రక్షణ మంత్రిత్వ శాఖ
ఆకాశంలో ప్రయోగించగల మానవ రహిత ఏరియల్ వాహనం నిర్మాణం కోసం ఒప్పందంపై సంతకాలు చేసిన భారత్, యుఎస్
Posted On:
03 SEP 2021 12:41PM by PIB Hyderabad
కీలకాంశాలుః
రక్షణ సాంకేతిక & వాణిజ్య చొరవలో భాగంగా ప్రాజెక్టు ఒప్పందంపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ, యుఎస్ రక్షణ శాఖ
భారత్, యుఎస్‌ల మధ్య లోతైన రక్షణ సాంకేతిక సహకారం దిశగా కీలక అడుగు
ఎఎల్‌యుఎవి (సాధారణ పరిభాషలో డ్రోన్ అనే వాహనం) నమూనాను కలిసి అభివృద్ధి చేస వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, ప్రదర్శన, పరీక్ష, అంచనాల కోసం భారతీయ వైమానిక దళం & డిఆర్‌డిఒ మధ్య సహకారాన్ని వివరిస్తుంది.
రక్షణ సాంకేతిక, వాణిజ్య చొరవ లోని ఎయిర్ సిస్టమ్స్‌పై వర్కింగ్ గ్రూపు కింద ఆకాశంలోకి ప్రయోగించే మానవరహిత ఏరియల్ వాహనం (ఎఎల్‌యుఎవి) కోసం రక్షణ శాఖ, యుఎస్ రక్షణ శాఖ ప్రాజెక్టు ఒప్పందంపై జులై 30,2021న సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం తొలుత జనవరి 2006లో రక్షణ శాఖ, యుఎస్ రక్షణ శాఖ మధ్య పరిశోధన, అభివృద్ధి, ప్రయోగం, అంచనా (ఆర్‌డిటి &ఇ) పై సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందం పరిధిలోనిది. ఈ ఒప్పందాన్ని జనవరి 2015న పునరుద్ధరించారు. రక్షణ పరికరాలను కలిసి అభివృద్ధి చేయడం ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ సాంకేతిక సహకారం మరింత గాఢమయ్యే దిశగా ఈ ఒప్పందం కీలక అడుగు.
భారత్, యుఎస్ సైనిక దళాల కోసం భవిష్యత్ సాంకేతికతలను సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి అవకాశాలను సృష్టించడం, ఇరుదేశాల మధ్య సహకార సాంకేతికతను ప్రోత్సహించడం పై నాయకత్వ దృష్టి నిరంతరం ఉంచేలా చేయడం డిటిటిఐ ప్రధాన లక్ష్యం. డిటిటిఐ కింద, భూమి, నావికా, వైమానిక, విమాన వాహన నౌకల సాంకేతికతలపై సంయుక్త వర్కింగ్ గ్రూపులు ఏర్పాటు అయ్యాయి. ఆయా విభాగాలలో పరస్పరం అంగీకరించిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టేందుకు ఈ గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎఎల్‌యుఎవి సహ అభివృద్ధి కోసం చేసుకున్న ఆమోదిత ప్రాజెక్టును ఎయిర్ సిస్టంస్ పై సంయుక్త వర్కింగ్ గ్రూపు పర్యవేక్షించింది. ఇది డిటిటిఐ ప్రధాన విజయం.
ఎఎల్‌యుఎవి (సాధారణ పరిభాషలో డ్రోన్ అనే వాహనం) నమూనాను కలిసి అభివృద్ధి చేస వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, ప్రదర్శన, పరీక్ష, అంచనాల కోసం ఎయిర్‌ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ, భారతీయ వైమానిక దళం & డిఆర్‌డిఒ మధ్య సహకారాన్ని ఆమోదిత ప్రాజెక్టు వివరిస్తుంది. ఆమోదిత ప్రాజెక్టు అమలుకు భారత, యుఎస్ వైమానిక దళాలతో కలిసి డిఆర్‌డిఒలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ (ఎఎఫ్ఆర్ ఎల్) ఎయిరోస్పేస్ సిస్టంస్ డైరొక్టరేట్ ప్రధాన సంస్థలుగా ఉంటాయి.
డిటిటిఐ కింద ఎయిర్ సిస్టంస్ సంయుక్త వర్కింగ్ గ్రూప్ సహ అధ్యక్షులు - భారతీయ వైమానిక దళానికి చెందిన ఎయిర్ వైస్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ, యుఎస్ వైమానిక దళం డైరెక్టర్, ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ అసిస్టెన్స్ అండ్ డైరెక్టొరేట్ బ్రిగేడియర్ జనరల్ బ్రియాన్ ఆర్, బ్రక్‌బ్యూర్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
***
(Release ID: 1751709)
Visitor Counter : 317