వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రధాన ఖరీఫ్ పంటల ఉత్పత్తికి సంబంధించి విడుదలైన - ముందస్తు అంచనాలు


ఖరీఫ్ సీజన్‌ లో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో - 150.50 మిలియన్ టన్నులుగా అంచనా

రైతులు, శాస్త్రవేత్తల కృషితో పాటు, రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న స్నేహపూర్వక విధానాల కారణంగా భారీ స్థాయిలో ఉత్పత్తి - శ్రీ తోమర్

Posted On: 21 SEP 2021 5:36PM by PIB Hyderabad

2021-22 సంవత్సరానికి ప్రధాన ఖరీఫ్ పంటల ఉత్పత్తికి సంబంధించిన ముందస్తు అంచనాలను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.  ఖరీఫ్ సీజన్‌ లో రికార్డు స్థాయిలో 150.50 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని అంచనా వేసినట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ తెలియజేశారు.   రైతుల కృషి, శాస్త్రవేత్తల నైపుణ్యంతో పాటు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న స్నేహపూర్వక విధానాల కారణంగా ఉత్పత్తి భారీగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. 

మొదటి ముందస్తు అంచనాల ప్రకారం, 2021-22 కోసం ఖరీఫ్ ప్రధాన పంటల దిగుబడి అంచనా వివరాలు ఈ క్రింది విధంగా ఉంది:

*          ఆహార ధాన్యాలు - 150.50 మిలియన్ టన్నులు. (రికార్డు)

            *         బియ్యం - 107.04 మిలియన్ టన్నులు (రికార్డు)

            *        పోషక / ముతక తృణ ధాన్యాలు - 34.00 మిలియన్ టన్నులు.

            *        మొక్కజొన్న - 21.24 మిలియన్ టన్నులు.

            *        పప్పులు - 9.45 మిలియన్ టన్నులు.

            *        కందులు - 4.43 మిలియన్ టన్నులు.

*          నూనె గింజలు - 23.39 మిలియన్ టన్నులు.

            *          వేరుశనగ - 8.25 మిలియన్ టన్నులు.

            *          సోయాబీన్ - 12.72 మిలియన్ టన్నులు.

*          పత్తి - 36.22 మిలియన్ బేళ్ళు (ఒక్కొక్కటి 170 కిలోలు) (రికార్డు)

*          జనపనార & గోగునార  –9.61 మిలియన్ బేళ్ళు (ఒక్కొక్కటి 180 కిలోలు)

*          చెరకు - 419.25 మిలియన్ టన్నులు (రికార్డు)

2021-22 మొదటి ముందస్తు అంచనాల ప్రకారం (ఖరీఫ్ మాత్రమే), దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 150.50 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది.  ఇది గత ఐదు సంవత్సరాల (2015-16 నుండి 2019-20 వరకు) సగటు ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 12.71 మిలియన్ టన్నులు ఎక్కువ. 

2021-22 ఖరీఫ్ పంట కాలంలో ఖరీఫ్ బియ్యం మొత్తం ఉత్పత్తి 107.04 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది.  ఇది గత ఐదు సంవత్సరాల (2015-16 నుండి 2019-20 వరకు) సగటు ఖరీఫ్ వరి ఉత్పత్తి 97.83 మిలియన్ టన్నుల కంటే 9.21 మిలియన్ టన్నులు ఎక్కువ.

ఖరీఫ్ పోషకాలు / ముతక తృణ ధాన్యాల ఉత్పత్తి 34.00 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది.   ఇది సగటు ఉత్పత్తి 31.89 మిలియన్ టన్నుల కంటే 2.11 మిలియన్ టన్నులు ఎక్కువ.

2021-22 ఖరీఫ్ పంట కాలంలో మొత్తం పప్పు ధాన్యాల ఉత్పత్తి 9.45 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది. ఇది 8.06 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాల సగటు ఉత్పత్తి కంటే 1.39 మిలియన్ టన్నులు ఎక్కువ.

2021-22 ఖరీఫ్ పంట కాలంలో దేశంలో మొత్తం ఖరీఫ్ నూనె గింజల ఉత్పత్తి 23.39 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది.  ఇది నూనె గింజల సగటు ఉత్పత్తి 20.42 మిలియన్ టన్నుల కంటే 2.96 మిలియన్ టన్నులు ఎక్కువ.

2021-22 సమయంలో దేశంలో మొత్తం చెరకు ఉత్పత్తి 419.25 మిలియన్ టన్నులుగా అంచనా వేయడం జరిగింది.   ఇది చెరకు సగటు ఉత్పత్తి 362.07 మిలియన్ టన్నుల కంటే 57.18 మిలియన్ టన్నులు ఎక్కువ.

పత్తి ఉత్పత్తి 36.22 మిలియన్ బేళ్ళు (ఒక్కొక్కటి 170 కిలోలు) గా అంచనా వేయగా,  జనపనార & గోగునార ఉత్పత్తి 9.61 మిలియన్ బేళ్ళు (ఒక్కొక్కటి 180 కిలోలు) గా అంచనా వేయడం జరిగింది. 

2021-22 సంవత్సరానికి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వివిధ పంటల అంచనా ఉత్పత్తి (ఖరీఫ్ మాత్రమే) 2005-06 నుండి తులనాత్మక అంచనాలకి సంబంధించిన వివరాలు జత చేయడం జరిగింది.

2021-22 కొరకు ఆహార ధాన్యాల ఉత్పత్తి యొక్క మొదటి ముందస్తు అంచనాలు

 

*****



(Release ID: 1756860) Visitor Counter : 328