హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“రాజభాష కీర్తి”, “రాజభాష గౌరవ్” పురస్కారాల ప్రదానం


అధికార భాషాభివృద్ధి కృషికి గుర్తింపుగా అవార్డులు
హిందీ దివస్-2021లో అవార్డులు అందించిన అమిత్ షా..
2018-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు,
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్.లో జరిగిన అవార్డులు ప్రదానం

హిందీకి, ఇతర భాషలకు తేడా లేదన్న కేంద్రమంత్రి,..
మిగతా అన్ని భాషలతోనూ హిందీకి మైత్రి ఉందని,
అన్ని భాషలు కలసి ఉంటేనే ప్రగతి సాధ్యమని వెల్లడి


ఉత్పాదన, వాణిజ్య సంస్థలకే కాకుండా భాషలకు కూడా
స్వావలంబన లక్ష్యాన్ని వర్తింపజేయాలని పిలుపు...
అప్పుడే, పూర్తి స్వావలంబనను సాధించగలమని వెల్లడి
అత్యున్నత సభా వేదికలపై కూడా ప్రధాని హిందీలోనే
ప్రసంగిస్తుండగా మనకు సంకోచం ఎందుకని వ్యాఖ్య




వేదిక ఏదైనా హిందీలోనే ప్రసంగం ప్రధాని ఆనవాయితీ
అధికార భాష స్థిరపడటానికి ఇదే దోహదమన్న కేంద్రమంత్రి

మన భాషల ప్రోత్సాహానికి, అధికార భాషకు ఎంత సేవచేశామో
సమీక్షించుకునేందుకు సెప్టెంబరు 14 సరైన తరుణం.

రాబోయే కాలాల్లో భాషలకు భారత్ రక్షణ కల్పిస్తుంది.
వాటిని మనం సరళంగా, ప్రయోజనకరంగా మలుచుకోవాలి...

స్వదేశీ, స్వభాష, స్వరాజ్,..అనేవి
స్వాతంత్య్రోద్యమానికి ప్రధాన స్తంబాలు..

అధికార భాషను జాతీయ వ

Posted On: 14 SEP 2021 7:01PM by PIB Hyderabad

  న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మంగళవారం జరిగిన హిందీ దినోత్సవానికి (హిందీ దివస్-2021కి) కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికార భాషగా హిందీని అమలు చేయడంలో ఎంతో విశిష్టమైన సేవలందించిన వివిధ మంత్రిత్వ శాఖలకు, విభాగాలకు, ప్రభుత్వ సంస్థలకు రాజభాషా కీర్తి, రాజభాషా గౌరవ్ పురస్కారాలను అమిత్ షా ఈ సందర్భంగా ప్రదానం చేశారు. 2018-19, 2019-20, 2020-21 సంవత్సరాలకు గాను ఈ అవార్డులను ప్రదానం చేశారు. “రాజభాషా భారతి” కరదీపిక 160వ సంకలనాన్ని కూడా అమిత్ షా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రులు నిత్యానంద రాయ్, అజయ్ కుమార్ మిశ్రా, నిశ్చిత్ ప్రామాణిక్, కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, అధికార భాషా వ్యవహారాల విభాగం కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా  కార్యక్రమానికి హాజరయ్యారు.

 

  ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, మనం భారత రాజ్యాంగాన్ని ఆమోదించినపుడే, భారతదేశపు అధికార భాషగా హిందీయే ఉండాలని, హిందీ భాషకు దేవనాగరి లిపి ఉండాలని 1949 సెప్టెంబరు 14న నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ రోజు ప్రదానం చేసిన అవార్డులు చాలామందికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని, అధికార భాషను ప్రోత్సహించేందుకు తగిన ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. హిందీయేతర భాషల్లో అవార్డు విజేతలను ఆయన అభినందిస్తూ, స్థానిక భాషతో పాటు, అధికార భాషను కూడా సొంత రాష్ట్రానికి తీసుకురావడంలో వారు గొప్ప కృషి చేశారన్నారు. హిందీకి, ఏ ఇతర స్థానిక భాషకు ఎలాంటి తేడా లేదని, అన్ని భారతీయ భాషలతోనూ హిందీ మైత్రీ స్వభావం కలిగిన భాష అని, ఇతర భాషలతో కలసి ఉండటం ద్వారానే హిందీ అభివృద్ధి చెందుతుందని అమిత్ షా అన్నారు.

