన్ డయ్యూ
|
దాద్రా నాగర్ హవేళీ
|
-
|
మధ్యప్రదేశ్
|
28-ఖాండ్వా
|
-
|
హిమాచల్ ప్రదేశ్
|
2-మండీ
|
అసెంబ్లీ నియోజకవర్గాలు
క్రమసంఖ్య.
|
రాష్ట్రం
|
అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య, పేరు
|
-
|
ఆంధ్రప్రదేశ్
|
124-బద్వేలు (ఎస్.సి)
|
-
|
అస్సాం
|
28-గోస్సాయ్ గావ్
|
-
|
అస్సాం
|
41-భబానీపూర్
|
-
|
అస్సాం
|
58-తముల్పూర్
|
-
|
అస్సాం
|
101-మరియాని
|
-
|
అస్సాం
|
107-థోవ్రా
|
-
|
బీహార్
|
78-కుషెష్వార్ ఆస్ధాన్ (ఎస్.సి.)
|
-
|
బీహార్
|
164-తారాపూర్
|
-
|
హర్యానా
|
46-ఎల్లెనాబాద్
|
-
|
హిమాచల్ ప్రదేశ్
|
08-ఫతేపూర్
|
-
|
హిమాచల్ ప్రదేశ్
|
50-అర్కీ
|
-
|
హిమాచల్ ప్రదేశ్
|
65-జుబ్బాల్-కోఠ్కాయ్
|
-
|
కర్ణాటక
|
33-సింద్గీ
|
-
|
కర్ణాటక
|
82-హంగళ్
|
-
|
మధ్యప్రదేశ్
|
45-పృధ్వీపూర్
|
-
|
మధ్యప్రదేశ్
|
62-రాయ్.గావ్(ఎస్.సి.)
|
-
|
మధ్యప్రదేశ్
|
192-జోబాట్ (ఎస్.టి.)
|
-
|
మహారాష్ట్ర
|
90-దేగ్లూర్ (ఎస్.సి.)
|
-
|
మేఘాలయ
|
13-వావ్రింగ్.క్నెంగ్ (ఎస్.సి.)
|
-
|
మేఘాలయ
|
24-మావ్.ఫ్లాంగ్ (ఎస్.టి.)
|
-
|
మేఘాలయ
|
47-రాజబాలా
|
-
|
మిజోరాం
|
4-తుయ్రియాల్ (ఎస్.టి.)
|
-
|
నాగాలాండ్
|
58-షామ్.తోర్-చెస్సోర్ (ఎస్.టి.)
|
-
|
రాజస్థాన్
|
155-వల్లభనగర్
|
-
|
రాజస్థాన్
|
157-ధరీవాడ్ (ఎస్.టి.)
|
-
|
తెలంగాణ
|
31-హుజూరాబాద్
|
-
|
పశ్చిమ బెంగాల్l
|
7-దిన్హతా
|
-
|
పశ్చిమ బెంగాల్
|
86-శాంతిపూర్
|
-
|
పశ్చిమ బెంగాల్
|
109-ఖర్దాహా
|
-
|
పశ్చిమ బెంగాల్
|
127-గోసాబా (ఎస్.సి.)
|
ఆయా నియోజకవర్గాల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. 1951వ సంవత్సరపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 30వ సెక్షన్ నిబంధనల ప్రకారం ఎన్నికల కార్యక్రమాల తేదీలను, 30 (సి)వ సెక్షన్ ప్రకారం ఉపసంహరణ తేదీని ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. ఉప ఎన్నికల షెడ్యూల్ ఈ దిగువన సూచించినట్టుగా ఉంది:
షెడ్యూల్ 1: ఆంధ్రప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా,నాగర్ హవేళీ-డామన్, డయ్యూ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని లోక్.సభ నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్.
|
|
ఎన్నికల కార్యక్రమాలు
|
షెడ్యూల్-1
|
|
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ
|
01.10.2021
(శుక్రవారం)
|
|
నామినేషన్లకు ఆఖరు తేదీ
|
08.10.2021
(శుక్రవారం)
|
|
నామినేషన్లను పరిశీలించే తేదీ
|
11.10.2021
(సోమవారం)
|
|
అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
13.10.2021 (బుధవారం)
|
|
పోలింగ్ తేదీ
|
30.10.2021 (శనివారం)
|
|
వోట్ల లెక్కింపు తేదీ
|
02.11.2021
(మంగళవారం)
|
|
ఎన్నిక ప్రక్రియ ముగియాల్సిన తేదీ
|
05.11.2021
(శుక్రవారం)
|
|
షెడ్యూల్ 2: అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకోసం
|
Poll Events
|
Schedule 2
|
గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే తేదీ
|
01.10.2021
(శుక్రవారం)
|
నామినేషన్లకు ఆఖరు తేదీ
|
08.10.2021
(శుక్రవారం)
|
నామినేషన్లను పరిశీలించే తేదీ
|
11.10.2021
(సోమవారం)
|
అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
16.10.2021
(శనివారం)
|
పోలింగ్ తేదీ
|
30.10.2021 (శనివారం)
|
వోట్ల లెక్కింపు జరిగే తేదీ
|
02.11.2021
(మంగళవారం)
|
ఎన్నికల ప్రక్రియ పూర్తి కావలసిన తేదీ
|
05.11.2021
(శుక్రవారం)
|
- వోటర్ల జాబితా
పైన పేర్కొన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2021 జనవరి ఒకటవ తేదీ నాటికి ప్రచురితమైన వోటర్ల జాబితాను ఈ ఉప ఎన్నికల కోసం వినియోగిస్తారు.
- ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు (ఇ.వి.ఎం.లు), వి.వి.పి.ఎ.టి.లు
ఈ ఉపఎన్నికలు జరిగే అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఇ.వి.ఎం.లను,...వి.వి.పి.ఎ.టి.లను వినియోగించాలని కమిషన్ నిర్ణయించింది. ఇందుకు తగిన సంఖ్యలో ఇ.వి.ఎం.లను,..వి.వి.పి.ఎ.టి.లను అందుబాటులో ఉంచారు. ఈ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల సహాయంతో ఉప ఎన్నికల పోలింగ్.ను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకున్నారు.
- వోటర్ల గుర్తింపు
పోలింగ్ సందర్భంగా వోటర్ల గుర్తింపునకు,.. వోటర్ ఫొటో గుర్తింపు కార్డు (ఇ.పి.ఐ.సి.)ను ముఖ్యమైన పత్రంగా పరిగణిగిస్తారు. అయితే, ఈ కింద పేర్కొన్న గుర్తింపు పత్రాల్లో వేటినైనా సరే,.. వోటర్లు తమ తమ పోలింగ్ కేంద్రాల వద్ద చూపించవచ్చు.:
- ఆధార్ కార్డు,
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్.రెగా) జాబ్ కార్డు,
- బ్యాంకు లేదా పోస్టాఫీసు జారీ చేసిన ఫొటో పాస్ బుక్,
- కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏదైనా పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,
- డ్రైవింగ్ లైసెన్స్,,
- పాన్ కార్డు,
- జాతీయ జనాభా జాబితా (ఎన్.పి.ఆర్.) కింద రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ (ఆర్.జి.ఐ.) జారీ చేసిన స్మార్ట్ కార్డ్,
- భారతీయ పాస్.పోర్ట్,
- ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం,
- కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు(పి.ఎస్.యు.లు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు,
- ఎం.పి.లకు/ఎమ్మెల్యేలకు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు.
- ప్రవర్తనా నియమావళి
ఉప ఎన్నిక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా లేదా పాక్షికంగా విస్తరించిన జిల్లా, లేదా జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వచ్చినట్టుగా పరిగణిస్తారు. అయితే,..2017వ సంవత్సరం జూన్ 29వ తేదీన ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల (437/6/1NST/2016-CCS) సవరణకు లోబడి ఈ నియమావళి వర్తిస్తుంది. (ఇందుకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్ వెబ్.సైట్.లో అందుబాటులో ఉన్నాయి.).
- నేరపూరిత పరిణామాలు, నేపథ్యానికి సంబంధించిన సమాచారం
నేరపూరిత పరిణామాలు, సంఘటనల ప్రచురణకు నిర్ణీత గడువును ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. ఇందుకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ మరుసటి రోజునుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు 48 గంటలు ముందువరకూ ఈ గడువును నిర్దేశించారు.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఎన్నికల కమిషన్ వెబ్.సైట్లో అందుబాటులో ఉంటాయి. ఉత్తర్వుల కోసం,.. https://eci.gov.in/files/file/12265-broad-guidelines-of-election-commission-of-india-on-publicity-of-criminal-antecedents-by-political-parties-candidates/ అనే హైపర్.లింకును చూడవచ్చు.
బ్రిజేశ్ సింగ్ వర్సెస్ సునీల్ అరోరా తదితరులకు సంబంధించిన కోర్టు దిక్కరణ పిటిషన్ల కేసులో 2020 ఫిబ్రవరి 13, 2021 ఆగస్టు 10వతేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుసరణగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సవరణ ఉత్తర్వులను,.. ఎన్నికల కమిషన్ 2021 ఆగస్టు 26వ తేదీన ఒక లేఖ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు బట్వాడా చేసింది. సుప్రీంకోర్టు తీర్పులోని 73.వి. పేరాలోని ఆదేశాల ప్రకారం, రాజకీయ పార్టీలు తమ అభ్యర్థి ఎంపికైన 48 గంటల్లోగా ఫార్మాట్ సి-7ను ప్రచురించవలసి ఉంటుంది.
అభ్యర్థుల ఉపసంహరణ చివరితేదీ మరుసటి రోజునుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు 48 గంటల ముందు వరకు నేర సంఘటనల ప్రచురణకు గడువుగా ఎన్నికల కమిషన్ నిర్దేశించింది. ఇందుకు సంబంధించిన నిర్దిష్ట ఆదేశాలు కమిషన్ వెబ్.సైట్లో పొందుపరిచారు. ఉత్తర్వులకోసం https://eci.gov.in/files/file/12265-broad-guidelines-of-election-commission-of-india-on-publicity-of-criminal-antecedents-by-political-parties-candidates/ అనే హైపర్ లింక్.ను సందర్శించవచ్చు.
