ప్రధాన మంత్రి కార్యాలయం
అమెరికా నుంచి 157 కళాఖండాలు, పురాతత్వ వస్తువులను స్వదేశానికి తీసుకురానున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
కళాఖండాలలో హిందూ, బౌద్ధ, జైనసాంస్కృతిక పురాతన వస్తువులు ఉన్నాయి.
చాలావరకు వస్తువులు 11 సిఇ నుంచి 14 సిఇ మధ్యకాలానికి సంబంధించినవి, అలాగే పలు చారిత్రిక పురాతత్వ వస్తువులు సాధారణ యుగానికి ముందునాటివి
ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి మన కళాఖండాలు, పురాతాన వస్తువులను తిరిగి తెప్పించేందుకు శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం సాగించిన నిరంతర కృషిని ఇది ప్రతిబింబిస్తొంది.
Posted On:
25 SEP 2021 9:13PM by PIB Hyderabad
157 కళాఖండాలు, పురాతత్వ వస్తువులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా మన దేశానికి అప్పగించింది. అమెరికా ఈ కళాఖండాలు, పురాతత్వ వస్తువులను భారత్‌కు అప్పగించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికాను ప్రశంసించారు. సాంస్కృతిక వస్తువుల అక్రమ రవాణా, అక్రమ వాణిజ్యం, దొంగతనం వంటి వాటిని ఎదుర్కొనేందుకు తమ కృషిని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షుడు జో బైడెన్ కట్టుబడి ఉన్నారు.
ఈ 157 కళాఖండాలలో ఒకటిన్నర మీటర్ గల 10 వ సామాన్య యుగానికి చెందిన ఇసుకరాతి రేవంత రిలీఫ్ పేనల్, 8.5 సెంటీమీటర్ల పోడవైన 12 వ సామాన్య యుగానికి చెందిన ఇత్తడి నటరాజు తదితరాలు ఉన్నాయి. ఈ వస్తువులు ప్రధానంగా 11వ సాధారణ యుగం నుంచి 14 వ సాధారణ యుగం మధ్యకాలానికి సంబంధించినవి. ఇందులో చరిత్రాత్మక పురాతన వస్తువులు, 2000 బిసి నాటి రాగి వస్తువులు లేదా 2వ సాధారణ యుగానికి చెందిన టెర్రకోట వస్తువులు, సాధారణ యుగానికి ముందునాటి 45 వస్తువులు ఉన్నాయి.
ఈ సగం కళాఖండాలలో (71) సాంస్కృతికపరమైనవి, మిగిలిన సగం హిందూత్వం (60), బౌద్ధం (16), జైనానికి సంబంధించిన (9) ఉన్నాయి.
ఇవి లోహం, రాతి, టెర్రకోట కు సంబంధించినవి. ఇత్తడి వస్తువుల ప్రధానంగా లక్ష్మీనారాయణ, బుద్ధ, విష్ణు, శఙవ పార్వతి, 24 మంది జైన తీర్థంకరులు, అరుదుగా ఉండే కనకాలమూర్తి, బ్రహ్మి, నందికేశ తోపాటు పలు దేవతా మూర్తులకు చెందిన మూర్తులు ఉన్నాయి.
ఈ విగ్రహాలలో హిందూఇజం నుంచి మూడు శిరస్సులు కలిగిన బ్రహ్మ, రథం నడుపుతున్న సూర్యుడు, విష్ణుమూర్తి ఆయన దేవేరులు, దక్షిణామూర్తిగా శివుడు, నాట్యం చేస్తున్న గణేశుడు, తదితరాలు ఉన్నాయి. బౌద్ధానికి సంబంధించి , నిలబడిన బుద్ధుడు, బోధి సత్వ,మంజుశ్రి, తార ఉన్నారు. జైనం నుంచి జైన తీర్థంకరులు, పద్మాసన తీర్థంకర, జైన చౌబిఇ, అలాగే సెక్యులర్ ప్రతిమలైన సమభంగ రీతిలో నిరాకార జంట, చౌరి పట్టుకున్న వారు, డ్రమ్ వాయిస్తున్న మహిళ వంటివి ఉన్నాయి.
56 టెర్రకోట వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ( రెండో సాధారణ శకం నాటి వేస్,12వ సాధారణ శకం నాటి జింకల జంట, 14వ సామాన్య శకం నాటి మ హిళ , గురు హర గోవిండ్ సింగ్ అని పర్షియాలో రాసిన కత్తి తదితరాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాఖండాలు, పురాతత్వ వస్తువులను తిరిగి ఇండియాకు తెప్పించాలన్న శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషికి కొనసాగింపు ఇది.
***
(Release ID: 1758177)
Visitor Counter : 300
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam