వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల రంగంలో పారిశ్రామిక భద్రతకు మరింత ప్రాధాన్యత
దేశంలో సురక్షితంగా అమ్మోనియం నైట్రేట్ మరియు కాల్షియం కార్బైడ్ వంటి పేలుడు పదార్థాల రవాణా ,నిల్వ
పెట్రోలియం మరియు పేలుడు రంగాల్లో పారిశ్రామిక భద్రతను పెంచడానికి నూతన సంస్కరణలకు డీపీఐఐటీ శ్రీకారం
సులభతర వ్యాపారానికి ఊతం ఇచ్చే విధంగా ప్రతిపాదనలు
ఐఎస్ఓ కంటైనర్లలలో ప్రాణాలను కాపాడే లిక్విడ్ ఆక్సిజన్. ఆర్గాన్, నైట్రోజన్, ఎల్ఎన్జీ లాంటి సంపీడన వాయువుల రవాణా
కాల్షియం కార్బైడ్, అమ్మోనియం నైట్రేట్ నిల్వ మరియు రవాణాకు సంబంధించిన నియమాలలో సడలింపులు :
కాల్షియం కార్బైడ్ నిల్వ కోసం లైసెన్స్ చెల్లుబాటు 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగింపు ; అమ్మోనియం నైట్రేట్ కోసం ఎన్ఓసీ జారీ గడువు ఆరు నుంచి మూడు నెలలకు తగ్గింపు
Posted On:
21 SEP 2021 2:40PM by PIB Hyderabad
'ఆత్మ నిర్భర్ భారత్' సాధన కోసం కోవిడ్ -19 తరువాత కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా ప్రమాదకర ప్రాంతాల్లో ((పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు,, పేలుడు తయారీ సౌకర్యాలు, సిలిండర్ ఫిల్లింగ్, నిల్వ ప్రాంతాలు మొదలైనవి) పారిశ్రామిక భద్రతను పెంపొందించడానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అనేక సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ వ్యాపార వ్యయాన్ని తగ్గించి దేశీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలన్న లక్ష్యంతో ఈ సంస్కరణలకు రూపకల్పన జరిగింది. దీనిలో భాగంగా పేలుడు పదార్ధాలు, పెట్రోలియం ఉత్పత్తులు, ప్రమాదకరమైన రసాయనాల ఉత్పత్తి, రవాణా, నిల్వ అంశాలకు సంబంధించి డీపీఐఐటీ కింద స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న పెట్రోలియం మరియు ఎక్స్‌ప్లోసివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (పిఇఎస్‌ఒ)తో చర్చించి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించామని డీపీఐఐటీ అదనపు కార్యదర్శి శ్రీమతి సుమితా దావ్రా అన్నారు. ఈ రోజు పత్రికా ప్రతినిధులతో మాట్లాడిన శ్రీమతి సుమితా నూతన విధానాలు, మార్గదర్శకాలను వివరించారు.
స్టాటిక్ మొబైల్ ప్రెజర్ వెసెల్స్ (అన్ ఫైర్డ్ర్), కాల్షియమ్ ,అమ్మోనియం నైట్రేట్, గ్యాస్ సిలెండర్లు, పేలుడు పదార్ధాలకు సంబంధించి ఈ రంగాలలో పనిచేస్తున్న ప్రైవేట్ రంగం, పరిశ్రమ సంస్థలు మరియు ఇతర మంత్రిత్వ శాఖలతో విధానాలకు రూపకల్పన చేయడం జరిగింది. 2021 జనవరి నుంచి సమావేశాలను నిర్వహించిన తరువాత ప్రధాన మార్గదర్శకాలకు అనేక సవరణలను ప్రతిపాదించారు. ఈ సవరణలను పరిశీలించిన తరువాత తుది మార్గదర్శకాలు, నిబంధనలను ఖరారు చేయడం జరిగింది. మూడు తరగతులలో (i) ఎస్ ఎం పి వి (ii) కాల్షియం కార్బైడ్ (iii) అమ్మోనియం నైట్రేట్ లకు సంబంధించి రూపొందించిన విధానాలను 31 ఆగస్ట్ 2021 న నోటిఫై చేయడం జరిగింది. గ్యాస్ సిలిండర్ నిబంధనల్లో ప్రతిపాదించిన సవరణలతో 25 జూన్ 2021 న ముసాయిదా ప్రకటన విడుదల అయ్యింది.
