ప్రధాన మంత్రి కార్యాలయం
అలీగఢ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ కి సెప్టెంబర్ 14నశంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
ప్రధానమంత్రి ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగడ్ నోడ్ మరియు రాజామహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్శిటీ ల నమూనా ల ప్రదర్శన ను కూడా సందర్శిస్తారు
Posted On:
13 SEP 2021 11:20AM by PIB Hyderabad
రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 14న మధ్యాహ్నం 12 గంటల కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం కూడా ఉంటుంది. ప్రధాన మంత్రి ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్, రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి ల నమూనాల ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శిస్తారు.
రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి ని గురించి:
స్వాతంత్య్ర సమరం లో మహా యోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ గారి స్మృతి లో ఈ యూనివర్సిటి ని ఆయన గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. ఈ విశ్వవిద్యాలయాన్ని అలీగఢ్ లోని కోల్ తహసీల్ పరిధి లో గల లోధా మరియు మూసెపుర్ కరీమ్ జరౌలీ గ్రామాల కు చెందిన 92 ఎకరాల కు పైగా ప్రాంతం లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలీగఢ్ డివిజన్ లోని 395 కళాశాల లు దీని కి అనుబంధం గా ఉంటాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ గురించి
ఉత్తర్ ప్రదేశ్ లో ఒక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ను స్థాపించడం జరుగుతుంది అని 2018, ఫిబ్రవరి 21న లఖ్‌నవూ లో నిర్వహించిన యుపి ఇన్వెస్టర్స్ సమిట్ ను ప్రధాన మంత్రి ప్రారంభించిన సందర్భం లో ప్రకటించడఃమైంది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లో మొత్తం 6 నోడ్ లను స్థాపించాలని పథక రచన చేశారు. ఆ ఆరు నోడ్ లు ఏవేవి అంటే.. అలీగఢ్, ఆగ్ రా, కాన్ పుర్, చిత్రకూట్, ఝాంసీ, ఇంకా లఖ్‌నవూ. అలీగఢ్ నోడ్ పరిధి లో భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది. ఈ నోడ్ లో 19 సంస్థల కు భూమి ని కేటాయించడమైంది. ఆ సంస్థ లు 1245 కోట్ల రూపాయల ను పెట్టుబడి పెడతాయి.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల రక్షణ సంబంధి ఉత్పత్తుల రంగం లో దేశాన్ని స్వావలంబన యుతం గా తీర్చిదిద్దడం లో, ‘మేక్ ఇన్ ఇండియా’ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం లో తోడ్పాటు లభించనుంది.
ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాలుపంచుకోనున్నారు.
***
(Release ID: 1754443)
Visitor Counter : 218
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam