ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రులు శ్రీ నితీష్ గడ్కరీ, డాక్టర్ భారతీ పవార్ అధ్యక్షతన ఘనంగా జరిగిన నాగపూర్ ఎయిమ్స్ మూడవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు


నాగపూర్ ఎయిమ్స్ మహారాష్ట్ర మాత్రమే కాకుండా మధ్య భారతదేశంలోని అన్ని సరిహద్దు రాష్ట్రాల రోగులకు ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది : శ్రీ నితిన్ గడ్కరీ

ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ఒక విధానానికి రూపకల్పన చేసింది: డాక్టర్ భారతీ పవార్

'సానుభూతి కరుణతో రోగులకు వైద్యం అందించాలి'

Posted On: 26 SEP 2021 1:10PM by PIB Hyderabad

నాగపూర్ ఎయిమ్స్ మూడవ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు డిజిటల్ విధానంలో కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితీష్ గడ్కరీ అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ పవార్, రాజ్యసభ  సభ్యుడు డాక్టర్ వికాస్ మహాత్మే  మహారాష్ట్ర ప్రభుత్వం ఇంధన మరియు సంరక్షణ మంత్రి (నాగపూర్) డాక్టర్ నితిన్ రౌత్ కూడా హాజరయ్యారు.

గత మూడు సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సౌకర్యాలను అందిస్తున్న నాగపూర్ ఎయిమ్స్ సిబ్బంది, విద్యార్థులను అభినందించిన శ్రీ గడ్కరీ విదర్భ ప్రాంత వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నాగపూర్ లో ఎయిమ్స్ ను నెలకొల్పిందని అన్నారు. మధ్య భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నాగపూర్ ఎయిమ్స్ ద్వారా నెరవేరిందని ఆయన అన్నారు. ఆధునిక వైద్య సేవలు కేవలం పట్టణ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

ఆరోగ్య రంగంలో ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నదని శ్రీ గడ్కరీ వివరించారు. దీనిలో భాగంగా అన్ని ప్రాంతాల్లో ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఎయిమ్స్ సంఖ్యని రెట్టింపు చేయడం ద్వారా వైద్య రంగంలో అసమానతలను తొలగించి అందరికి ఆధునిక వైద్య  సౌకర్యాలను అందించడానికి అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ పవార్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత దేశంలో ఆరు శతాబ్దాల కాలంలో కేవలం ఆరు ఎయిమ్స్ సంస్థలు మాత్రమే ఏర్పాటు అయ్యాయని ఆమె తెలిపారు. అయితే, 2014 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ ను నెలకొల్పాలని నిర్ణయించి ఈ దిశలో కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. 

మూడేళ్ల కాలంలో నాగపూర్ ఎయిమ్స్ సాధించిన ప్రగతి పట్ల డాక్టర్ పవార్ సంతృప్తి వ్యక్తం చేశారు. 2020 లో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్‌డి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని మంత్రి తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారని అన్నారు. 

కోవిడ్ సమయంలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది సహకారంతో కేంద్రం ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసిందని డాక్టర్ పవార్ అన్నారు. ప్రాంత ప్రజలకు కోవిడ్ చికిత్సను అందించడానికి నాగపూర్ ఎయిమ్స్ కు ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో వెంటిలేటర్లుహాస్పిటల్ పడకలు ఆక్సిజన్ సిలిండర్లుపీపీఈ కిట్లుమాస్క్‌లు మరియు ప్రాణాలను కాపాడే ఔషధాలు మొదలైన సౌకర్యాలను సమకూర్చిందని మంత్రి తెలిపారు. కోవిడ్ మహమ్మారి రెండవ దశలో రోగులకు కోవిడ్ డయాలసిస్ సౌకర్యాన్ని అందించినందుకు ఆమె సంస్థను అభినందించారు.

ఒక డాక్టరుగా తన అనుభవాలను వివరించిన డాక్టర్ పవార్ వైద్యులు సానుభూతి, కరుణ చికిత్సలో కీలకంగా ఉంటాయని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్యార్థులు తమ ప్రవర్తనను మలచుకోవాలని అన్నారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చేవారు ఎక్కువ సమయం నర్సులు, సహాయ సిబ్బంది తో మాట్లాడవలసి వస్తుందని అన్నారు. తమతో మాట్లాడుతున్న రోగుల అవసరాలను తెలుసుకోవడానికి వీలవుతుందని అన్నారు. రోగుల సంరక్షణ  అంశాన్ని కూడా విద్యా కార్యక్రమంలో చేర్చాలని అన్నారు. 

చికిత్స ఖర్చు తగ్గించడం మరియు వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు ఆధునిక చికిత్స సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ నివారణ సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కేంద్ర ప్రభుత్వం సమగ్ర వైద్య విధానాన్ని అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నదని డాక్టర్ పవార్ వివరించారు. అంకితభావం, పట్టుదలతో పనిచేస్తూ సంస్థను ప్రగతి పథంలో నడిపిస్తున్న  నాగపూర్ ఎయిమ్స్ సిబ్బంది పనిచేస్తున్నారని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాలను లక్ష్యాల మేరకు అమలు చేయాలని ఆమె కోరారు. సవాళ్ళను ఎదుర్కొని రాష్ట్రంలో వైద్య సంస్థలకు నాగపూర్ ఎయిమ్స్ మార్గదర్శిగా ఉండాలని ఆమె అన్నారు. 

ఈ సందర్భంగా ఇనిస్టిట్యూట్ మ్యాగజైన్ "అభిజ్ఞానం" ప్రారంభ సంచిక విడుదల చేయబడింది.

కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, నాగపూర్ ఎయిమ్స్ అధ్యక్షుడు డాక్టర్ దావే, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విభా దుత్త సీనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. 

 

 



(Release ID: 1758279) Visitor Counter : 184