ఆయుష్
ఏఎస్యు&హెచ్ భద్రత, నాణ్యత విషయంలో ప్రపంచ సమాజానికి నమ్మకాన్ని పెంచేలా ఉమ్మడి సహకారం
ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా, భారత్ కు చెందిన పిసిఐఎం & హెచ్,
అమెరికన్ హెర్బల్ ఫార్మకోపోయియాతో కలిసి అవగాహన ఒప్పందంపై సంతకం
प्रविष्टि तिथि:
15 SEP 2021 10:38AM by PIB Hyderabad
కీలకమైన ముందడుగులో భాగంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద, ఇతర భారతీయ సాంప్రదాయ ఔషధ ఉత్పత్తుల నాణ్యతను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా అమెరికన్ మార్కెట్‌లో వాటి ఎగుమతి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గం సుగమం చేసింది. ఫార్మాకోపోయియా కమిషన్ ఫర్ ఇండియన్ మెడిసిన్ & హోమియోపతి (పిసిఐఎం & హెచ్), అమెరికన్ హెర్బల్ ఫార్మాకోపోయియా, యుఎస్‌ఎ, 2021సెప్టెంబర్ 13న ఒక అవగాహన ఒప్పందం (ఎంఒయు) పై సంతకం చేయడం ద్వారా ఇది సాధించడం అయింది.
ఈ ఎంఒయుపై వర్చ్యువల్ గా సంతకాలు జరిగాయి. సమానత్వం మరియు పరస్పర ప్రాతిపదికన రెండు దేశాల మధ్య ఆయుర్వేదం మరియు ఇతర భారతీయ సాంప్రదాయ వైద్య వ్యవస్థల ప్రమాణాలను బలోపేతం చేయడం, ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఎంఓయూ కుదుర్చుకుంది.
ఏఎస్యు&హెచ్ (ఆయుర్వేదం, సిద్ధ, యునాని మరియు హోమియోపతి) ఔషధాల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడంలో ఈ ప్రయత్నాల సహకారం కోసం సుదీర్ఘ ప్రయాణం ఉంటుంది. ఈ ఎంవోయు కింద, సంప్రదాయ వైద్య రంగంలో సహకారం కోసం మోనోగ్రాఫ్‌లు మరియు ఇతర కార్యకలాపాల అభివృద్ధికి కాలక్రమాలతో పాటు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఒక ఉమ్మడి కమిటీ విధానం ఉంటుంది.
ఏఎస్యు&హెచ్ ఔషధాల భద్రత గురించి ఈ ఎంఓయూ ప్రపంచ సమాజంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఈ భాగస్వామ్యం ప్రధాన ఫలితాలలో ఒకటి పిసిఐఎం&హెచ్, ఏహెచ్పి, రెండూ అమెరికాలో ఆయుర్వేద ఉత్పత్తులు/ఔషధాల హెర్బల్ మార్కెట్ ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గుర్తించడానికి పనిచేస్తుంది. అమెరికాలోని మూలికా ఔషధాల తయారీదారులు ఈ సహకారం నుండి అభివృద్ధి చేసిన ఆయుర్వేద ప్రమాణాలను స్వీకరించడానికి ఇది దారి తీస్తుంది. దీనిని ఒక పెద్ద ముందడుగుగా పేర్కొనవచ్చు మరియు చివరికి అమెరికాలో ASU & H ఉత్పత్తులు/ఔషధాల మార్కెట్ అధికారం కోసం ఈ సహకారం నుండి అభివృద్ధి చేయబడిన ఆయుర్వేద ప్రమాణాలను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ ఎంఒయు ద్వారా ఇద్దరు భాగస్వాములు ఆయుర్వేదం, ఇతర భారతీయ సాంప్రదాయ ఔషధ ఉత్పత్తుల నాణ్యత మరియు భద్రతకు భరోసా ఇచ్చే ప్రమాణాల గుర్తించడానికి ప్రయత్నిస్తారు. సాంప్రదాయ /మూలికా మందులు మరియు వాటి ఉత్పత్తుల నాణ్యతపై అవగాహన మరియు అవగాహన పెరుగుదలను నిర్ధారిస్తుంది.
*****
(रिलीज़ आईडी: 1755301)
आगंतुक पटल : 208