వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
మహమ్మారి అనంతర కాలంలో మామూలు పరిస్థితులు నెలకొల్పే ప్రయత్నాలలో ఆసియాన్ భాగస్వామ్య దేశాలకు భారతదేశం మద్దతు ఇస్తుందన్న - శ్రీమతి అనుప్రియ పటేల్
18 వ ఆసియాన్-భారత ఆర్థిక మంత్రుల (ఏ.ఈ.ఎం) సంప్రదింపులు జరిగాయి
ఆరోగ్యం, ఔషధ రంగం వంటి శక్తివంతమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆసియాన్ దేశాలను ఆహ్వానించిన - భారతదేశం
ఆసియాన్ - భారత ఆర్ధిక భాగస్వామ్యాన్ని మెరుగుపరచాలని సిఫార్సు చేసిన - ఆసియాన్ భారత వ్యాపార మండలి (ఏ.ఐ.బి.సి)
ఆసియాన్ భారత ట్రేడ్-ఇన్-గూడ్స్ ఒప్పందం (ఏ.ఐ.టి.ఐ.జి.ఏ) త్వరగా ప్రారంభించడం కోసం చర్చలు జరిగాయి
వాణిజ్య ఏర్పాట్లు ఇచ్చి పుచ్చుకునే విధంగా, పరస్పర ప్రయోజనకరంగా, భాగస్వాముల ఇద్దరి ఆకాంక్షలను సమతుల్యం చేసే విధంగా ఉండాలన్న - శ్రీమతి అనుప్రియ పటేల్
Posted On:
14 SEP 2021 4:59PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ మరియు బ్రూనై దారుస్సలాం ద్రవ్యం, ఆర్థిక వ్యవస్థ శాఖ మంత్రి గౌరవనీయులు డాటో డాక్టర్ అమిన్ లివ్ అబ్దుల్లా, 2021 సెప్టెంబర్, 14వ తేదీన దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన 18వ ఆసియాన్-భారత ఆర్థిక మంత్రుల సంప్రదింపుల సదస్సు కు సహ అధ్యక్షత వహించారు.
ఈ సమావేశానికి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం మొత్తం 10 ఆసియాన్ సభ్య దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరయ్యారు.
ప్రస్తుత మహమ్మారి పరిస్థితి ని ఈ సందర్భంగా మంత్రులు పరిశీలించారు. మహమ్మారి వల్ల సంభవించిన ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంతో పాటు, ఈ ప్రాంతంలో స్థితిస్థాపక సరఫరా వ్యవస్థ కు భరోసా ఇవ్వడంలో సమిష్టి చర్యలు తీసుకోవడానికి తమ నిబద్ధతను వారు పునరుద్ఘాటించారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆసియాన్ తో పాటు, భారతదేశం మరియు వాణిజ్య భాగస్వామ్య దేశాల పరస్పర మద్దతు మధ్య లోతైన వాణిజ్యం, పెట్టుబడులను మంత్రులు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆసియాన్ సభ్య దేశాలలో 7వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అతిపెద్ద వనరులలో ఒకటిగా భారతదేశం ఉంది.
సామూహికంగా టీకాలు వేసే కార్యక్రమ నిర్వహణ, సామర్ధ్యాలను పెంపొందించుకోవడం తో పాటు, మహమ్మారి సవాళ్లను పరిష్కరించడానికి తగిన ఆర్థిక కార్యక్రమాల రూపకల్పనపై భారతదేశం యొక్క ప్రస్తుత దృష్టి గురించి కేంద్ర మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ సమావేశానికి వివరించారు. వ్యవసాయం, బ్యాంకింగ్, బీమా, సరకు రవాణా, కార్పొరేట్ చట్టాలు, పెట్టుబడి విధానం మొదలైన వివిధ రంగాలలో భారతదేశం చేపట్టిన విస్తృత సంస్కరణలను ఆమె ఈ సందర్భంగా ప్రముఖంగా వివరించారు. ఆరోగ్యం, ఔషధ రంగాలతో సహా శక్తి వంతమైన రంగాలలో భారత దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆమె ఆసియాన్ సభ్య దేశాలను ఆహ్వానించారు. ఆసియాన్ భారత ఆర్ధిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఆసియాన్ భారత వాణిజ్య మండలి (ఏ.ఐ.బి.సి) సూచించిన సిఫార్సులను కూడా మంత్రులు పరిగణలోకి తీసుకున్నారు.
ఆసియాన్ భారత ట్రేడ్-ఇన్-గూడ్స్-ఒప్పందం (ఏ.ఐ.టి.ఐ.జి.ఏ) త్వరగా ప్రారంభించే అంశాన్ని కూడా సమావేశం క్రియాశీలంగా చర్చించింది. సమీక్ష పరిధి, లక్ష్యాలపై ప్రస్తుత పరిస్థితి గురించి మంత్రులు చర్చించారు. సమకాలీన, క్రమబద్ధీకరించిన పన్నులు మరియు నియంత్రణ విధానాలతో ఒప్పంద వాణిజ్యాన్ని సులభతరం చేయడానికీ, వినియోగదారునికి స్నేహపూర్వక వాతావరణం సమకూర్చడానికీ అవసరమైన ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వారు నిర్ణయించారు. వాణిజ్య ఏర్పాట్లు ఇచ్చి పుచ్చుకునే విధంగా, పరస్పర ప్రయోజనకరంగా, భాగస్వాముల ఇద్దరి ఆకాంక్షలను సమతుల్యం చేసే విధంగా ఉండాలనే విషయం గురించి శ్రీమతి అనుప్రియ పటేల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రాధాన్యతనిచ్చే విషయమై దుర్వినియోగాన్ని నిరోధించడానికి, ఎఫ్.టి.ఏ. నిబంధనలను భద్రపరచవలసిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. ఆసియాన్ మార్కెట్ ను ముఖ్యంగా వ్యవసాయం , ఆటో రంగాల్లో అందుబాటులోకి తీసుకురావడంలో భారతీయ ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సుంకం లేని విధానాల గురించి కూడా ఆమె ఈ సందర్భంగా ప్రముఖంగా వివరించారు. 2021 అక్టోబర్ లో నిర్వహించ తలపెట్టిన ఆసియాన్ భారత నాయకుల సదస్సు కు సమర్పించే నివేదికను ఖరారు చేయడానికి, ఈ సంవత్సరం ముగిసేలోపు సమీక్షను ప్రకటించడానికి, ఇరుపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాలని శ్రీమతి పటేల్ సూచించారు. ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఆసియాన్ సేవలు, పెట్టుబడి ఒప్పందాల సమీక్ష కోసం సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆసియాన్ బృందాన్ని కేంద్ర మంత్రి అభ్యర్థించారు.
ఆసియాన్ తో తన ఆర్థిక భాగస్వామ్యానికి భారతదేశం అందించిన ప్రాముఖ్యతతో పాటు, భాగస్వాముల మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక సంబంధాల గురించి, కేంద్ర మంత్రి శ్రీమతి పటేల్ నొక్కి చెప్పారు. అదేవిధంగా, మహమ్మారి అనంతర కాలంలో దాని పునరుద్ధరణ ప్రయత్నాలలో ఆసియన్ కు భారతదేశం మద్దతు ఇస్తుందని కూడా ఆమె హామీ ఇచ్చారు.
*****
(Release ID: 1754902)
Visitor Counter : 203