ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రత్యేకలక్షణాలు గల 35 పంట రకాల ను సెప్టెంబర్ 28న దేశ ప్రజల కు అంకితం చేయనున్న ప్రధానమంత్రి


నేశనల్ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రెస్ మేనేజ్ మెంట్, రాయ్ పుర్ తాలూకు కొత్త గానిర్మించిన కేంపస్ ను ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు 

వ్యవసాయవిశ్వవిద్యాలయాల కు గ్రీన్ కేంపస్ అవార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేస్తారు 

Posted On: 27 SEP 2021 7:30PM by PIB Hyderabad

జలవాయు అనుకూల సాంకేతికతల పట్ల చైనత్యాన్ని పెంచే ప్రయాస లో భాగం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 28న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ వ్యాప్తం గా ఐసిఎఆర్ కు చెందిన అన్ని ఇన్స్ టిట్యూట్ లలో, రాష్ట్రాల లోని మరియు కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాల లో, కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికెస్) లో నిర్వహించే ఒక అఖిల బారతీయ కార్యక్రమం లో ప్రత్యేక లక్షణలు గల 35 రకాల పంటల ను దేశానికి సమర్పణం చేయనున్నారు. ఈ కార్యక్రమం సాగే క్రమం లో ప్రధాన మంత్రి నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రేస్ మేనేజ్ మెంట్, రాయ్ పుర్ లో కొత్త కేంపస్ ను కూడా దేశానికి అంకితం చేస్తారు.

ఇదే సందర్బం లో ప్రధాన మంత్రి వ్యవసాయ విశ్వవిద్యాలయాల కు గ్రీన్ కేంపస్ అవార్డుల ను పంపిణీ చేయనున్నారు. అలాగే, నవీనమైనటువంటి పద్ధతుల ను అవలంబిస్తున్న రైతుల తో ఆయన మాట్లాడుతారు. అంతే కాక, సమావేశానికి హాజరు అయిన వారి ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ఈ సందర్భం లో వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రి తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.

ప్రత్యేక లక్షణాలు గల పంట రకాల ను గురించి

జలవాయు పరివర్తన, పోషక విలువల లోపం అనే జోడు సవాళ్ల ను పరిష్కరించడం కోసం ప్రత్యేక లక్షణాలు గల పంట రకాల ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఏగ్రికల్చరల్ రిసర్చ్ (ఐసిఎఆర్) ద్వారా అభివృద్ధి పరచడం జరిగింది. జలవాయువుల పరంగా ఎదురయ్యే మార్పుల కు తట్టుకొని నిలచేటటువంటి, పోషక తత్వాలు అధికం గా ఉండే విశిష్ట గుణాల తో కూడిన అటువంటి 35 పంట రకాల ను 2021వ సంవత్సరం లో రూపొందించడమైంది. వీటి లో అనావృష్టి స్థితి ని భరించగలిగే సెనగ రకం, విల్ట్ ఇంకా స్టెరిలిటీ మొజైక్ నిరోధక గుణం కలిగిన కందులు, త్వరగా పండే రకం సోయాబీన్, రోగాలను ప్రతిఘటించగలిగిన బియ్యం రకాలు, గోధుమ, సజ్జ, మొక్కజొన్న, సెనగ, క్వినోవా, కుటు, వింగ్ డ్ బీన్, ఫాబా బీన్ ల బయోఫోర్టిఫైడ్ రకాలు ఉన్నాయి.

మనుషుల ఆరోగ్యం పైన, పశువుల ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావాన్ని ప్రసరించే పోషణ విరుద్ధ కారకాల ను ఎదుర్కొనేందుకు కొన్ని పంటల లో ఇమిడి వుండే అంశాలు ఈ విశేష లక్షణాల తో కూడిన పంటల రకాల లో కలిసి ఉన్నాయి. ఈ కోవ కు చెందిన రకాల ఉదాహరణల లో ‘పూసా డబల్ జీరో మస్టర్డ్’, ‘ఒకటో కెనోలా క్వాలిటీ హైబ్రిడ్ ఆర్ సిహెచ్ 1’ (దీనిలో 2శాతం కంటే తక్కువ గా ఇరూసిక్ ఏసిడ్, 30 పిపిఎమ్ గ్లూకోసైనోలేట్స్ ఉంటాయి) లతో పాటు ‘కునిట్జ్ ట్రిప్సిన్ ఇన్ హిబిట్’ అని, ‘లైపోక్సీజనెస్’ అని వ్యవహరించే రెండు పోషణ విరుద్ధ కారకాల ఉనికి ఉండనటువంటి సోయాబీన్ రకం కూడా చేరి ఉంది. ప్రత్యేక గుణాల తో అభివృద్ధి పరచిన ఇతర రకాల లో సోయాబీన్, జొన్న, ఇంకా బేబీ కార్న్ వంటివి ఉన్నాయి.

నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రెస్ మేనేజ్ మెంట్ ను గురించి

బయొటిక్ స్ట్రెస్, మౌలిక మరియు వ్యూహాత్మకమైన పరిశోధనల ను నిర్వహించడానికి, మానవ వనరుల ను అభివృద్ధిపరచడానికి, విధానపరమైన సాయాన్ని అందించడానికి గాను రాయ్ పుర్ లోని నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ బయొటిక్ స్ట్రెస్ మేనేజ్ మెంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇన్స్ టిట్యూట్ 2020-21 ఎకడమిక్ సెశన్ నుంచి పిజి కోర్సుల ను మొదలుపెట్టింది.

గ్రీన్ కేంపస్ అవార్డుల ను గురించి

కేంద్రీయ, రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిసరాలను మరింత హరితమైనవిగా, స్వచ్ఛమైనవి గా మలచగలిగే అలవాటుల ను ప్రోత్సహించడం తో పాటు విద్యార్థులు ‘స్వచ్ఛ్ భారత్ మిశన్’ లోను, ‘వేస్ట్ టు వెల్థ్ మిశన్’ లోను పాలుపంచుకొనేటట్లుగాను, ‘జాతీయ విద్య విధానం-2020’ లో పేర్కొన్న ప్రకారం సాముదాయిక సంధానానికి ప్రేరణ ను ఇచ్చేందుకు కూడాను గ్రీన్ కేంపస్ పురస్కారాల ను ప్రారంభించడం జరిగింది.

 

***



(Release ID: 1758910) Visitor Counter : 176