రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఐఏఎఫ్ అవ‌స‌రాల కోసం '56 సీ-295ఎండ‌బ్ల్యు' రవాణా విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్ డిఫెన్స్ & స్పేస్ స్పెయిన్‌తో ఎంఓడీ ఒప్పందం

Posted On: 24 SEP 2021 12:54PM by PIB Hyderabad

ప్ర‌ధానాంశాలు:


- ఐఏఎఫ్ రవాణా విమానాల ఆధునీకరణ దిశ‌గా గొప్ప ముంద‌డుగు
- సమకాలీన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన విమానాలివి
- ఎయిర్‌బస్ భారతీయ ఆఫ్‌సెట్ భాగస్వాముల నుండి అర్హత కలిగిన ఉత్పత్తులు మ‌రియు సేవ‌ల్ని నేరుగా కొనుగోలు చేస్తుంది
- టెక్నాలజీ ఇంటెన్సివ్ ఏవియేషన్ పరిశ్రమలో ప్రవేశించడానికి దేశీయ ప్రైవేట్ రంగానికి ప్రత్యేక అవకాశం


భారత వైమానిక దళం అవ‌స‌రాల కోసం '56 సీ-295 ఎండ‌బ్ల్యు' రవాణా విమానాల కొనుగోలుకు గాను మెస్స‌ర్స్‌ ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, స్పెయిన్‌తో రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఓడీ)  సెప్టెంబర్ 24, 2021న ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ  మెస్స‌ర్స్‌ ఎయిర్‌బస్ డిఫెన్స్ మరియు స్పేస్‌తో ఆఫ్‌సెట్ కాంట్రాక్టుపై సంతకం చేసింది. దీని ద్వారా మెస్స‌ర్స్‌ ఎయిర్‌బస్ భారతీయ ఆఫ్‌సెట్ భాగస్వాముల నుండి అర్హత కలిగిన ఉత్పత్తులుసేవలను నేరుగా కొనుగోలు చేయడం ద్వారా ఆఫ్‌సెట్ బాధ్యతల్ని నిర్వర్తిస్తుంది. ఈ నెల ప్రారంభంలో భద్రతపై కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన  తరువాత ఈ ఒప్పందంపై సంతకాలు చేయబడ్డాయి. భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్‌) యొక్క రవాణా సముదాయాల ఆధునీకరణ దిశగా సీ-295ఎండ‌బ్ల్యుని ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన అడుగు. ఇది సమకాలీన టెక్నాలజీతో 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన రవాణా విమానం. ఇది ఐఏఎఫ్‌ యొక్క  అవ్రో రవాణా విమానాల స్థానాన్ని భర్తీ చేస్తుంది. విమానం సెమీ-ప్రిపేర్ చేసిన స్ట్రిప్‌ల నుండి పనిచేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. దీనికి తోడు త్వరిత గ‌తిన  ప్రతిచర్య మరియు సైనిక దళాలు  మ‌రియు సరుకును జార‌విడిచేందుకు వెనుక ర్యాంప్ తలుపును కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర భార‌తం,  ఈశాన్య భార‌తం సెక్టార్, అండమాన్ నికోబార్ దీవులలో ఐఏఎఫ్  వ్యూహాత్మక ఎయిర్ లిఫ్ట్ సామర్థ్యానికి ఈ కొత్త విమానం పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వం యొక్క 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌'కు భారీ  ప్రోత్సాహాన్ని అందిస్తుంది, ఇది భారతీయ ప్రైవేట్ రంగానికి టెక్నాలజీ తీవ్ర‌త , అత్యంత పోటీతత్వ విమానయాన పరిశ్రమ రంగంలో ప్రవేశించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. మొత్తం 56 విమానాల‌లో నలభై విమానాలను టాటా కన్సార్టియం భారతదేశంలో తయారు చేస్తుంది.
ఒప్పందంపై సంతకం చేసిన పదేండ్ల‌లో ఈ విమానాల‌ డెలివరీ పూర్తవుతుంది. మొత్తం 56 విమానాలు స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌తో నిర్మించ‌బ‌డుతాయి. డెలివరీ పూర్తయిన తర్వాత, భారతదేశంలో తయారు చేయబడిన తదుపరి విమానాన్ని భారత ప్రభుత్వం ఆమోదించిన ఇత‌ర దేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ భారతదేశంలోని ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌కి గొప్ప ప్రేర‌ణ‌ను అందిస్తుంది. దీంతో  దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు కూడా విమాన భాగాల తయారీలో పాలు పంచుకోనున్నాయి.  హ్యాంగర్లు, భవనాలు, అప్రాన్‌లు మరియు టాక్సీవేల రూపంలో ప్రత్యేక మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా ఇందులో భాగం కానుంది. ఈ కార్యక్రమం స్వదేశీ సామర్ధ్యాలను బలోపేతం చేయడానికి , ‘మేక్ ఇన్ ఇండియా’ను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రత్యేక చొరవగా నిలువ‌నుంది.

***


(Release ID: 1757710) Visitor Counter : 287