ఉక్కు మంత్రిత్వ శాఖ
ఉక్కు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి వ్యయ నియంత్రణ విషయమై కేంద్ర మంత్రి సమీక్ష
వ్యయ పారామితులను అభివృద్ధిచేసుకోవడం ద్వారా వ్యయ నియంత్రణ చేపట్టాలని ఆదేశం
Posted On:
21 SEP 2021 9:38AM by PIB Hyderabad
ఉక్కు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలందు ఉత్పత్తి వ్యయ నియంత్రణ విషయమై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ సారథ్యంలో గత సాయంత్రం ఒక సమీక్ష సమావేశం జరిగింది. వ్యయ నియంత్రణ విషయమై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను సమీక్షించడానికి ఉక్కు రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థల అధికారులతో ఈ సమావేశం జరిగింది. ఉక్కు ఉత్పత్తి వ్యయాన్ని ప్రభావితం చేసే పారామితుల యొక్క స్థూల & సూక్ష్మ విశ్లేషణలను నిర్వహించి వ్యయ నియంత్రణ జరిగేలా చూడాలని మంత్రి కోరారు. ఇందుకు గాను ఎదరయ్యే అన్ని ప్రతికూల పరిస్థితులను అవకాశాలుగా మార్చుకునేందుకు తగిన విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి నొక్కి చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో పైన పేర్కొన్న ఆయా పారామితులను మెరుగుపరచుకోవడం ద్వారా వ్యయ తగ్గింపు కోసం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని శ్రీ సింగ్ ఆదేశించారు. ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న కోకింగ్ బొగ్గు అతిపెద్ద వ్యయ మూలకంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. ఈ నేపథ్యంలో కోక్ రేట్ తగ్గింపు, పీసీఐ ఇంజెక్షన్ పెంచడం మరియు కోకింగ్ బొగ్గు వినియోగాన్ని తగ్గించడానికి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి పెల్లెట్ల వినియోగాన్ని పెంచడం వంటి ముఖ్యమైన వ్యయ తగ్గింపు చర్యలపై దృష్టి పెట్టాలని మంత్రి పీఎస్‌యులను కోరారు. స్టీల్ డాష్బోర్డ్ ద్వారా ఈ టెక్నో-ఎకనామిక్ పారామితులను నెలవారీగా పర్యవేక్షించాలని కూడా నిర్దేశించారు. స్టీల్ ప్లాంట్ల సామర్థ్యం మరియు ఉత్పాదకతను ప్రభావితం చేసే వివిధ పారామితులు అనగా.. బీఎఫ్ ఉత్పాదకత, బీఎఫ్ కోక్ రేట్, బీఎఫ్ పీసీఐ/ సీడీఐ రేటు, కార్మిక ఉత్పాదకత, నిర్దిష్ట శక్తి వినియోగం, కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గార తీవ్రత, నీటి వినియోగం మొదలైనవి సమీక్షించబడ్డాయి. తద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, శక్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, జీ,హెచ్.జీ ఉద్గారాలను, నీటి వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉంది. మరియు భారతీయ & ప్రపంచ బెంచ్‌మార్క్‌ల ప్రకారం
సమర్థత మరియు ఉత్పాదకతను పెంచడానికి, ఉక్కు కర్మాగారాలు & గనుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి, వీటిని సాధించడానికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికలు కూడా చర్చించబడ్డాయి.
****
(Release ID: 1756856)
Visitor Counter : 108