  మన భాషకు, అధికార భాషకు మనం ఏ మేరకు సేవలందించామో, భాషల ప్రోత్సాహానికి, రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో సమీక్షించుకునేందుకు, ఆత్మ శోధన చేసుకునేందుకు సెప్టెంబరు 14వ తేదీ సరైన దినమని కేంద్రమంత్రి అన్నారు. స్థానిక భాషల వైభవానికి యువతరంనుంచి తగిన గౌరవ మర్యాదలు లభించేలా చూసేందుకు ఇది తగిన తరుణమన్నారు. మన భాషలకోసం మనదేశం జరిపిన పోరాటం విఫలమవుతుందేమో అని ఒక దశలో ఆందోళన పడిన రోజులను కూడా గతంలో చూశామని, అయితే,..రాబోయే రోజుల్లో భారతదేశం తన భాషలను రక్షించుకోగలదని ఆయన అన్నారు. మనం మన భాషలను సడలింపుయోగ్యాంగా, మరింత ప్రయోజకరంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూచించారు.

   https://ci3.googleusercontent.com/proxy/0srYp9RehEDJPvbz0Yq1Yfza5qlIlqcNzvAw25311s5rKFUsZRFd6fMiIQT5fb866klXRbhVHFp1GEE_f3TxMJXkaZmUwVx7dxssN63fK1eYA8lYu_37eWnfwQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TVX5.jpg స్వాతంత్ర్యం సముపార్జించుకుని 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నామని అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజునుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,.. మనకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యాలను ఉద్బోధించారని, స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని సాధించడం ఈ లక్ష్యాల్లో ఒకటని ఆయన అన్నారు. కేవలం ఉత్పాదన, వాణిజ్య సంస్థల విషయంలోనే కాక, భాషాభివృద్ధి విషయంలో కూడా మనం స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని, స్వావలంబనతో కూడిన భారతదేశం అన్న కల అప్పుడు మాత్రమే సాకారమవుతుందని కేంద్రమంత్రి అన్నారు. భాషల విషయంలో స్వావలంబన సాధించని పక్షంలో అలాంటి స్వావలంబన అర్థరహితం కాగలదన్నారు.

  స్వదేశీ, స్వభాషా, స్వరాజ్ అనే మూడు పదాలు,..స్వాతంత్ర్య సముపార్జనకు ఎంతగానో దోహదపడ్డాయని, ఎంతో స్ఫూర్తిని రగిలించాయని, మన స్వరాజ్య ఉద్యమానికి మూడు బలమైన మూలస్తంభాలు ఇవేనని ఆయన అన్నారు. స్వదేశీ ఉత్పాదనలను ప్రోత్సహించేందుకే స్వావలంబన భారతదేశం పేరిట భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారన్నారు. ప్రత్యేకించి కొత్తతరం ప్రజలు, మన సొంత భాషలను ఎంతో బలోపేతం చేశారన్నారు. అత్యంత ఉన్నతమైన ప్రపంచ స్థాయి వేదికపై కూడా ప్రధానమంత్రి హిందీలో, తన సొంత భాషలో ప్రసంగించినపుడు మనం మాత్రం ఈ విషయంలో సంకోచపడటం అర్థరహితమన్నారు. గతంలో ఎవరైనా సరే అతను మాట్లాడేభాష ప్రాతిపదికగా, సదరు వ్యక్తి స్థాయిని అంచనా వేసేవారని అన్నారు. అయితే,.. చేసే పనిలో సామర్థ్యం ఆధారంగా ఎవరి వ్యక్తిత్వాన్ని అయినా అంచనా వేస్తారుగానీ, భాష ఆధారంగా కానేకాదని అమిత్ షా అన్నారు.

