ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జన్మదిన శుభాకాంక్షలుతెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, ఇతర ప్రపంచ నేతల కు కృత‌జ్ఞ‌త‌ లు వ్యక్తం చేసిన ప్ర‌ధానమంత్రి

Posted On: 17 SEP 2021 8:34PM by PIB Hyderabad

జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, ఇతర ప్రపంచ నేతల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కృత‌జ్ఞ‌త‌ లు వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి కి ఇచ్చిన జవాబు లో, ‘‘మాననీయ రాష్ట్రపతి మహోదయ్, మీ అమూల్యమైనటువంటి శుభకామన సందేశానికి గాను హృద‌య‌పూర్వక కృత‌జ్ఞ‌త‌ లు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఉప రాష్ట్రపతి కి ఇచ్చిన ఒక సమాధానం లో ‘‘ఆలోచనపూర్వక శుభాకాంక్షల కు గాను ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

శ్రీ లంక అధ్యక్షుడు కు ఇచ్చిన ప్రత్యుత్తరం లో ‘‘శుభాకాంక్షలు తెలిపినందుకు అధ్యక్షుడు శ్రీ గోటబాయా ఆర్ కు ఇవే ధన్యవాదాలు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

నేపాల్ ప్రధాని కి ఇచ్చిన ఒక జవాబు లో ‘‘ నేను మీ శుభాకాంక్షల కు గాను ధన్యవాదాలు తెలియజేయాలనుకొంటున్నాను ప్రధాని శ్రీ శేర్ బహాదుర్ దేవు బా గారు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

 

‘‘శుభాకాంక్ష లు తెలియజేసినందుకు నా మిత్రుడు, ప్రధాని శ్రీ రాజపక్షే కు ధన్యవాదాలు.’’ అని శ్రీ లంక ప్రధాని కి ఇచ్చిన ఒక జవాబు లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

డొమినికా ప్రధాని కి ఇచ్చిన ఒక జాబు లో ‘‘మీ ప్రేమపూర్వకమైన శుభాకాంక్షల కు గాను కృత‌జ్ఞుడి ని ప్రధాని శ్రీ రూజ్ వెల్ట్ స్కెరిట్ గారు.’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

నేపాల్ పూర్వ ప్రధాని కి ఇచ్చిన జవాబు లో ‘‘ధన్యవాదాలు శ్రీ కె.పి. శర్మ ఓలీ గారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***(Release ID: 1756310) Visitor Counter : 69