పరిశ్రమ వర్గాలతో చర్చలు జరుపుతున్న మంత్రిత్వ శాఖ పేలుడు పదార్ధాలకు వర్తించే నియమ నిబంధనలను రూపొందించే కార్యక్రమాన్ని చేపట్టింది.
మూడు ప్రధాన రంగాలలో ప్రతిపాదించిన సవరణలు, అమలు చేసిన సంస్కరణలు ఈ కిందివిధంగా ఉన్నాయి.
ఎ. స్టాటిక్ మరియు మొబైల్ ప్రెజర్ వెసల్స్ (ఆన్ ఫైర్డ్ ) (సవరణ) నియమాలు, 2021
(i) లైసెన్స్ పొందిన ప్రాంగణం యొక్క ధృవీకరణ, పరీక్ష, తనిఖీ మరియు భద్రతా ఆడిట్‌కు సంబంధించిన పనిని నిర్వహించడానికి థర్డ్-పార్టీ ఇన్‌స్పెక్టింగ్ ఏజెన్సీ ని నియమించడానికి సవరణ చేయడం జరిగింది.
(ii) తనిఖీలు నిర్వహించి ద్రువికరించడానికి సమర్థుల సంఖ్యను ఎక్కువ చేయడానికి చర్యలు. దీనికోసం అవసరమైన కనీస అనుభవాన్ని 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గిస్తూ మార్గదర్శకాల జారీ అయ్యాయి.
(iii) అత్యవసర సమయాల్లో అవసరమైన ప్రాంతాలకు ఆక్సిజన్ ను ఐఎస్ఓ కంటైనర్లలలో రవాణా చేయడానికి వీలు కల్పిస్తూ 2020 సెప్టెంబర్ 23న అనుమతులు జారీ చేయడం జరిగింది.
(iv) దేశంలో ఐఎస్ఓ కంటైనర్లలలో ఆక్సిజన్, ఆర్గాన్, నైట్రోజన్,ఎల్ఎన్ జీ మొదలైన క్రయోజెనిక్ కంప్రెస్డ్ వాయువులను రవాణా చేయడానికి వీలుగా ఇప్పుడు నిబంధనలలో నూతన నిబంధనలు చేర్చబడ్డాయి. ఇది మిగులు ప్రాంతాల నుంచి ద్రవ ఆక్సిజన్‌ను లోటు ఉన్న ప్రాంతాలకు రవాణా చేయడానికి మరియు ఈ వాయువులను బహుళ మోడల్ రవాణాను (రోడ్డు, రైలు మరియు జలమార్గాల ద్వారా) రవాణా చేయడానికి అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చుతో పాటు రవాణా సమయాన్ని తగ్గించడానికి అవకాశం కలుగుతుంది.
(v) దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడానికి జిల్లా అథారిటీ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందడానికి రెండు నెలల గడువును ఇవ్వడం జరిగింది. నిర్ణీత గడువులోగా దరఖాస్తుపై తుది నిర్ణయం తీసుకొని పక్షంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది.
(vi) డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు మరియు ఫీజు సమర్పించాల్సిన అవసరం తొలగించబడింది. సిస్టమ్ ద్వారా లభించే ఆన్‌లైన్ కాపీ సరిపోతుంది.
బి. కాల్షియం కార్బైడ్ (సవరణ) నియమాలు, 2021
(i) సమ్మతి భారాన్ని తగ్గించడానికి కాల్షియం కార్బైడ్ నిల్వ కోసం పొందిన లైసెన్స్ చెల్లుబాటును 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంచడం జరిగింది.
(ii) డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు మరియు ఫీజు సమర్పించాల్సిన అవసరం తొలగించబడింది. సిస్టమ్ ద్వారా లభించే ఆన్‌లైన్ కాపీ సరిపోతుంది.
