ప్రధాన మంత్రి కార్యాలయం

సంసద్ టీవీ ని కలసి ప్రారంభించిన ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, లోక్‌స‌భ‌ స్పీకర్ లు


భారతదేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ స్రవంతుల కలయిక ఒక్కటే కాదు, అది మనజీవన వాహిని కూడాను: ప్రధాన మంత్రి

సంసద్టీవీ దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధుల కుఒకకొత్త గొంతుక అవుతుంది: ప్రధాన మంత్రి

‘కంటెంట్ ఇజ్ కనెక్ట్’  అనేది పార్లమెంటరీ సిస్టమ్ కు కూడా సమానం గా అమలవుతుంది: ప్రధాన మంత్రి

Posted On: 15 SEP 2021 7:10PM by PIB Hyderabad

ఈ రోజు న ప్రజాస్వామ్యం తాలూకు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంసద్ టీవీ ని ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్ మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌ స‌భ‌ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా లు ముగ్గురూ కలసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ పార్లమెంటు తో ముడిపడిన చానల్ లో, శరవేగం గా మారిపోతున్న కాలం తో పాటే మార్పు చోటు చేసుకోవడాన్ని ప్రశంసించారు. చర్చ లు- సంభాషణ ల మాధ్యమం ద్వారా 21వ శతాబ్దం ఒక క్రాంతి ని తీసుకు వస్తూ ఉంటే ఈ పరిణామం మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకొంటుందని ఆయన అన్నారు. సంసద్ టీవీ ప్రారంభాన్ని భారతదేశ ప్రజాస్వామ్యం చరిత్ర తాలూకు కథ లో ఒక కొత్త అధ్యాయం గా ప్రధాన మంత్రి అభివర్ణించారు. ఎందుకంటే సంసద్ టీవీ రూపం లో దేశాని కి చర్చలు, సంభాషణ అనే ఒక మాధ్యమం లభిస్తోందని, అది ప్రజాస్వామ్యానికి, ప్రజల ప్రతినిధుల కు ఒక కొత్త గొంతుక గా అయిపోతుంది అని ఆయన వివరించారు. దూరదర్శన్ ఏర్పాటై 62 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నందుకు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలిపారు. ఈ రోజు న ఇంజినీర్స్ డే కూడా కావడం తో, ఇంజినీర్ లు అందరికి ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ రోజు న ప్రజాస్వామ్యం యొక్క అంతర్జాతీయ దినం కూడా అని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుకొంటూ ఉన్నప్పుడు భారతదేశం బాధ్యత మరింత గా పెరిగిపోతుంది, ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామ్యాని కి జనని గా ఉంది అన్నారు. భారతదేశాని కి ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది ఒక చైతన్యం కూడాను అని ఆయన అన్నారు. భారతదేశం లో ప్రజాస్వామ్యం రాజ్యాంగ సౌధం మాత్రమే కాదు, అది ఒక స్ఫూర్తి కూడా అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ప్రజాస్వామ్యం ఓ రాజ్యాంగ ధార ల కలయిక మాత్రమే కాక ప్రజాస్వామ్యం మన జీవన వాహిని అని ఆయన అన్నారు.

స్వాతంత్ర్యానికి 75వ సంవత్సరం వచ్చిన సందర్భం లో ప్రసార మాధ్యమాల భూమిక ను గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. గడచిపోయిన కాలం తాలూకు గౌరవం తో పాటు భవిష్యత్తు పట్ల భరోసా.. ఈ రెండూ కూడా ఇప్పుడు మన కళ్లెదుట ఉన్నాయన్నారు. ప్రసార మాధ్యమాలు స్వచ్ఛ్ భారత్ అభియాన్వంటి అంశాల ను ప్రస్తావించినప్పుడు అవి ప్రజల చెంతకు అమిత వేగం గా చేరుకొంటున్నాయి అని ఆయన గుర్తు చేశారు. ప్రసార మాధ్యమాలు స్వాతంత్ర్య పోరాటం పై 75 భాగాల ప్రణాళిక ను రూపొందించి ఈ సందర్భం లో ఒక ప్రత్యేక అనుబంధాన్ని తీసుకు వచ్చి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేళ లో ప్రజల ప్రయాసల ను వివరించడం లో ఒక పాత్ర ను పోషించవచ్చంటూ ఆయన ఒక సూచన ను చేశారు.

