గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

4వ జాతీయ పోషకాహార మాసోత్సవాలు, 2021 నిర్వహించిన - దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్
ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం మరియు వాష్ (ఎఫ్.ఎన్.హెచ్.డబ్ల్యూ) కు సంబంధించిన కార్యక్రమాల అమలును ప్రారంభించిన - డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం.

పోషణ్ ర్యాలీలు, పోషణ్ ప్రతిజ్ఞలు, పోషణ్ రంగోలిలు, యోగా సెషన్లు, సెన్సిటైజేషన్ సమావేశాలు, న్యూట్రీ-గార్డెన్స్ ను ప్రోత్సహించడం వంటి వివిధ కార్యక్రామాల ద్వారా పోషకాహార మాసోత్సవాలను జరుపుకుంటున్న - రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు

Posted On: 18 SEP 2021 11:35AM by PIB Hyderabad

ఎస్.హెచ్.జి. సభ్యులు, వారి కుటుంబాలు సిఫార్సు చేసిన పద్ధతులను అనుసరించడానికి వీలుగా, వారి అలవాట్లలో మార్పును ప్రోత్సహించాలనే లక్ష్యంతో, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డి.ఏ.వై-ఎన్.ఆర్.ఎల్.ఎం), పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా, కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఆహారం, పోషకాహారం, ఆరోగ్యం మరియు వాష్ (ఎఫ్.ఎన్.హెచ్.డబ్ల్యూ) కు సంబంధించిన కార్యక్రమాల అమలు ను ప్రారంభించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పోషణ్ అభియాన్ కింద మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తో కూడా కలిసి పనిచేస్తోంది. 

హెచ్.పి.ఎస్.ఆర్.ఎల్.ఎం. సభ్యులు 4వ జాతీయ పోషకాహార మాసోత్సవాలను జరుపుకున్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  స్వయం సహాయ సంఘ సభ్యులు ఆహార వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను చర్చించారు. స్థానికంగా పండించిన పండ్లు, కూరగాయల వినియోగాన్ని నొక్కి చెప్పారు.

కౌమారదశలో ఉన్నవారు, గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పాటు చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి వీలుగా కేంద్రీకరించి, ప్రవర్తన మార్పు కార్యకలాపాలను బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో, సంపూర్ణ పోషణ కోసం ప్రధాన మంత్రి పథకం (పోషణ్) అభియాన్ కింద, ప్రతి సంవత్సరం, సెప్టెంబర్ నెలను జాతీయ పోషకాహార మాసంగా పాటించడం జరుగుతోంది. 

ఈ ఏడాది జాతీయ పోషకాహార మాసోత్సవాల కోసం, వారానికి ఒకటి చొప్పున నాలుగు ఇతివృత్తాలను గుర్తించడం జరిగింది. అవి - (i) 'పోషకాహార కేంద్రాలు' గా తోటలను పెంచే కార్యకలాపాలు;  (ii) పోషణ కోసం యోగా మరియు ఆయుష్;  (iii) అధిక భారం ఉన్న జిల్లాల్లోని అంగన్‌-వాడీ లబ్ధిదారులకు 'ప్రాంతీయ పోషకాహార సామాగ్రి' పంపిణీ;  (iv) సి.ఏ.ఎం. పిల్లలను గుర్తించడంతో పాటు వారికి పౌష్టికాహారాన్ని పంపిణీ చేయడం.  ఈ ఇతివృత్తాలతో పాటు, రాబోయే పండుగ రోజులను దృష్టిలో ఉంచుకుని కోవిడ్-19 నివారణకు తగిన ప్రవర్తనలను పునరుద్ఘాటించాలని రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్‌ (ఎస్.ఆర్.ఎల్.ఎం) లను మంత్రిత్వ శాఖ సూచించింది.  అదేవిధంగా, స్వయం సహాయ బృందాల సభ్యులతో పాటు, వారి కుటుంబాలకు కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం;  ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రవర్తనలతో పాటు, రోగనిరోధక శక్తిని పెంపొందించే చర్యలను ప్రోత్సహించడం;   చిరుధాన్యాలతో సహా ఆహార వైవిధ్యాన్ని పాటిస్తూ, సంప్రదాయ ఆహార పదార్ధాలను ప్రోత్సహించడం;   మునగ చెట్ల పెంపకం పై దృష్టి సారించి పోషకాహార తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలను కూడా చేపట్టాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ విషయమై, మంత్రిత్వ శాఖ ద్వారా ఎస్‌.ఆర్‌.ఎల్‌.ఎమ్‌. లకు తగిన సూచనలు, మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ ఎస్.ఆర్.ఎల్.ఎం. ఆధ్వర్యంలో యుక్త వయస్సులో ఉన్న వారి కోసం ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాలు.  

