ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ అనంతర సీక్వెల్ మాడ్యూల్‌ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవీయ
ఈ మాడ్యూళ్లు వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్ అనంతర తీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కొనేందుకు తగిన మార్గదర్శకాలను ఇస్తాయి: శ్రీ మాండవీయ
“ ఫ్రంట్ లైన్ వర్కర్లు తగిన పరిజ్ఞానం, శిక్షణతో ఉన్నట్టయితే, వారు కోవిడ్ అనంతర సవాళ్లకు సంబంధించి విలువైన వనరుగా ఉంటారు: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
Posted On:
23 SEP 2021 12:42PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్‌సుక్ మాండవీయ ,కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ సమక్షంలో కోవిడ్ అనంతర సీక్వెల్ మాడ్యూళ్లను విడుదల చేశారు. ఈ మాడ్యూల్ళు దేశ వ్యాప్తంగా గల వైద్యులు, నర్సులు, పారామెడికల్‌సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, కోవిడ్ అనంతర దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కొనడానికి పనికి వస్తాయి.
మార్గదర్శకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి, డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కోవిడ్ దీర్ఘకాలిక ప్రభావాలను ఎదుర్కోవడానికి ఈ మార్గదర్శకాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కనీస సైడ్ ఎఫెక్ట్‌లు ఉండడానికి, చికిత్సకు సంబంధించి ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా ఉండడానికి ఇవి ఉపయోగపడతాయి.
మ్యుకోర్ మైకోసిస్ వంటి కేసులలో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్ డోస్‌లు వాడడం వల్ల పేషెంట్లలో కోవిడ్ అనంతర ప్రభావానికి సంబంధించిన పరిణామాలను చూడడం జరిగిందని ఆయన చెప్పారు. అందువల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్‌లు లేదా కనీస సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిన మందులు తీసుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. మనం ముందుగా మేల్కొంటే, కోవిడ్ అనంతర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కోవిడ్ అనంతర పరిస్థితులకు సంబంధించి సమాజంలో పలు భయాలు, ఆరోగ్య సంబంధ సమస్యలు వంటివి ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా ఎదుర్కొవలసి ఉంది. అందువల్ల కోవిడ్ అనంతర సమస్యలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించుకోవలసి ఉంది. కోవిడ్ అనంతర సీక్వెల్ మాడ్యూళ్లు రూపొందించడానికి దేశ వ్యాప్తంగా గల రిసొర్స్ పర్సన్‌లు గట్టి కృషి చేశారు. ఇవి అత్యంత ప్రత్యేక మాడ్యూళ్లు. ఇవి అత్యంత ప్రత్యేక మాడ్యూళ్లు.వివిధ రంగాలకు చెందిన ఆరోగ్య ప్రొఫెషనల్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మాడ్యూళ్లు రూపొందించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసిన అవసరాన్నివారు ప్రస్తావించారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణవ్యవస్థకు పలు సవాళ్లు విసిరిందని డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ అన్నారు. మానసిక ఆరోగ్య సంరక్షణ అనేది భారీ జనాభా గల దేశంలో పెద్ద సవాలు అని అన్నారు. మానసిక ఆరోగ్య సంరక్షణను ఎదుర్కొనేందుకు మనం మన సామర్ధ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఫ్రంట్‌లైన్ వర్కర్లను సమర్ధులుగా తీర్చిదిద్దినట్టయితే వారికి తగిన పరిజ్ఞానాన్ని అందించినట్టయితే కోవిడ్ అనంతరం ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడానికి వీరు ఎంతగానో ఉపయోగపడతారు. మనం కోవిడ్ అనంతర పరిణామాలను ఎదుర్కొవడానికి మనకు మనం సన్నద్ధులం కావడానికి ప్రయత్నించడంతోపాటు, వీటిని చివరికంటా తీసుకుపోవడం కూడా ఎంతో అవసరం. రాష్ట్రాల ఆరోగ్య కార్యకర్తల అవసరాలకు అనుగుణంగా మానసిక ఆరోగ్యం , ఇతర అంశాలకు సంబంధించి శిక్షణ మాడ్యూళ్లు సిద్దమ య్యాయి.కోవిడ్ -19 అనేది ఇక ఇదే చిట్టచివరి మహమ్మారికావాలని ఆమె ఆకాంక్షించారు.
కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్, డిజిహెచ్ ఎస్ డాక్టర్ సునీల్ కుమార్, ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1757470)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam