నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జేఎన్ పిటీలో మరుగుజ్జు ( డ్వార్ఫ్) కంటైనర్ రైలును ప్రారంభించిన కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్


రవాణా ఖర్చులను తగ్గించి, తక్కువ సమయంలో కంటైనర్లను అందుబాటులోకి తెచ్చే నూతన విధానం

Posted On: 20 SEP 2021 1:14PM by PIB Hyderabad

జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ప్రవేశపెట్టిన  మరుగుజ్జు ( డ్వార్ఫ్) కంటైనర్ రైలును ఈ రోజు  కేంద్ర ఓడరేవులుషిప్పింగ్జలమార్గాలు, ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. వర్చువల్ విధానంలో పోర్ట్ ట్రస్ట్ డ్వార్ఫ్ కంటైనర్ డిపో నుంచి కంటైనర్లతో నింపిన తొలి రైలుకు జెండా ఊపి సేవలను ప్రారంభించారు. ఈ రైలు కాన్పూర్ ఇసీడ్ కి బయలు దేరింది. 

మరగుజ్జు కంటైనర్ రైలు సర్వీసులను ప్రారంభించిన జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ దీనివల్ల అనేక ప్రయోజనాలను పొందుతుంది. దీనివల్ల ఎక్సిమ్ సరకులను రెండు వరుసల్లో రవాణా చేస్తారు. దీనితో రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు పోర్టు ద్వారా సాగే కంటైనర్ల రవాణా పెరుగుతుంది.  అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్న కంటైనర్ తో పోల్చి చూస్తే డ్వార్ఫ్ కంటైనర్ ఎత్తు 660 ఎంఎం తక్కువగా ఉంటుంది. దీనితో వీటిని సులభంగా రవాణా చేయడానికి అవకాశం కలుగుతుంది.  ఎత్తు తక్కువగా  ఉండే ఈ  డ్వార్ఫ్ కంటైనర్లను ట్రయిలర్లపై గ్రామీణ,పట్టణ రహదారులు, తక్కువ ఎత్తు కలిగి ఉండే సుబ వేలు, విద్యుదీకరణ చేసిన సెక్షన్లలలో ఉండే లెవెల్ క్రాసింగ్ ల ద్వారా సులువుగా రవాణా చేయవచ్చు. 

డ్వార్ఫ్ కంటైనర్ల ద్వారా ఎక్కువ పరిమాణంలో సరుకులను రవాణా చేయడానికి వీలవుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉన్న కంటైనర్ లో 40 టన్నుల సరకులను   చేయవచ్చు. రెండు వరుసల్లో ఏర్పాటు అయ్యే డ్వార్ఫ్ కంటైనర్లలో 71 టన్నుల సరకులు రవాణా అవుతాయి. దీనితో పాటు రైల్వేలు అందిస్తున్న రాయితీ వల్ల రవాణాదారులకు  

అదనపు ప్రయోజనం కలుగుతుంది. రెండు వరుసల్లో ఏర్పాటు చేసిన ISO కంటైనర్ రైళ్లతో పోలిస్తే భారతీయ రైల్వే డ్వార్ఫ్ కంటైనర్లకు 17% డిస్కౌంట్ తో కలుపుకుంటే రవాణాదారులకు 33 శాతం డిస్కౌంట్ ను   రైల్వేలు అందిస్తున్నాయి.  దీనితో రైలు మార్గంలో రవాణా అయ్యే డ్వార్ఫ్ కంటైనర్ల వల్ల రవాణా ఖర్చు తగ్గి ప్రపంచ మార్కెట్లో పోటీ పడడానికి ఎగుమతిదారులకు అవకాశం కల్పిస్తుంది. 

ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ మరగుజ్జు కంటైనర్ రైలు సేవలను ప్రారంభించడం ద్వారా ఎక్సిమ్ సరకుల రవాణాను క్రమబద్ధీకరించడానికి అమలు చేస్తున్న చర్యలు కీలక దశకు చేరుకున్నాయని అన్నారు.  జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్  ద్వారా సాగుతున్న  రైలు-కార్గో ట్రాఫిక్‌ పెరగడానికి , రవాణా  ఖర్చులను తగ్గించడానికి ఇది దోహద పడుతుందని అన్నారు. దీనివల్ల ఎక్సిమ్ రంగానికి పోటీ సామర్ధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. పోర్టుల అవసరాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో దేశంలో డ్వార్ఫ్  కంటైనర్లను ఉత్పత్తి చేయవచ్చునని  శ్రీ సోనోవాల్ తెలిపారు.

డ్వార్ఫ్ కంటైనర్లు దేశ ఎగుమతులను ఎక్కువ చేసే అంతర్జాతీయ మార్కెట్లో దేశ వస్తువులు పోటీ పడడానికి అవకాశం కల్పిస్తాయి. సరకు రవాణా రంగంలో ప్రపంచ మార్కెట్లో అగ్ర స్థానాన్ని సాధించి 'మేక్ ఇన్ ఇండియాద్వారా ఉత్పత్తి అంగంలో కీలక పాత్ర పోషించడానికి దేశం అమలు చేస్తున్న చర్యలు విజయవంతం అయ్యేలా చూసే అంశంలో కూడా ఈ విధానం సహకరిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ పని సామర్ధ్యాన్ని మరింత మెరుగు పరచి, వాహనాల రద్దీని తగ్గించడానికి కూడా అవకాశం కలుగుతుంది. రవాణా ఖర్చులను తగ్గించడంతో పాటు కంటైనర్లను తక్కువ వ్యవధిలో తిరిగి వినియోగించడానికి ఈ రవాణా వ్యవస్థ ఉపకరిస్తుంది. 

డ్వార్ఫ్ కంటైనర్ల రవాణాను ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ప్రత్యేక సౌకర్యాలను సమకూర్చుకుంది. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన డ్వార్ఫ్ కంటైనర్ డిపో లో పెద్ద కంటైనర్లలో వచ్చే సరకులను చిన్న కంటైనర్లలోకి మారుస్తారు. దీనితో ఎగుమతులకు అవసరమైన పెద్ద కంటైనర్లు పోర్టులో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సరకులను ఎగుమతి చేయడానికి అవసరమైన సంఖ్యలో కంటైనర్లు అందుబాటులో లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. డ్వార్ఫ్ కంటైనర్లు అందుబాటులోకి రావడంతో పెద్ద కంటైనర్ల లభ్యత పెరుగుతుంది. ఇదివరకు ఒక కంటైనర్ సరకులను దించి తిరిగి రవాణాకు సిద్ధం కావడానికి కొన్ని నెలల సమయం పట్టేది. జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ప్రారంభించిన డ్వార్ఫ్ కంటైనర్ సేవల వల్ల పెద్ద కంటైనర్లు రోజుల వ్యవధిలో తిరిగి వినియోగించడానికి సిద్ధంగా ఉంటాయి. 

డ్వార్ఫ్ కంటైనర్ రవాణా వల్ల జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ అభివృద్ధి సాధించడంతో పాటు, రద్దీని తగ్గించడానికి, రోడ్డు మార్గం ద్వారా సరకుల ఆవాలను ఎక్కువ చేయడానికి అవకాశం కలుగుతుంది. 

***


(Release ID: 1756505) Visitor Counter : 254