కంటెంట్ ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, కంటెంట్ ఇజ్ కింగ్ అని అంటూ ఉంటారు, అయితే తన అనుభవం లో కంటెంట్ ఇజ్ కనెక్ట్అని పేర్కొన్నారు. దీనిని గురించి ఆయన విడమరచి చెప్తూ, ఎప్పుడయితే ఎవరి దగ్గర అయినా ఉత్తమమైన కంటెంట్ ఉంటుందో, అప్పుడు ప్రజలు స్వతహా గా వారితో ముడిపడిపోతారు. ఈ విషయం ప్రసార మాధ్యమాల పరం గా ఎంత గా వర్తిస్తుందో, అంతగా మన పార్లమెంటరీ వ్యవస్థ కు కూడాను వర్తిస్తుంది, ఎందుకంటే పార్లమెంట్ ఉభయ సభల లో ఒక్క రాజకీయాలే ఉండవు, అక్కడ విధానాలు కూడా రూపాన్ని పోసుకొంటాయి అన్నారు. సాధారణ ప్రజానీకం పార్లమెంటు కార్యకలాపాల తో మమేకం అయిపోవాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశ లో కృషి చేయాలి అని కొత్త చానల్ కు ఆయన సూచించారు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు, విభిన్న అంశాల పైన చర్చ లు సాగుతూ ఉంటాయని, వాటి లో యువత కు నేర్చుకొనేందుకు ఎంతో ఉంటుందని ప్రధాన మంత్రి అన్నారు. మన గౌరవనీయ పార్లమెంట్ సభ్యుల కు కూడా వారి ని దేశ ప్రజలు చూస్తూ ఉన్నారన్న విషయం అప్పుడు తెలుస్తుంది, అలాంటప్పుడు పార్లమెంట్ లోపల ఉత్తమమైన పద్ధతి లో నడుచుకోవడానికి, ఉత్తమమైన విధం గా చర్చించడానికి ప్రేరణ లభిస్తుంది అని ఆయన అన్నారు. పౌరులు సైతం వారి కర్తవ్యాల పైన దృష్టి ని సారించవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ఈ దిశ లో అవగాహన ను కల్పించడం లో ప్రసార మాధ్యమాలు ఒక ప్రభావ శీల మాధ్యమం అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా, మన యువత కు మన ప్రజాస్వామ్య సంస్థలు, వాటి పనితీరు తో పాటు పౌరుల బాధ్యతల ను గురించి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది అని ఆయన అన్నారు. అదేవిధం గా, సభాసంఘాలు, సభా కార్యకలాపాల ప్రాముఖ్యం మరియు చట్టసభ ల కార్యాలను గురించిన తగినంత సమాచారం అందుతుందని, దీనితో భారతదేశం లోని ప్రజాస్వామ్యాన్ని బాగా అర్థం చేసుకోవడం లో తోడ్పాటు లభిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. క్షేత్ర స్థాయి ప్రజాస్వామ్యానికి ప్రతిరూపాలైన పంచాయతీ ల పనితీరు కు సంబంధించిన కార్యక్రమాలు సంసద్ టీవీ లో రూపొందుతాయనే ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు భారతదేశం లోని ప్రజాస్వామ్యాని కి ఒక సరికొత్త శక్తి ని, ఒక వినూత్నమైన చైతన్యాన్ని అందిస్తాయి అని ఆయన అన్నారు.

 

तेजी से बदलते समय में मीडिया और टीवी channels की भूमिका भी तेजी से बदल रही है।

21वीं सदी तो विशेष रूप से संचार और संवाद के जरिए revolution ला रही है।

ऐसे में ये स्वाभाविक हो जाता है कि हमारी संसद से जुड़े चैनल भी इन आधुनिक व्यवस्थाओं के हिसाब से खुद को ट्रान्स्फॉर्म करें: PM

— PMO India (@PMOIndia) September 15, 2021

India is the mother of democracy.

भारत के लिए लोकतन्त्र केवल एक व्यवस्था नहीं है, एक विचार है।

भारत में लोकतंत्र, सिर्फ संवैधानिक स्ट्रक्चर ही नहीं है, बल्कि वो एक स्पिरिट है।

भारत में लोकतंत्र, सिर्फ संविधाओं की धाराओं का संग्रह ही नहीं है, ये तो हमारी जीवन धारा है: PM

— PMO India (@PMOIndia) September 15, 2021

मेरा अनुभव है कि- “कन्टेंट इज़ कनेक्ट।”

यानी, जब आपके पास बेहतर कन्टेंट होगा तो लोग खुद ही आपके साथ जुड़ते जाते हैं।

ये बात जितनी मीडिया पर लागू होती है, उतनी ही हमारी संसदीय व्यवस्था पर भी लागू होती है!

क्योंकि संसद में सिर्फ पॉलिटिक्स नहीं है, पॉलिसी भी है: PM

— PMO India (@PMOIndia) September 15, 2021

हमारी संसद में जब सत्र होता है, अलग अलग विषयों पर बहस होती है तो युवाओं के लिए कितना कुछ जानने सीखने के लिए होता है।

हमारे माननीय सदस्यों को भी जब पता होता है कि देश हमें देख रहा है तो उन्हें भी संसद के भीतर बेहतर आचरण की, बेहतर बहस की प्रेरणा मिलती है: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 15, 2021

***

DS/AK



(Release ID: 1755265) Visitor Counter : 225