ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
డబ్ల్యుహెచ్ ఒ సీరోలో భారత్
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు అవకాశాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) సీరో మినిస్టీరియల్ రౌండ్ టేబుల్‌లో చర్చించిన డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్
వికేంద్రీకృత ,అలాగే ఏకోన్ముఖ, మొత్తంగా ప్రభుత్వం అన్న విధానం ద్వారామేం కోవిడ్ ప్రత్యేక మౌలిక సదుపాయాలను సత్వరం కల్పించడంపై దృష్టిపెట్టాం, ఆరోగ్య సిబ్బంది నైపుణ్యాలు పెంచడంపై దృష్టిపెట్టాం.”
Posted On:
07 SEP 2021 3:36PM by PIB Hyderabad
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ) ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయం (డబ్ల్యు.హెచ్.ఓ-సీరో) సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆగ్నేయాసియాకు సంబంధించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కమిటీ 74 వ సెషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియా తరఫున జోక్యం చేసుకుంటూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు.
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను సాధించేందుకు కోవిడ్ అనంతర సంరక్షణకు తీసుకున్న తగిన వ్యూహాలు, చర్యలను ఆమె ఈ సమావేశంలో ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి నిరంతర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఆరోగ్య వ్యవస్థలను పటిష్టం చేసి భవిష్యత్తుకు సిద్ధం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
కోవిడ్ -19 మహమ్మార జీవితంలోని ప్రతి పార్శ్వాన్ని ప్రభావితం చేసిందని అంటూ ఆమె ప్రాణనష్టం జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మొదీ గారి మార్గదర్శకత్వంలో దేశం సానుకూల, ముందస్తు, ప్రభుత్వ మొత్తం సన్నద్ధతతో, సమాజం మొత్తం ఒక్కటిగా, ప్రజాకేంద్రిత విధానంతో కోవిడ్ మహమ్మారిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
మన సన్నద్ధత, తక్షణ స్పందన వ్యవస్థలు ప్రజారోగ్య సంరక్షణలో ఏర్పడే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోనేందుకు గల గత అనుభవాలను , ప్రస్తుత శాస్త్రీ య విజ్ఞానాన్ని మేళవించ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వ్యాధి స్వభావాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ప్రజారోగ్య చర్యలు చేపట్టడం జరిగింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఇండియా వ్యూహం ఐదు ప్రధాన స్థంభాలపై ఆధారపడినది. అవి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, కేసులను గుర్తించడం, గుర్తించిన కేసులకు తగిన చికిత్స అందించడం, వాక్సిన్ వేయించడం, కోవిడ్ అనుకూల ప్రవర్తన వంటివి. వికేంద్రీకృత అలాగే ఏకోన్ముఖ, మొత్తంగా ప్రభుత్వం విధానం అనుసరించడం ద్వారా కోవిడ్ మహ మ్మారిని ఎదుర్కోవడం జరిగింది. మేం కోవిడ్ ప్రత్యేక మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్య సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంపై సత్వరం దృష్టిపెట్టాం అని ఆమె తెలిపారు.
భారతదేశ సమర్ధ నాయకత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలు, వ్యాధి వ్యాప్తికి కారణమైన ఎంట్రీ పాయింట్ల వద్ద నిఘా పెంపు తదితరాలవల్ల కోవిడ్ -19 వ్యాప్తి తగ్గింది. ఇది దేశ ప్రజాఆరోగ్య సామర్ధ్యాలు, మౌలిక సదుపాయాలను సమర్ధంగా నిర్వహించడానికి వీలు కల్పించింది. ఉన్నతస్థాయిలో వివిధ మంత్రిత్వశాఖ లమధ్య సమన్వయ బృందాలను ఏర్పాటు చేయడం, వివిధ రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఇతర భాగస్వాములు, ప్రజలతో నిరంతర సంబంధాల వల్ల కోవిడ్ మహమ్మారి అదుపు చేయడానికి వీలు పడింది.
