జౌళి మంత్రిత్వ శాఖ
జిఇఎం పోర్టల్‌పై దాదాపు 28,300 హస్తకళల పనివారు, 1,49,422 చేనేత కార్మికుల నమోదు
దాదాపు 35.22 లక్షల చేనేత పనివారు, 27 లక్షల హస్తకళల నిపుణులకు నేరుగా మార్కెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చొరవ
Posted On:
20 SEP 2021 4:47PM by PIB Hyderabad
నేత, చేతిపని వృత్తి పనివారికి మార్కెట్‌ను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జిఇఎం పోర్టల్‌పైకి నేతపనివారిని, చేతివృత్తులవారినీ తీసుకువచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. ఫలితంగా ప్రభుత్వానికి, శాఖలకు నేరుగా తమ ఉత్పత్తులను అమ్మేందుకు అవకాశం వారికి కలుగనుంది. చేనేత, హస్తకళాల రంగంలో పని చేస్తూ, ప్రభుత్వ మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సవాళ్ళను ఎదుర్కొనేందుకు చేతివృత్తులవారు, నేత పనివారు, క్షేత్రస్థాయి వ్యాపారవేత్తలు, మహిళలు, గిరిజన వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాల . భాగస్వామ్యాన్ని ఇది పెంచనుంది.
ఆగస్టు 30, 2021 నాటికి పోర్టల్‌పై 28,374 చేతిపనివారు, 1,49,422 మంది చేనేతపనివారు నమోదు చేసుకున్నారు. చేనేత అఅభివృద్ధి కమిషనర్ కార్యాలయం, హస్తకళల అభివృద్ధి కమిషనర్ కార్యాలయాల అధికారుల సహాయంతో చేనేత పనివారిని, హస్తకళల పనివారిని పోర్టల్‌పై నమోదు చేసే కార్యక్రమాన్ని జులై 2020లో జిఇఎం ప్రారంభించింది. ఈ అమ్మకందారు నమోదు ప్రక్రియలో నిమగ్నం అయ్యేందుకు 56 హస్తకళల సేవా కేంద్రాలు, 28 చేనేత సేవా కేంద్రాల అధికారులకు శిక్షణను ఇచ్చారు.
చేనేత ఉత్పత్తుల కోసం 28 ప్రత్యేక ఉత్పత్తి వర్గాలను సృష్టించారు. అదే సమయంలో హస్తకళా ఉత్పత్తులకు 170 కస్టమ్ ఉత్పత్తి వర్గాలను సృష్టించారు. ఈ పని కోసం భారతీయ చేనేత (https://gem.gov.in/landing/landing/india_handloom), భారతీయ హస్తకళలు (https://gem.gov.in/india-handicraft) వెబ్ బానర్లను, మార్కెట్ పేజీలను అభివృద్ధి చేశారు. చేనేత, హస్తకళల పనివారు, సహకార సంఘాలు, ఎస్‌హెచ్‌జి, వివిధ ప్రభుత్వ కొనుగోలు దారులకు అటువంటి ఉత్పత్తులను సరఫరా చేయగల ఉత్పత్తి కంపెనీల అత్యున్నత నాణ్యత కలిగిన వస్తువులను ఇందులో ప్రదర్శించనున్నారు.
ఈ చర్య ప్రభుత్వ కొనుగోలు దారులు చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, చేనేత, హస్తకళల పనివారు తమ ఉత్పత్తులను ఎటువంటి మధ్యవర్తులూ లేకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు దారులకు తమ ఉత్పత్తులను అమ్మేందుకు, నా చేనేత నా ఆత్మగౌరవం, స్థానికం కోసం గళం విప్పుదాం (వోకల్ ఫర్ లోకల్), మేకిన్ ఇండియా స్ఫూర్తిని బలోపేతం చేసి, ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా పయనించడానికి తోడ్పడుతుంది.
దాదాపు 35.22 లక్షల చేత కార్మికులకు, 27 లక్షల హస్తకళల పనివారులకు మార్కెట్‌ను నేరుగా అందుబాటులోకి తేవడం ద్వారా మధ్యవర్తులను తొలగించడం ఈ చొరవ లక్ష్యం. చేనేత, హస్తకళల ఉత్పత్తులకు సంబంధించి ప్రత్యేక ఉత్పత్తి వర్గాలను జిఇఎం సృష్టించింది. నేతపనివారు, హస్తకళల పనివారు, సహకార సంఘాలు, స్వయం సహాయక బృందాలు, వివిధ ప్రభుత్వ కొనుగోలుదారులకు ఉత్పత్తులను సరఫరా చేయగల సామర్ధ్యం ఉన్న కంపెనీల అత్యున్నత నాణ్యత కలిగిన చేనేత, హస్తకళల ఉత్పత్తులను ప్రదర్శించేందుకు భారతీయ చేనేత, భారతీయ స్తకళలకు సంబంధించి వెబ్ బ్యానర్లను, మార్కెట్ పేజీలను సృష్టించారు.
***
(Release ID: 1756562)
Visitor Counter : 202