జల శక్తి మంత్రిత్వ శాఖ

100 రోజుల ‘సుజలాం’ ప్రచార కార్యక్రమం ప్రారంభం


గ్రామ స్థాయిలో వ్యర్థ జలాల నిర్వహణ ద్వారా మరిన్ని ఆరుబయట మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ గ్రామాలను తయారు చేయడానికే ప్రచారం

ఓడీఎఫ్ ఫలాలు సుస్థిరంగా ఉండేలా చూడటానికి పదిలక్షల మురుగునీటి శుద్ధీకరణ గుంతలను నిర్మించడానికే 'సుజలాం' ప్రచారం చేపట్టారు.

‘సుజలాం’ ప్రచార కార్యక్రమం..దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ స్థితిని వేగవంతమైన పద్ధతిలో సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Posted On: 25 AUG 2021 4:20PM by PIB Hyderabad

జల శక్తి మంత్రిత్వ శాఖ 'సుజలాం' అనే '100 రోజుల ప్రచార' కార్యక్రమాన్ని ప్రారంభించింది, 'ఆజాది కా అమృత్ మహోత్సవం' వేడుకల్లో భాగంగా గ్రామ స్థాయిలో వ్యర్థ నీటి నిర్వహణను చేపట్టడం ద్వారా, ముఖ్యంగా పది లక్షల సోక్‌ గుంతలను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా మరిన్ని ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలను సృష్టించడం ఈ కార్యక్రమ లక్ష్యం. మురుగునీటి శుద్ధీకరణ -గుంతలను పెంచడమేగాక, మురుగునీటి శుద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలకు ఓడీఎఫ్ ప్లస్ హోదాను తక్కువ సమయంలో వేగవంతమైన రీతిలో సాధించే దిశగా ప్రచారం ప్రయత్నం చేస్తారు. ఈ ప్రచారం ఈ రోజు అంటే 2021 ఆగస్టు 25న ప్రారంభమైంది.  తదుపరి 100 రోజుల పాటు కొనసాగుతుంది.

 

గ్రామాలను ఓడీఎఫ్లుగా మార్చడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడమే కాదు, గ్రామాల్లోని మురుగునీటి నిర్వహణ కోసం గుంతలను ఏర్పాటు చేస్తారు. జలాయశాల స్థిరమైన నిర్వహణకు కూడా ఈ కార్యక్రమం  సహాయపడుతుంది. గ్రామాల్లో లేదా గ్రామాల పొలిమేరలకు వ్యర్థ జలాలను పంపించడం, అవి ఒకేచోట నిల్వ కాకుండా అడ్డుకోవడం వంటి ఇతర పనులూ చేస్తారు. ఈ ప్రచారం మురుగునీటి నిర్వహణలోనూ సహాయపడుతుంది.   క్రమంగా జలాశయాలను పునరుద్ధరించడానికి వీలుకల్పిస్తుంది.

 

ఈ ప్రచారం సమాజ భాగస్వామ్యం ద్వారా ఎస్బీఎంజీ రెండో దశ కార్యకలాపాల వేగాన్ని పెంచుతుంది   ఇది ఓడీఎఫ్- ప్లస్ కార్యకలాపాల గురించి అవగాహన పెంచుతుంది. అందువల్ల దీర్ఘకాల నిర్వహణ సాధ్యపడుతుంది.  అంతర్నిర్మిత మౌలిక సదుపాయాలు సుస్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ప్రచార కార్యక్రమం ఎస్బీఎంజీ మొదటి దశలో సాధించిన అవగాహన,  పరివర్తన మార్పు వేదికను ఉపయోగిస్తుంది   ఎస్ఎల్డబ్ల్యూ మేనేజ్‌మెంట్ ద్వారా పరిశుభ్రత అంతటా కనిపించేలా చేయడంతోపాటు దానిని కొనసాగించడానికి సాయపడుతుంది.

 

ఈ ప్రచారం సందర్భంగా గ్రామాల్లో నిర్వహించే ముఖ్యమైన పనులు:

 

ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించడానికి సంఘం సంప్రదింపులు, ఖులీ బైఠక్‌లు,   గ్రామసభ సమావేశాలను నిర్వహించడం

ఓడీఎఫ్ స్థిరత్వాన్ని నిర్వహించడానికి, మురుగునీటి శుద్ధీకరణ కోసం అవసరమైనన్ని గుంతలను నిర్మించేలా తీర్మానాలు చేయడం.

 గుంతల నిర్మాణ సంబంధిత కార్యకలాపాల కోసం 100 రోజుల ప్రణాళికను అభివృద్ధి చేయడం. అవసరమైన సంఖ్యలో మురుగునీటి శుద్ధీకరణ గుంతలను నిర్మించడం.

ఐఈసీ సమూహాల సమీకరణ ద్వారా అవసరమైన చోట రిట్రోఫిట్ టాయిలెట్లను  నిర్మించడం

గ్రామంలో కొత్తగా ఏర్పడుతున్న అన్ని కుటుంబాలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడటం

 

***(Release ID: 1751692) Visitor Counter : 273