భారత ఎన్నికల సంఘం
అందుబాటులో ఎన్నికలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించిన ఎన్నికల కమిషన్
ఎన్నికల ప్రక్రియను మరింత క్రమపద్ధతిలో ముందుకు తీసుకువెళ్లేందుకుగల విధాన పరమైన అంశాలపై చర్చించిన ఎన్నికల కమిషన్
Posted On:
21 SEP 2021 5:43PM by PIB Hyderabad
భారత ఎన్నికల కమిషన్ ఈ రోజు అందుబాటులో ఎన్నికలు 2021 అనే అంశంపై జాతీయ సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించింది. ఎన్నికల అందుబాటుకు సంబంధించిన ప్రస్తుత విధానాలు, దివ్యాంగులైన ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు గల అడ్డంకులు తొలగించి వారు మరింతగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశానికి ఛీఫ్ ఎలక్టొరల్ అధికారులు, సివిల్ సొసైటీ సంస్థలు, వివిధ వైకల్యాలు కలిగిన వారికి ప్రాతినిధ్యం వహించే సంస్థలు, వివిధ ప్రభుత్వ మంత్రిత్వశాఖలు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఎన్నికలు అందరు పాల్గొనేవిధంగా, అందరికీ అందుబాటులో, ఓటర్లకు , దివ్యాంగులకు అనుకూలమైన రీతిలో ఉండే విధంగా చూసేలా చేయడంలో ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్, శ్రీ సుశీల్ చంద్ర, ప్రాధమిక స్టేక్ హోల్డర్లయిన ఓటర్లు, దివ్యాంగుల నిర్ణయాత్మక పాత్రకు కమిషన్ ఎంతో విలువ ఇస్తుందని అన్నారు. దివ్యాంగులైన వారు, వారి ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించే సంస్థలు చేసే సూచనలను , వారు సమర్పించే అర్థవంతమైన సమాచారాన్ని ఎన్నికల ప్రక్రియ మరింత అర్థవంతంగా , అందరికీ అందుబాటులో ఉండే విధంగా విధివిధానాలు రూపొందించే క్రమంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఎన్నికల ప్రక్రియలో దివ్యాంగులను భాగస్వాములను చేసేందుకు భారత ఎన్నికల కమిషన్‌కట్టుబాటును శ్రీ చంద్ర పునరుద్ఘాటించారు. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ తీర్మానాలు, ఆదేశాలకు కట్టుబడి వ్యవహరిస్తున్నట్టు తెలిపారు.దివ్యాంగులకు ప్రశాంతమైన, గౌరవప్రదమైన పోలింగ్ అనుభవాన్ని కల్పించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లో ర్యాంప్ సదుపాయం, వీల్‌ఛైర్ ఏర్పాటుతో ఉన్నాయని ఆయన చెప్పారు. దివ్యాంగులకు పోలింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తగినంతమంది వాలంటీర్లను అందుబాటులో ఉంచినట్టు ఆయన తెలిపారు.
ఎన్నికల కమిషనర్ శ్రీ రాజివ్ కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులైన వారి హక్కుల పరిరక్షణ చట్టం 2016 ప్రకారం అన్ని పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగులకు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నదని , ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సమాచారం అంతా వారు సులభంగా అర్థం చేసుకునే విధంగా, వాడుకునే విధంగా ఉంచుతున్నట్టు చెప్పారు. ఎన్నికల అధికారులు, సి.ఎస్.ఒ భాగస్వాములు దేశంలో పెద్ద సంఖ్యలో గల దివ్యాంగులను చేరడానికి సమష్టి కృషి చేశారన్నారు. ఎన్నికల ప్రక్రియను అందుబాటులో ఉంచేందుకు, సురక్షితంగా, గౌరవప్రదమైన రీతిలో సమాజంలోని వివిధ ప్రజా సమూహాలకు అందుబాటులో ఉండే లా చేయడంలో కూడా సమష్టి కృషి జరిగినట్టు తెలిపారు.
ఎన్నికల కమిషనర్ శ్రీ అనుప్ చంద్ర పాండే మాట్లాడుతూ, అడ్వాన్స్‌డ్ డాటా ప్రాసెసింగ్, కమ్యూనిటీ రెఫరల్ పాయింట్ల గుర్తింపు, ఆయా ప్రత్యేక పౌర బృందాలకు అనువైన విధానాలను ఏర్పాటుచేయడం అంటే దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు వంటి వారికి అనువైన విధానాలు రూపొందించడం ఇందుకు కమ్యూనిటీ మద్దతు వ్యవస్థలు బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్నికలు అందుబాటులో ఉండేలా చూడడం అనేది కీలక అంశమని, ఇందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా అన్ని లక్షిత వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ మొత్తం ఎన్నికల ప్రక్రియ అందుబాటులో ఉండేలా చూస్తుందని అన్నారు.