https://ci4.googleusercontent.com/proxy/eR6LJ15UNTBOGy7mg7jvk9WjxGpYUhw6v1Mfza9qqzVXT-1Zw83tYZtB-8jq_V7P-EvtUV8XPlEvyeZhR12eakS8JpIS0s_kPlCZaou22adXXxjh0RagLBsIXw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003M638.jpg తన సొంతభాషలో కంటే మెరుగ్గా ఏ వ్యక్తీ ఇతర భాష ద్వారా భావాన్ని వ్యక్తీకరించడం సాధ్యంకాదని, భాష ఎప్పుడూ అడ్డంకి కాబోదని మన యువతరానికి మన తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మన ఎంతో గర్వంగా, ఎలాంటి సంకోచం, సంశయం లేకుండా ఆచార వ్యవహారాల్లో సొంత భాషను వినియోగించాలని అన్నారు. మనం మన సొంత భాషను వదులుకోరాదన్న సూత్రాన్ని యువతరం గుర్తెరగాల్సిన తరుణం ఇదేనన్నారు. తమ పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలతో మాతృభాషలోనే మాట్లాడాలని, అలా కాని పక్షంలో పిల్లలు తమ సొంత మూలాలను పూర్తిగా కోల్పోతారన్నారు. భారతదేశపు ఔన్నత్యాన్ని, సంస్కృతిని గురించి మనకు ఏ విదేశీ భాషా సరిగా వివరించజాలదని అన్నారు. కేవలం మాతృభాష మాత్రమే చిన్నారులందరినీ తన మూలాలతో అనుసంధానిస్తుందని, సాంస్కృతిక పరమైన మూలాలను కోల్పోయిన వారెవరూ ఎప్పటికీ ప్రగతిని సాధించలేరని అమిత్ షా అన్నారు. భూగర్భం లోతుల్లో పటిష్టమైన మూలాలు కలిగిన వృక్షమే బలంగా ఎదగ గలుగుతుందని ఆయన అన్నారు. 

   జాతిపిత మహాత్మా గాంధీ సారథ్యంలో స్వాతంత్ర్య పోరాటం సాగినపుడు చాలా మంది నాయకులు స్థానిక భాష వినియోగానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారని అమిత్ షా చెప్పారు. భారతీయ భాషలను బలోపేతం చేయడానికి జాతిపితతో సహా, రాజేంద్రప్రసాద్, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, కె.ఎం. మున్షీ, వినోభా భావే తదితరుల ప్రముఖులంతా కృషి చేశారని కేంద్రమంత్రి చెప్పారు. మహాత్మా గాంధీ కూడా జాతీయ వాదాన్ని, అధికార భాషతో సమీకృతం చేశారని, మన సొంతభాషలు లేకుండా దేశంలో ప్రజా చైతన్యాన్ని అర్థం చేసుకోవడం సాధ్యంకాదంటూ ఆయన పేర్కొన్నారని మంత్రి చెప్పారు. అప్పట్లో (1920నుంచి,1947వరకూ) గాంధీజీ బోధించిన ఈ భావన ఇప్పటికీ మనకు అనుసరణీయమేనని అన్నారు. గాంధీ ఇందుకోసం స్వయంగా వార్తా పత్రికలను ప్రచురించారని, గుజరాత్ సాహిత్య పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి, సాహిత్య పరిషత్ అధ్యక్షుడయ్యారని, గుజరాత్ నిఘంటువును కూడా రూపొందించారని అమిత్ షా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే, స్వాతంత్ర్య సమరానికి నాయకత్వం వహించడంలో పూర్తిగా మునిగిపోయిన ఒక వ్యక్తికి కూడా సొంత మాతృభాషను బలోపేతం చేసుకునేంత వ్యవధి దొరికిందన్నది మనం గుర్తుంచుకోవాలన్నారు. అధికార భాష అయిన హిందీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యతను ఇది సూచిస్తోందని అన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/90wdnAU0Jb5JA9B8gFn8pMKp0yGijLSt78WfQTjvUFbKiHSH9ZCccxwocU8RVn0b5k9XtLC2vy3e3We5QBAfWFS4r0VNgUUKBzh2Fhd8B9ayVBHWV5CzlxZ-7Q=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004G8DJ.jpg

 

అధికార భాషా విభాగం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖలో చాలా కీలకమైనదని, అధికార భాషను రక్షించి, పోత్రహించి, ప్రజాదరణ కల్పించేందుకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు కేంద్రమంత్రి చెప్పారు. స్వరాజ్య ఉద్యమానికి అధికార భాష అందించిన సేవలు ఇతివృత్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. స్థానిక భాషకు, అధికార భాషకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా మన స్వాతంత్ర్య సమరం విజయవంతం కావడానికి మరో కారణమన్న వాస్తవం,.. మన యువతరం అప్పుడు మాత్రమే అర్థం చేసుకోగలరని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