(iii) ఆన్‌లైన్ లో ఫీజును చెల్లించడానికి అవకాశం కల్పించబడింది.
(iv) కాల్షియం కార్బైడ్ నిల్వ కోసం ప్రాంగణాన్ని పర్యవేక్షించడానికి ప్రాంగణ జియో మ్యాపింగ్ అనుమతించబడుతుంది. వివరాలను సంబంధిత రాష్ట్ర మరియు కేంద్ర అధికారులకు అందుబాటులో ఉంచబడతాయి. .
(v ) పారదర్శకత మరియు సమాచార ప్రాప్యతను పెంచడానికి, సరైన రికార్డులు మరియు నిల్వ సంబంధిత సమాచార లభ్యత కోసం సవరణలు చేయబడ్డాయి.
సి . అమ్మోనియం నైట్రేట్ (సవరణ) నియమాలు, 2021
(i) నిల్వ మరియు నిర్వహణ ప్రదేశాలలో తగినంత అగ్నిమాపక సౌకర్యాలు, నిల్వ మరియు నిర్వహణ ప్రదేశంలో ఫ్లోరింగ్ మెరుగుదల, స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్ వినియోగానికి పనికిరాకుండా ఉంటే దానిని తొలగించడం పోర్ట్ ప్రాంతం నుంచి భద్రతా దూరాన్ని నిర్ణయించడం లాంటి అంశాలకు సంబంధించి సవరణలను చేయడం జరిగింది.
(ii) సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి అమ్మోనియం నైట్రేట్‌ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి లైసెన్సుదారుడు బదిలీ చేయడానికి ఇప్పుడు అనుమతించబడింది. స్టీవడోర్‌ల నియంత్రణను మినహాయించడానికి నియమాలు సవరించబడ్డాయి (ఓడలో అమ్మోనియం నైట్రేట్‌ను లోడింగ్ / అన్‌లోడ్ చేసే ఏజెన్సీ).
(iii) తగినంత అగ్నిమాపక సౌకర్యం మరియు సెక్యూరిటీ గార్డులకు వసతి కల్పించడానికి మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. పోర్టులకు వచ్చే అమ్మోనియం నైట్రేట్ ను ఇప్పుడు పోర్టు ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఉన్న సమీప నిల్వ గృహాలకు తరలించడం / బదిలీ చేయవలసి ఉంటుంది.
(iv) జిల్లా అధికార యంత్రాంగం లేదా డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ నుండి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ కోరుతూ దాఖలైన దరఖాస్తును పరిష్కరించే సమయం (విచారణ, మంజూరు లేదా తిరస్కరణతో సహా) 6 నెలల నుంచి 3 నెలలకు తగ్గించబడింది.
(v) చిన్న స్టోర్‌హౌస్‌లో అమ్మోనియం నైట్రేట్ నిల్వ సామర్థ్యం స్థలాన్ని మరియు పరిమాణ అవసరాన్ని హేతుబద్ధం చేయడం ద్వారా మెరుగుపరచబడింది. సురక్షితంగా వేగంగా స్వాధీనం చేసుకున్న అమ్మోనియం నైట్రేట్‌ను తొలగించడానికి దీనిని వేలం వేయడానికి అనుమతిస్తూ నిబంధనలను సవరించడం జరిగింది.
(vi) దొంగతనాలను అరికట్టడానికి అమ్మోనియం నైట్రేట్‌ను బ్యాగ్ రూపంలో మాత్రమే దిగుమతి చేసుకోవడానికి నిబంధనలు రూపొందించబడ్డాయి. ఇది పోర్టులో వదులుగా ఉండే అమ్మోనియం నైట్రేట్ నిర్వహణను తగ్గిస్తుంది. దీనివల్ల భద్రతను మెరుగు పడుతుంది.
(vii) డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు మరియు ఫీజు సమర్పించాల్సిన అవసరం తొలగించబడింది. సిస్టమ్ ద్వారా లభించే ఆన్‌లైన్ కాపీ సరిపోతుంది.
***
(Release ID: 1756775)
Visitor Counter : 196