విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఎన్‌హెచ్‌పిసీకి చెందిన 510 ఎండబ్లూ తీస్తా-V పవర్ స్టేషన్, సిక్కింకు ఇంటర్నేషనల్ హైడ్రోపవర్ అసోసియేషన్ (ఐహెచ్‌ఏ) ద్వారా 'బ్లూ ప్లానెట్ ప్రైజ్'
Posted On:
24 SEP 2021 9:28AM by PIB Hyderabad
ఎన్‌హెచ్‌పిసీకి చెందిన 510 మెగావాట్ల తీస్తా-V పవర్ స్టేషన్ హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో ఉంది. 120 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న లండన్ ఆధారిత లాభాపేక్షలేని సభ్యత్వ సంఘమైన ఇంటర్నేషనల్ హైడ్రోపవర్ అసోసియేషన్ (ఐహెచ్‌ఎ) ఈ కేంద్రాన్ని ప్రతిష్టాత్మక బ్లూ ప్లానెట్ ప్రైజ్‌తో సత్కరించింది. ఈ పవర్ స్టేషన్‌ను ఎన్‌హెచ్‌పిసి నిర్మించింది. ఆ సంస్థ యాజమాన్యంలోనే ఉంటూ నిర్వహించబడుతుంది. వరల్డ్ హైడ్రోపవర్ కాంగ్రెస్- 2021 సందర్భంగా నిన్న తీస్టా-V పవర్ స్టేషన్‌కు అవార్డు ప్రకటించబడింది. 2019 లో ఐహెచ్‌ఎ గుర్తింపు పొందిన లీడ్ అసెస్సర్ల బృందం ఆపరేషన్ ద్వారా చేపట్టిన సుస్థిరత అంచనా ఆధారంగా అవార్డును తీస్తా-V పవర్ స్టేషన్‌కు ప్రదానం చేశారు. ఐహెచ్‌ఏ యొక్క హైడ్రోపవర్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ ప్రోటోకాల్ (హెచ్‌ఎస్‌ఏపి) స్టేజ్ టూల్.
ఐహెచ్‌ఏ మెంబర్‌షిప్‌లో ప్రముఖ జలవిద్యుత్ యజమానులు మరియు ఆపరేటర్లు, డెవలపర్లు, డిజైనర్లు, సరఫరాదారులు మరియు కన్సల్టెంట్‌లు ఉన్నారు. ఐహెచ్‌ఏ బ్లూ ప్లానెట్ ప్రైజ్ స్థిరమైన అభివృద్ధిలో అత్యుత్తమతను ప్రదర్శించే జలవిద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వబడుతుంది. హైడ్రోపవర్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ ప్రోటోకాల్ (హెచ్‌ఎస్‌ఎపి) జలవిద్యుత్ ప్రాజెక్టుల స్థిరత్వాన్ని కొలిచే ప్రముఖ అంతర్జాతీయ సాధనం. పర్యావరణ, సామాజిక, సాంకేతిక మరియు పరిపాలన ప్రమాణాల సమగ్ర శ్రేణికి సంబంధించి జలవిద్యుత్ ప్రాజెక్ట్ పనితీరును బెంచ్‌మార్క్ చేయడానికి ఇది ఒక మార్గాన్ని అందిస్తుంది. అసెస్‌మెంట్‌లు ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్‌పై ఆధారపడి ఉంటాయి మరియు ఫలితాలు ప్రామాణిక నివేదికలో ప్రదర్శించబడతాయి.
******
(Release ID: 1757919)
Visitor Counter : 180