  మన దేశం అనేక విభిన్న సంస్కృతుల కలయిక అని, అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దేశంలో ఉన్నాయని, ప్రతి రాష్ట్రానికీ గర్వకారణమన దగిన చరిత్ర, అవన్నీ విభిన్నమైన భాషల్లో నమోదై ఉన్నాయని ఆయన అన్నారు. స్థానిక భాషలో ఉన్న ప్రతి రాష్ట్ర చరిత్రను అధికార భాషలోకి తర్జుమా చేయాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాల చరిత్రను దేశంలోని ప్రజలంతా చదివేందుకు అప్పుడే వీలవుతుందని అన్నారు. స్వరాజ్యోద్యమం గురించి తెలుసుకునే హక్కు దేశంలోని ప్రతి చిన్నారికీ ఉందని అమిత్ షా అన్నారు. శివాజీ మహారాజు నేతృత్వంలో మహారాష్ట్రలో జరిగిన పోరాటం, లేదా గుజరాత్ లో జరిగిన పోరాటం.. ఇలాంటివన్నీ చిన్న పిల్లలు తెలుసుకోవలసిన అవసరం ఉందని, స్వరాజ్య ఉద్యమ చరిత్రకు అధికార భాషలోకి అనువాదం జరిగినపుడే స్వరాజ్యోద్యమం గురించి వారు తెలుసుకోవడానికి సాధ్యమవుతుందని అన్నారు. భారతీయ సంస్కృతి పూర్తిగా విరిసిన కమలం వంటిదని, అందులో ప్రతి కమలదళం, ఒక ప్రాంతీయ భాషను ప్రాతినిధ్యం వహిస్తుందని, సంపూర్ణ కమల పుష్పమే మన అధికార భాష అని గురు రవీంద్రనాథ్ టాగూర్ పేర్కొన్న మాటలను కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సృజనాత్మక భాషల్లో మన విభిన్నత్వాన్ని గురించి ఎంతో మనోహరంగా వర్ణించేందుకు ఆయన ప్రయత్నించారన్నారు. 1857నుంచి, 1947వరకూ జరిగిన మన స్వాతంత్య్ర ఉద్యమంలో జర్నలిజం ద్వారా భారతీయ భాషలు, అధికార భాష అభివృద్ధికోసం పలువురు ప్రముఖులు ఎన్నెన్నో సేవలందించారని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా గత వందేళ్లలో జరిగిన అనేక యుద్ధాల చరిత్ర స్థానిక భాషల్లో ఉందని, అలాంటి యుద్ధ చరిత్రలన్నింటినీ అధికార భాషలోకి అనువదించబోతున్నామని మంత్రి చెప్పారు.

https://ci3.googleusercontent.com/proxy/QPhH8aAM_crDiN6_2DipfuP-ae5enxoYiDmvvBMcD9sd-bIdChbwUT3LTrcUbuQKi8eFIY3j-W7SPJaIVUqjLV8wGXLMKpF5qkvLEzO4ViZL21J35UkRw2Algg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0053L8F.jpg   మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు మన స్థానిక భాష, అధికార భాష పెద్ద అడ్డంకి కావచ్చంటూ, పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తుంటారని, అయితే, మాతృభాషలో కంటే మెరుగ్గా మరో భాషలో భావాన్ని వ్యక్తీకరించడం ఏ మాత్రం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఏదైనా భావాన్ని ఎవరైనా తన సొంత భాషలో వ్యక్తీకరించినపుడే అది సరళంగా, అత్యంత సహజంగా ఉంటుందని అన్నారు.  నూతన విద్యా విద్యావిధానంలో స్థానిక భాషలకు, అధికార భాషకు ప్రాముఖ్యం ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని అమిత్ షా చెప్పారు. ఐదవ తరగతి వరకూ బోధన స్థానిక భాషలోను, మాతృభాషలోనూ జరిగేలా విద్యావిధానంలో తగిన ఏర్పాట్లు చేశారని ఆయన అన్నారు. పాఠశాల స్థాయి, ఉన్నత విద్యా స్థాయిలో భారతీయ భాషల అధ్యయాన్ని సమీకృతం చేసేందుకు నూతన విద్యా విధానంలో తగిన కృషి జరిగిందన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 కళాశాలల్లో,.. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాళీ వంటి ఐదు భాషలు మాధ్యమంగా, సాంకేతిక విజ్ఞాన కోర్సులను ప్రారంభించబోతున్నారని చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలల తరహాలోనే ఈ కోర్సులను బోధిస్తారన్నారు. భారతీయ అనువాద అధ్యయన సంస్థను ఏర్పాటు చేయడం, భారతీయ భాషల రక్షణ, అభివృద్ధి లక్ష్యంగా చర్యలు తీసుకోవడం తదితర అంశాలను నూతన విద్యా విధానంలో పొందుపరిచినట్టు మంత్రి చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ఇ-కోర్సులను కూడా రూపొందిస్తున్నారని, దీనితో ఆన్ లైన్ ద్వారా చదువుకునే చిన్నారులు కూడా తమ సొంత భాషలోను, అధికార భాషలోను చదువుకునేందుకు సాధ్యమవుతుందని కేంద్రమంత్రి చెప్పారు. నూతన విద్యా విధానంలో అనేక అంశాలను చేర్చడం ద్వారా ప్రధానమంత్రి మన భాషా ఉద్యమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్నారు.

