నౌకారవాణా మంత్రిత్వ శాఖ
ఆజాది కా అమృత్ మహోత్సవం:లో భాగంగా జగత్‌సింగ్‌పూర్ గడకుజంగాలో ఉచిత మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించిన పిపిటి
Posted On:
27 SEP 2021 12:07PM by PIB Hyderabad
దేశ 75 వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా పారాదీప్ పోర్టు ట్రస్టు (పిపిటి) జగత్‌సింగ్‌పూర్ గడకుజంగాలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించింది. గడకుజంగా యువజన సంఘం సహకారంతో నిర్వహించిన ఈ శిబిరాన్ని పారాదీప్ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ శ్రీ ఏకే బోస్ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో గడకుజంగా సర్పంచ్ శ్రీ సమపద్ కుమార్ బారిక్, పారదీప్ లేడీస్ క్లబ్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుచిస్మిత బోస్ ఇతర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
పారాదీప్ పోర్టు ట్రస్ట్ ఆసుపత్రి సీఎంఓ డాక్టర్ ప్రహల్లాద్ పాండా వైద్యులు, సిబ్బంది సహకారంతో శిబిరంలో దాదాపు 1000 మందికి ఈసీజీ, రాపిడ్ గ్లూకోజ్ టెస్ట్ తదితర పరీక్షలను నిర్వహించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
వైద్య సౌకర్యాలు తక్కువగా ఉన్న గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ బోస్ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పోర్టు ట్రస్టు అవసరమైన అన్ని చర్యలను అమలు చేస్తుందని అన్నారు. మరికొన్ని ప్రాంతాలలో కూడా వైద్య శిబిరాలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక దూరాన్ని పాటించి మాస్కులను ధరించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
***
(Release ID: 1758587)
Visitor Counter : 189