- ఉపఎన్నికలకు/ కోవిడ్ వ్యాప్తితో వాయిదా పడిన ఎన్నికలకు అనుసరించదగిన స్థూల
మార్గదర్శక సూత్రాలు
ఎన్నికల కమిషన్ 2020 ఆగస్టు 21వ తేదీన ఈ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. 09.10.2020, 09.04.2021, 16.04.2021, 21.04.2021, 22.04.2021, 23.04.2021, 28.04.2021 తేదీల్లో కూడా కమిషన్ పలు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ (eci.gov.in)లో లేదా https://eci.gov.in/candidate-political-parties/instructions-on-covid-19/ లింకులో ఈ మార్గదర్శక సూత్రాలు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కట్టడి లక్ష్యంతో తప్పనిసరిగా తీసుకోవలసిన చర్యలపై 2021 ఆగస్టు 21న జారీ చేసిన ఉత్తర్వులను కూడా 2021 సెప్టెంబరు 30వ తేదీవరకూ పొడిగించారు. వివిధ రాజకీయ పార్టీలనుంచి, వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులనుంచి అందిన సమాచారం మేరకు, కేంద్ర హోమ్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుంటూ, ఈ మార్గదర్శక సూత్రాలను ఎన్నికల కమిషన్ మరింత పటిష్టపరిచింది. దీనికితోడుగా,..కోవిడ్-19 వ్యాప్తి సమయంలో పశ్చిమ బెంగాల్ సాధారణ ఎన్నికల సందర్భంగా కమిషన్ అమలు చేసిన ఉత్తర్వులన్నింటినీ తగిన సవరణలతో ఈ ఉపఎన్నికలకు, కోవిడ్.తో వాయిదా పడి ఇపుడు నిర్వహిస్తున్నత ఎన్నికలకు అమలు చేస్తారు.
ఉపఎన్నికలకు సంబంధించిన భాగస్వామ్య వర్గాలన్నీ ఈ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఉత్తర్వుల అమలుకోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిగువన సూచించినట్టుగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది.
1
|
నామినేషన్
|
నామినేషన్.కు ముందు, ఆ తర్వాత కూడా ఊరేగింపుపై, బహిరంగ సభలపై నిషేధం అమలులో ఉంటుంది. / రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. నామినేషన్ దాఖలు సమయంలో కూడా ఊరేగింపుగా వెళ్లేందుకు అనుమతి లేదు.
|
2
|
ప్రచార వ్యవధి
|
|
(a) సమావేశాలకోసం
|
|
(i) లోపల
|
సమావేశం జరిగే హాలు, లేదా గది సామర్థ్యంలో 30శాతానికి, లేదా 200 మందికి అనుమతి. వీటిలో ఏ సంఖ్య తక్కువైతే ఆ సంఖ్యకు మాత్రమే అనుమతిస్తారు. సమావేశానికి హాజరయ్యే జనం సంఖ్య తదితర వివరాలతో ఒక రిజిస్టరును కూడా నిర్వహించవలసి ఉంటుంది.
|
|
(ii) బయట
|
ప్రధాన ప్రచార కర్తలు నిర్వహించే సమావేశాలకు సంబంధించి, మైదానం హాజరు సామర్థ్యంలో 50శాతం మందికి (కోవిడ్-19 మార్గదర్శక సూత్రాల మేరకు) లేదా వెయ్యి మందికి అనుమతి. ఇతర సందర్భాల్లో అయితే, హాజరు సామర్థ్యంలో 50 శాతం మందికి లేదా 500 మందికి అనుమతి. ఈ రెండు సందర్భాల్లోనూ ఏ సంఖ్య తక్కువైతే ఆ సంఖ్య మేరకే జనాన్ని అనుమతిస్తారు. సమావేశం ప్రాంతం యూవత్తునూ పూర్తిగా పోలీసుల రక్షణ వలయంలో ఉంచుతారు. సమావేశం కోసం ప్రవేశించే వారి సంఖ్య లెక్కింపుపై పర్యవేక్షణ ఉంటుంది.
పోలీసుల రక్షణ వలయానికి, బారికేడ్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చును అభ్యర్థి, సంబంధిత పార్టీ భరించవలసి ఉంటుంది. పోలీసుల పూర్తి రక్షణ వలయం ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు ఉన్న మైదానాలను మాత్రమే ర్యాలీలకు వినియోగిస్తారు.
|
|
(b) ప్రధాన ప్రచార కర్తలు
|
జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకైతే ఈ ఉప ఎన్నికల్లో 20మంది ప్రధాన ప్రచార కర్తలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గుర్తింపు లేని, రిజిస్టర్డ్ పార్టీల విషయంలో అయితే పది మంది ప్రధాన ప్రచార కర్తలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కోవిడ్ వైరస్ మహ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ నిబంధనలు విధిస్తున్నారు.
|
|
|
|
[సందేశం జతచేయబడినది] పూర్తి సందేశాన్ని చూడండి
***
(Release ID: 1759041)
Visitor Counter : 381