వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో 62% పెరిగిన ఎఫ్‌డిఐ ప్రవాహాలు
అదే కాలంలో ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహాలు +112%
Posted On:
22 SEP 2021 4:31PM by PIB Hyderabad
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) విధాన సంస్కరణలు, పెట్టుబడులకు సౌకర్యం, వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది.
దిగువన పేర్కొన్న భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళులను గమనిస్తే, అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పెట్టడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్ నిలిచిందని అర్థమవుతుంది.
* ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి నాలుగు నెలల్లో భారత్ 27.37 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ పెట్టుబడులను ఆకర్షించింది. గత ఆర్థిక సంవత్సరం 2020-21 (16.92 బిలియన్ డాలర్లు) ఇదే సమయంతో పోలిస్తే ఇది 62% అధికం.
* ఆర్థిక సంవత్సరం 2021-22లో (20.42 బిలియన్ డాలర్లు) ఎప్‌డిఐ ఈక్విటీ ప్రవాహం గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 112%గా పెరిగింది.
* ఆర్థిక సంవత్సరం 2021-22లో తొలి నాలుగు నెలల్లో ఆటోమొబైల్ రంగం మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహంలో 23% ఆగ్ర రంగంగా నిలువగా, తదుపరి స్థానంలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్ (18%), సేవా రంగం (10%) ఉన్నాయి.
* ఆటోమొబైల్ పరిశ్రమ రంగం కింద, ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహంలో అధిక భాగం (87%) ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి నాలుగు నెలల్లో కర్ణాటకకు దక్కింది.
*ఆర్థిక సంవత్సరం 2021-22లో (జులై 2021వరకు) మొత్తం ఎఫ్‌డిఐ ఈక్విటీ ప్రవాహాలలో 45%తో కర్ణాటక అగ్ర రాష్ట్రంగా నిలువగా, అనంతర స్థానాలను మహారాష్ట్ర ర(23%), ఢిల్లీ (12%) దక్కించుకున్నాయి.
***
(Release ID: 1757210)
Visitor Counter : 214