ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కర్ణాటక జిల్లాలలో ఇంటర్నెట్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
Posted On:
08 SEP 2021 11:27AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మైటీ) శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల కర్ణాటకలోని 6 జిల్లాలలో జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా జిల్లాల
వారి నుంచి స్థానికంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ వేగం తక్కువగా ఉండడం, యాక్సెస్‌ను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని పలు అభ్యర్థనలు అందాయి. దీనికి స్పందించిన మంత్రి ప్రభావిత ప్రాంతాలతో పాటుగా ప్రతి జిల్లాలోనూ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ అధ్యయనానికి సంబంధించి మంత్రిత్వ శాఖ నుంచి టాస్క్ఫోర్స్ పంపబడుతుందని హామీ ఇచ్చారు. టాస్క్‌ఫోర్స్ బృందం వారు ప్రతి జిల్లాలో పర్యటించి ప్రజలను కలిసి వారి ఇంటర్‌నెట్ సమస్యల గురించి తెలుసుకుంటారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా వారు కలిసి వివరాలు తెలుసుకొని కేంద్ర మంత్రికి నివేదిక సమర్పిస్తారు. భారతీయులందరినీ అనుసంధానం చేయడం మరియు డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రయోజనాలను నేరుగా ప్రతి భారతీయుడికి చేరేలా చూడడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధాన ప్రాధాన్యాలలో ఒకటి.
***
(Release ID: 1753256)
Visitor Counter : 223