కౌమార ఆరోగ్యం, పోషకాహారం, రుతుక్రమం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించడానికి కౌమార బాలికలతో సమావేశాలు నిర్వహించబడ్డాయి.

రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ప్రణాళిక మరియు సమన్వయ సమావేశంలో పాల్గొనడానికి;  స్వయం సహాయ బృందాలు మరియు వారి సమాఖ్యల సమావేశాలలో గుర్తించబడిన సమస్యలను చర్చించడానికి; వివిధ రకాల పోటీలు, వంటకాల ప్రదర్శనలు వంటి కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలు నిర్వహించడానికి;  స్థానికంగా లభించే పోషకాహార పదార్ధాలను ప్రోత్సహించే సంప్రదాయ ఆహార ఉత్సవాలు,  పోషణ్ ర్యాలీ,  పోషణ్  రంగోలి, పోషణ్ పోస్టర్లు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి;  మునగ చెట్ల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, స్వయం సహాయ బృందాల సభ్యుల ఇళ్లల్లో పోషక తోటల పెంపకాన్ని ప్రోత్సహించడానికి;  పోషక తోటలు, మునగ చెట్ల పెంపకం తో పాటు ఆహార వైవిధ్యం యొక్క ప్రయోజనాల పై విస్తృతంగా అవగాహన కల్పించడానికి; మహిళా, శిశు అభివృద్ధి శాఖ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా, ఆరోగ్య శాఖతో కలిసి స్వయం సహాయ బృందాల సభ్యులు మరియు వారి కుటుంబాలకు కోవిడ్-19 టీకాలు వేసే కార్యక్రమాలు నిర్వహించడానికి;  వెబీనార్లు, వాట్సాప్ గ్రూపులు, ఆన్‌-లైన్ చర్చా వేదికలు మొదలైన సాంకేతిక మాధ్యమాల ద్వారా ముఖ్యమైన సందేశాలను ప్రచారం చేయడానికి;  పోషకాహార మాసోత్సవ కార్యాచరణ క్యాలెండర్ ప్రకారం మహిళా, శిశు అభివృద్ధి శాఖ, ఆరోగ్య శాఖతో పాటు ఇతర విభాగాలు నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనడానికి కూడా రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు, మహిళా, శిశు అభివృద్ధి శాఖ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

అస్సాం ఎస్.ఆర్.ఎల్.ఎం. లో పిల్లల తో  నిర్వహించిన  యోగ  కార్యక్రమం 

పోషకాహార మాసోత్సవ ప్రణాళిక మరియు సన్నాహాలపై చర్చించడానికి, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అధ్యక్షతన 2021 సెప్టెంబర్, 4వ తేదీన, అన్ని ఎస్.ఆర్.ఎల్.ఎం. లతో దృశ్య మాధ్యమం ద్వారా ఒక సమావేశం నిర్వహించడం జరిగింది.  అన్ని  ఎస్.ఆర్.ఎల్.ఎం.  లు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రణాళికలను సమర్పించాయి.  ఎస్.ఆర్.ఎల్.ఎం. ల ద్వారా జిల్లా మరియు బ్లాక్ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి, తగిన మార్గదర్శకాలు అందజేయడం జరిగింది.  క్షేత్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు  కోవిడ్ -19 నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కూడా ఎస్.ఆర్.ఎల్.ఎం. లను అభ్యర్థించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గత నెలలో స్వయం సహాయ బృందాల సభ్యులతో సంభాషించారు.   75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  ఆరోగ్యం, పోషకాహారం, వాష్‌ తో సహా సామాజిక అభివృద్ధి సమస్యలపై అవగాహన కల్పించే అంశాలపై 75 గంటలు గడపాలని వారికి సూచించారు. ఎస్.ఆర్.ఎల్.ఎం. లు తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలనీ, ప్రస్తుతం కొనసాగుతున్న పోషకాహార మాసోత్సవాల సమయంలో, అవగాహన కల్పించే కార్యకలాపాలను చేపట్టడానికి వీలుగా, స్వయం సహాయ బృందాల సభ్యులకు అవసరమైన మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారు.

పోషణ్ రంగోలి - కర్ణాటక 

పోషణ్ రంగోలి - ఉత్తర ప్రదేశ్

పోషణ్ ర్యాలీలు,  పోషణ్   ప్రతిజ్ఞలు,  పోషణ్   రంగోలిలు, యోగా సెషన్లు, సెన్సిటైజేషన్ సమావేశాలు, న్యూట్రీ-గార్డెన్స్ ను ప్రోత్సహించడం వంటి వివిధ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు,  పోషకాహార మాసోత్సవాలను నిర్వహిస్తున్నాయి.

 

*****(Release ID: 1756290) Visitor Counter : 129