  గతంలో విదేశాలకు వెళ్లిన మన నాయకులు, అక్కడ చేసే ప్రసంగాలను మన ప్రజలు చాలా అరుదుగా అర్థం చేసుకునేవారని మంత్రి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్.పేయి విదేశాల్లో హిందీ మాట్లాడటం ప్రారంభించారని, ఇక ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను పాల్గొనే అంతర్జాతీయ వేదిక ఏదైనా సరే,.. హిందీలో మాత్రమే ప్రసంగించడ తన ఆనవాయితీగా పెట్టుకున్నారని మంత్రి చెప్పారు. దీనితో దేశంలో అధికార భాష గట్టిగా స్థిరపడటానికి అవకాశం ఏర్పడిందని, పలువురు ప్రజల మనసుల్లో భాషపై ఉన్న సంకోచం కూడా మటు మాయమైందని అమిత్ షా అన్నారు. ఏదైనా మార్పు ఉన్నపుడు, అందుకు తగినట్టుగా ప్రజల మనసుల్లో భావాలను కూడా మార్చేందుకు కృషిచేయడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.

  కోవిడ్-19 మహమ్మారిపై భారతదేశం ఎంతో సామర్థ్యంతో పోరాడిందని, చాలా తక్కువ నష్టంతో  మహమ్మారి బారినుంచి మనదేశం బయటపడగలిగిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహణా సామర్థ్యమే ఇందుకు కారణమని అమిత్ షా అన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వాణిజ్య సంఘాలు, వైద్యులు తదితరరులతో ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపినందునే ఇది సాధ్యమైందని అన్నారు. ఇందుకు సంబంధించి దేశప్రజలనుద్దేశించి తాను మాట్లాడిన 35 సందర్భాల్లోనూ ప్రధానమంత్రి  అధికార భాషలోనే ప్రసంగించారన్నారు. దీనితో దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ తో పోరాటంలో ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి ప్రజలందరికీ వేగంగా తెలియడానికి, సమాచారం వ్యాప్తి కూడా వేగంగా జరగడానికి వీలైందని కేంద్రమంత్రి అన్నారు.

  కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, మన దేశం ఎంతో ప్రాచీనమైనదని, విభిన్నమైన సంస్కృతీ సంప్రదాయాల మేలు కలియక అని అన్నారు. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో అనేక భాషలు అభివృద్ధి చెందాయని, అయితే హిందీ భాషను మాత్రమే ఎక్కువ శాతంమంది మాట్లాడుతూ, అర్థం చేసుకోగలుగుతున్నారని కేంద్రమంత్రి చెప్పారు. ప్రాంతీయ భాషలు కూడా ఎంతో ముఖ్యమైనవని, ప్రాంతీయ భాషలకు సుసంపన్నమైన సాహిత్య నేపథ్యం ఉందని, అందుకే జాతి నిర్మాణంలో ప్రాంతీయ భాషలు కూడా గొప్ప పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. హిందీతో పాటుగా, ప్రాంతీయ భాషలకు కూడా మనం పూర్తి గౌరవం ఇచ్చి తీరాల్సిందేనని అన్నారు. హిందీ భాషాభివృద్ధి కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా, ఎంతో ప్రోత్సాహం అందించారని, వారు తీసుకున్న చర్యలు స్ఫూర్తిగానే, కార్యాలయ్యాల్లో హిందీ అమలుకు ఎంతో కసరత్తు జరిగిందన్నారు. ఇపుడు ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సభల్లో  హిందీలోనే ప్రసంగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధానమంత్రి, హోమ్ మంత్రి కలిగించిన స్ఫూర్తితోనే ఇదంతా సాధ్యమైందని కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా చెప్పారు.

 

*****


(Release ID: 1754968) Visitor Counter : 240