ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ఆజాది కా అమృత్ మహోత్సవ్' జ్ఞాపకార్థం \సెయిల్‌-వీఐఎస్ఎల్‌లో వక్తృత్వ పోటీలు

Posted On: 19 SEP 2021 9:26AM by PIB Hyderabad

'ఆజాది కా అమృత్ మహోత్సవం'   నేప‌థ్యంలో ఉక్కు మంత్రుత్వ శాఖ ప‌రిధిలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ‌కు చెందిన‌ విశ్వేశ్వరయ్య ఐరన్ & స్టీల్ ప్లాంట్ (వీఐఎస్ఎల్) యూనిట్  "భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర్యం - నాకు స్వాతంత్ర్యం అంటే ఏమిటి?" అనే అంశంపై ఇంగ్లీష్‌లో ఒక వ‌క్తృత్వ‌ పోటీని నిర్వహించింది. భద్రావతి ఉన్నత పాఠశాల విద్యార్థుల
నిమిత్తం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 15 పాఠశాలల నుండి 27 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు.  సంస్థ‌కు చెందిన ఆప‌రేష‌న్స్ విభాగం  చీఫ్ జనరల్ మేనేజర్  శ్రీ కె. ఎస్. సురేష్, జనరల్ మేనేజర్ ఇంఛార్జ్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్)  , శ్రీ పి.పి. చక్రవర్తి, ఎస్ఏవీ ఇంగ్లీష్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ బి.ఎన్‌. గిరీష్ త‌దిత‌రులు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.
ఈ  కార్య‌క్ర‌మంలో పాల్గొనే ప్ర‌తినిధి విభాగం నుంచి ఒక‌రు, విద్యార్ధి ప్ర‌తినిధి విభాగం నుంచి ఒక్కొక్క‌రు చొప్పున  కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని వీఐఎస్ఎల్ & ఎస్ఏవీ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని వీఐఎస్ఎల్‌ యొక్క ప్ర‌జా సంబంధాల‌ విభాగం సమన్వయం చేసింది.
                                                                             

******


(Release ID: 1756326) Visitor Counter : 242