మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డిజిటల్ విద్య ద్వారా గుణాత్మక విద్యను సార్వజనీనం చేయడం పై సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర విద్యా మంత్రి
ఉనికిలో ఉన్న వేదికలను మొత్తం విద్యా రంగం, నైపుణ్యాల అభివృద్ధి రంగాలకు విస్తరింపచేయాలని పిలుపిచ్చిన మంత్రి ప్రధాన్
Posted On:
22 SEP 2021 4:38PM by PIB Hyderabad
డిజిటల్ విద్య ద్వారా గుణాత్మక విద్యను సార్వజనీనం చేయడం కోసం కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర విద్యా శాఖ సహాయమంత్రి శ్రీమతి అన్నపూర్ణ దేవి, డిఒఎస్ఒ & ఎల్ కార్యదర్శి శ్రీమతి అనితా కర్వాల్, బిఐఎస్ఎజి-ఎన్ డిజి డాక్టర్ టి.పి. సింగ్, ప్రసార భారతి సిఇఒ శశి ఎస్ వెంపటి, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సమావేశంలో పాల్గొన్నారు.
సమగ్ర విద్య వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఉపగ్రహ సాంకేతికతను, ఇంటర్నెట్‌ను ఉపయోగించడంపై సమావేశంలో చర్చలు దృష్టిని కేంద్రీకరించాయి. పాఠశాల విద్య ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి, అధ్యాపకులకు శిక్షణ సహా అన్ని రంగాలకూ వర్తించేలా ప్రస్తుతమున్న వేదికలను విస్తరింపచేసేందుకు సాంకేతికతను ఉపయోగించేందుకు వినూత్న పద్ధతిని చేపట్టవలసిందిగా మంత్రి పిలుపిచ్చారు. ఉనికిలో ఉన్న స్వయం ప్రభ చొరవను బలపరచి, విస్తరింపచేసేందుకు, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్‌డిఇఎఆర్), నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం (ఎన్ఇటిఎఫ్)ను సమన్వయం చేయాలని మంత్రి పిలుపిచ్చారు. విద్యలో మరింతగా కలుపుకుపోయేందుకు మారుమూల ప్రాంతాలను కూడా చేరుకొని డిజిటల్ అసమానతలను పూడ్చాల్సిన అవసరాన్ని ప్రధాన్ నొక్కి చెప్పారు.
డిఒఎస్ఒ & ఎల్ కార్యదర్శి అధ్యక్షతన పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ల శాఖ, ప్రసార భారతి, ఐ&బి మంత్రిత్వ శాఖ, బిఐఎస్ఎజి-ఎన్, అంతరిక్ష శాఖ సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా మంత్రి సూచించారు.
***
(Release ID: 1757093)
Visitor Counter : 178