చట్ట, విధానపరమైన చర్యలైన ఎపిడమిక్ డిసీజెస్ (సవరణ) చట్టం, 2020, విపత్తు నిర్వహణ చట్టం 2005 ఇప్పటికే కేంద్ర, సబ్ నేషనల్ పరిధులకు అదుబాటులో ఉంది. ఇవి కోవిడ్ విపత్తు ను ఎదుర్కోవడంలో యాయా కార్యకలాపాల నిర్వహణకు , వివిధ ప్రభుత్వవిభాగాల బాధ్యతలు, వాటి స్ఫష్టమైన పాత్రకు సంబంధించి తగిన నిర్దేశాలకు ఉపయోగపడ్డాయి. దీనికి తోడు వ్యాధి వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం అందజేసిన సాంకేతిక సహకారం, చికిత్సా ప్రొటోకాల్‌లు, అన్ని విధాలుగా ఏకోన్ముఖంగా కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఉపకరించాయి.
భారత ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిక సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా దాని వ్యాప్తిని కనిపెట్టడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులు, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను గమనిస్తూ వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యాధి తీరుతెన్నులను జాగ్రత్తగా గమనించి చర్యలు తీసుకోవడం జరిగింది.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన కీలక సామర్థ్యాలైన లేబరెటరీలు, ఆస్పత్రులకు సంబంధించి మౌలిక సదుపాయాలు, పరిశోధన, అభివృద్ధి, చికిత్సలు, వాక్సిన్‌లు, అవసరమైన పరికరాలు, మానవ వనరుల నైపుణ్యాల అభివృద్ధి, దేశీయంగా సామర్ధ్యాలను నిర్మించుకోవడం, రక్షణ కవచాలు తగినంతగా అందుబాటులో ఉంచుకోవడం , డయాగ్నస్టిక్ కేంద్రాలు, వెంటిలేటర్లు, వాక్సిన్ తయారీ సామర్ద్యం పెంపు, వంటి వాటివిషయంలో చర్యలుతీసుకోవడం జరిగింది. అలాగే, డిజిటల్ ఆవిష్కరణలైన ఐసిఎంఆర్ టెస్టింగ్ పోర్టల్ ఆధారిత పర్యవేక్షణ,ఆరోగ్య సేతు వంటి ఐటి అప్లికేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్, కోవిన్ పర్యవేక్షణలో వాక్సినేషన్, టెలిమెడిసిన్, ఈ -ఐసియు , కోవిడ్, నాన్ కోవిడ్ పేషెంట్లకు మెరుగైన చికిత్సకు చర్యలు చేపట్టడం జరిగింది.
కోవిడ్ మహమ్మారి వల్ల జరిగిన మానవ నష్టంగురించి మాట్లాడుతూ ఆమె ,కోవిడ్ -19 ప్రభావం పేదలు, సమాజంలోని నిరుపేదలపై ఎక్కువగా ఉంది. ఎన్నో సామాజిక భద్రతా చర్యలు వారిని ఆదుకునేందుకుతీసుకోవడం జరిగింది అని ఆమె చెప్పారు. ఆహార ధాన్యాలు అందజేయడం, కనీస ఆదాయ పధకాల మద్దతు, చిన్న పరిశ్రమలకు మద్దతు, కోవిడ్ -19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు మద్దతు, ఇతర ఆర్ధిక చర్యలు చేపట్టడం ద్వారా కోవిడ్ -19 ప్రభావాన్న తగ్గించేందుకు ప్రయత్నం చేసినట్టు తెలిపారు.
ఇండియా పెద్ద ఎత్తున వాక్సిన్‌ను అభివృద్ధి చేయడం, పంపిణీ గురించి ప్రస్తావిస్తూ ఆమె, ఇండియా వాక్సినేషన్ విధానం మౌలిక స్వరూపం గురించి వివరించారు. వాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాధాన్యతా వర్గాలకు ప్రాధాన్యతనివ్వడం, ఇతర దేశాలనుంచి వాక్సిన్ పొందేందుకు చర్యలు తీసుకోవడం, రెండో డోస్ వేయడానికి వాక్సిన్ వేయించుకున్న వారని పరిశీలించచడం, వారికి అవసరమైన డిజిటల్ వాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అందజేయడం వంటి చర్యలు తీసుకున్నట్టు ఆమె తెలిపారు.