సెక్రటరీ జనరల్ శ్రీ ఉమేష్ సిన్హా మాట్లాడుతూ, రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సిద్ధమయ్యే సరైన సమయంలో ఎన్నికల కమిషన్ ఈ సదస్సును ఏర్పాటు చేసిందని అన్నారు. సిఇఒలు, సిఎస్ఒలు, ఇసిఐ ప్రముఖులను ఎన్నికలు మరింతగా అందుబాటులో ఉంచేందుకు రూపొందించే ప్రణాళిక, ముందస్తు ఏర్పాట్లలో భాగస్వాములను చేయడం జరుగుతుందని, ఎన్నికల ప్రక్రియను దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లయిన ఒటర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా చూడడం జరుగుతుందని అన్నారు.
ప్రస్తుతం 77.4 లక్షలమంది దివ్యాంగులు ఓటు హక్కుకు నమోదు చేసుకున్నారని ఈ సమావేశంలో వెల్లడించారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం అనేది చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని గుర్తిస్తూ, ఈరోజు జరిగిన చర్చలో ప్రధానంగా దివ్యాంగుల గుర్తింపు, పిడబ్ల్యుడిల మ్యాపింగ్, అందుబాటులో రిజిస్ట్రేషన్,పోలింగ్ కేంద్రాలలో సదుపాయాలు, ఎన్నికలు అందుబాటులో ఉండేలా చూసేందుకు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఓటర్లకు సమాచారం అందుబాటులో ఉంచడం, మీడియా ఔట్ రీచ్ వంటి అంశాలపై ఈ రోజు జరిగిన చర్చలో దృష్టి పెట్టారు.
వివిధ సిఎస్ఒ లనుంచి చెప్పుకోదగిన ప్రముఖులు, ఎఎడిఐ డైరక్టర్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెఫ్ ఎక్సిక్యుటివ్ డైరక్టర్, స్పార్క్ ఇండియా ,ఎన్‌సిపిఇడిపిఎక్సిక్యుటివ్ డైరక్టర్, బిపిఎ ఎక్జిక్యుటివ్ డైరక్టర్, ఐఎస్ ఎల్ ఆర్ టిసి, పిడియు ఎన్ ఐ పి పి డి ప్రతినిధులు, ఇసిఐ నేషనల్ ఐకాన్, డాక్టర్ నీరు కుమార్ తదితరులు ఎన్నికలు అందరికీ అందుబాటులో ఉండేలా చేసే అంశంపై ఈ సమావేశంలో తమ విలువైన అభిప్రాయాలను తెలియజేశారు.
వివిధ భాగస్వామ్య పక్షాలనుంచి అందిన సూచనల మేరకు, అందుబాటులో ఎన్నికలు అంశంపై , పాలసీ ఫ్రేమ్ వర్క్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు , సమగ్ర పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల అందుబాటును అంచనా వేసేందుకు, దివ్యాంగులకు సంబంధించిన అన్ని కీలక విధానాలు, కార్యక్రమాలను సమీకృతం చేసేందుకు , ఎన్నికల సిబ్బందికి ఈ అంశాలపై అవగాహన కల్పించేందుకు వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు దివ్యాంగత్వాన్ని అర్ధం చేసుకునేందుకు , గణాంకాల సేకరణలో మెరుగైన పద్ధతులను అనుసరించేందుకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పించేందుకు, సమర్ధమైన ఐవిఆర్ ఎస్ హెల్ప్‌లైన , ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ అందుబాటుకు సంబంధించి పరిశీలకుల ఏర్పాటు, అన్ని స్థాయిలలో ఎన్నికల ప్రక్రియ అందుబాటులో ఉండేట్టు చూసేందుకు మైక్రో అబ్జర్వర్లు వంటివి వర్చువల్ సదస్సులో చర్చించిన కొన్ని ముఖ్యమైన అంశాలు.
ఈ సమావేశం సందర్భంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు శ్రీ రాజీవ్ కుమార్, శ్రీ అనుప్ చంద్ర పాండే ఈ కింది దానిని విడుదల చేశారు.
1.క్రాసింగ్ ది బారియర్స్: యాక్సిసిబిలిటి ఇనిషియేటివ్స్ 2021. ఈ బుక్‌లెట్‌లో వినూత్న చర్యలు, ఓటర్ల అందుబాటు సదుపాయాలు, దివ్యాంగులైన ఓటర్ల సాధికారత వంటి అంశాలను ఈ బుక్‌లెట్‌లో క్రోడీకరించడం జరిగింది.
2. ఇటీవల ఆవిష్కరించిన బ్రెయిలీ లాంగ్వేజ్ వెర్షన్ చొరవ అయిన ఓటర్ గైడ్, కొత్త ఓటర్‌కు లేఖ, ఓటర్లకు ప్రేరణ కలిగించే 50 ప్రేరణాత్మక ఓటర్ చైతన్యం వంటివి.
3. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, ఇవిఎరా వివిపాట్ లకు సంబంధించి రెండు సైన్ లాంగ్వేజ్ అవగాహనా వీడియో వర్షన్ లు
4. ఎస్‌విఇఇపి కార్యకలాపాలు , 2018 జనరల్ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో కర్ణాటక లోక్‌సభ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు కల్పించిన సదుపాయాలకు సంబంధించిన అధ్యయన నివేదిక విడుదల.
ఎన్నికలను అందుబాటులో తెచ్చేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు సంబంధించి తమ అనుభవాలను ప్రస్తావించారు
***
(Release ID: 1756858)
Visitor Counter : 330