కోవిడ్ వాక్సినేషన్ కు సంబంధించి వాక్సిన్ ప్రయోగాల విషయంలో దేశ నిపుణుల గ్రూప్ తగిన సలహాలు ఇస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా వాక్సిన్ సమానంగా పంపిణీ, ప్రోక్యూర్‌మెంట్, ఫైనాన్సింగ్, పంపిణీ యంత్రాంగం, ఆయా వర్గాలకు ప్రాధాన్యత నివ్వడం, వంటి వాటిని ప్రస్తావించడం జరిగింది. వాక్సిన్ అభివృద్ధి కి సంబంధించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ ఈ రంగంలో పరిశోధనకు మద్దతు నిస్తుంది. అలాగే ఔషధాల అభివృద్ధి, చికిత్స, కరోనా వైరస్‌కు వాక్సిన్ వంటి వాటిని పరిశీలిస్తుంది. లక్షిత వర్గాలకు దశలవారీగా వాక్సిన్ వేయడం వంటి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఇండియా ఇప్పటికే 680 మిలియన్ల మందికి వాక్సిన్ వేసినట్టు ఆమె తెలిపారు.
ఇండియా ప్రస్తుతం తన వద్ద ఉన్న సార్వత్రిక ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంది. అలాగే వాక్సిన్, సిరంజ్‌లకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంది. అన్ని స్థాయిలలో సామర్ద్యాల పెంపునకు కృషి చేఇంది. రాష్ట్రస్థాయిలో 7వేలా 600 మందికి, జిల్లా స్థాయిలో 61 వేలా 500 మందికి శిక్షణ ఇవ్వడంతోపాటు 2 లక్షల మందికిపైగా వాక్సినేటర్లు, 3.9 లోల మందికి పైగా ఇతర వాక్సినేషన్ బృందాల సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు వాక్సిన్ తాయారీ దారులకు ప్రభుత్వం పెట్టిన ఆర్డర్లకు ముందస్తుచెల్లింపులు చేసి ఆర్ధికంగా మద్దతునిచ్చినట్టు తెలిపారు. ఉత్పత్తి పెంపునకు టెక్నాలజీ బదిలీపై దృస్టిపెట్టడంతోపాటు ఎట్ రిస్క్ తయారీకి అనుమతించడం జరిగింది. కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫారం ద్వారా పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌లకు వీలు కల్పించడం జరిగింది, కోవిడ్ -19 వాక్సినేషన్‌కు సంబంధించి ప్రతి లబ్ధిదారుడిని గుర్తించడానికి వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు వాక్సినేషన్‌కు సంబంధించి తాజా సమాచారం తెలుసుకోవడానికి వీలు కలుగుతోందని చెప్పారు. వాక్సిన్ స్టోరేజ్‌కు చర్యలతోపాటు లబ్ధిదారులకు డిజిటల్ సర్టిఫికేట్ జారీచేస్తున్నట్టు తెలిపారు.
ఇండియా కోవిడ్ వ-19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని గమనించి చూసినపుడు, దేశం ఎంత ప్రణాళికా బద్ధంగా పకడ్బందీగా అన్ని వర్గాల భాగస్వాములను కలుపుకునిపోతూ సమర్థ కమ్యూనికేషన్‌ద్వారా పకడ్బందీగా వాక్సిన్ సరఫరా ను చేపట్టిందో తెలుస్తుందన్నారు.అలాగే సాంకేతికత, దాని పటిష్ట అమలుతో దేశంలో భారీ ఎత్తున వాక్సిన్ కార్యక్రమాన్ని సమర్ధంగా చేపట్టడానికి వీలు కలుగుతున్నదని ఆమె అన్నారు.
***
(Release ID: 1753121)
Visitor Counter : 265