వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వ‌హించిన‌ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ


- కొబ్బరి ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింద‌న్న మంత్రి శ్రీ తోమర్

- ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి నాణ్యత ఉండ‌డం ఎగుమతులను పెంచుతుంది

Posted On: 02 SEP 2021 5:16PM by PIB Hyderabad

కొబ్బరి రంగంలో భారత దేశం గొప్ప పురోగతి సాధించిందని కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. కొబ్బ‌రి ఉత్పత్తి, ఉత్పాదకతల‌లో భారతదేశం ముందంజలో సాగి.. ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలుస్తోంద‌ని వివ‌రించారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వ‌హించింది.
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్ర‌సంగించారు. 2020-21లో భార‌తదేశ‌ కొబ్బరి ఉత్పత్తి 21207 మిలియన్ యూనిట్లుగా ఉంద‌ని మంత్రి తెలిపారు. మొత్తం ప్రపంచ కొబ్బ‌రి ఉత్పత్తిలో ఇది 34 శాతం. మ‌న దేశంలో కొబ్బ‌రి ఉత్పాదకత హెక్టారుకు 9687 యూనిట్లుగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమ‌ని తెలిపారు. కొబ్బరి కొత్త ఉత్పత్తులు సంబంధిత‌ పరిశ్రమలు పెరుగుతున్నాయ‌ని. ఫ‌లితంగా రైతులు త‌గిన ఉపాధి పొందుతున్నార‌ని అన్నారు. ఈ ఏడాది నిర్వ‌హిస్తున్న 23వ ప్రపంచ కొబ్బరి దినోత్సవ వేడుకలను "కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేప‌థ్యం.. ఆపైన‌ కూడానూ ఎంతో సురక్షితమైన, స‌మ్మిళిత స్థితిస్థాపక మరియు సుస్థిరమైన కొబ్బరి స‌మాజాన్ని నిర్మించడం" అనే ఇతివృత్తంతో నిర్వ‌హిస్తున్నారు. కొబ్బరి యొక్క ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకోవడానికి, కొబ్బరి రంగంపై జాతీయ మరియు అంతర్జాతీయ దృష్టిని కేంద్రీకరించేందుకు వీలుగా కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రతి సంవత్సరం కొబ్బరి దినోత్సవాన్ని నిర్వ‌హిస్తుంది.
ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై బ‌ల‌మైన ప్ర‌భావం..
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ కొబ్బరి మ‌న దేశ ఆర్థిక వ్యవస్థపై బలమైన ప్రభావాన్ని క‌లిగి ఉంద‌ని అన్నారు. కొబ్బరి రంగం యొక్క సంభావ్యతను రైతులు మరియు పారిశ్రామికవేత్తలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. రైతుల ప్రయత్నాలకు కేంద్రంలోని ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వ్యవసాయ బడ్జెట్‌ను కేంద్ర గణనీయంగా పెంచడంతో దేశంలో రైతులకు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (ఎంఎస్‌పీ) ప్రయోజనం లభిస్తుందని మంత్రి చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రధాన మంత్రి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటార‌ని మంత్రి శ్రీ తోమార్ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు నాణ్యత ప్రపంచ ప్రమాణాల మేర‌కు ఉండాల‌ని త‌ద్వారా ఎగుమతులు కూడా పెరుగుతాయని శ్రీ తోమర్ సూచించారు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే మాట్లాడుతూ "రైతులు చిన్న మరియు స‌న్న‌కారు వారు కావ‌డం వ‌ల్ల మన దేశీయ కొబ్బరి పరిశ్రమ యొక్క భవిష్యత్తు వ్యవసాయ స్థాయి కొబ్బరి ఉత్పత్తిని సమగ్రపరిచే మరియు సంవిధానం చేసే సామర్థ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంద‌ని తెలిపారు. మెరుగైన ఆదాయం, ఉత్పత్తి వైవిధ్యీకరణ మరియు వివిధ ఉప ఉత్పత్తుల యొక్క పారిశ్రామిక వినియోగాన్ని కనుగొనడం మరియు వాటి విలువను జోడించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది" అని అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టికోణం మేర‌కు కొబ్బరి పండించే వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రయోజనాలను కూడా అందిస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి అన్నారు. రైత‌న్న‌లకు ప్ర‌యోజ‌నం క‌ల్పించే దిశ‌గా కేంద్ర ప్రభుత్వం రైతులకు అంకితం చేయబడింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తోంది అందుకే వ్యవసాయ బడ్జెట్ కూడా గణనీయంగా పెరిగింది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు కూడా రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీవో) ద్వారా సౌకర్యాలు పొందుతారు. కార్య‌క్ర‌మంలో వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్ కూడా ప్రసంగించారు. కొబ్బరి డెవలప్‌మెంట్ బోర్డ్ సంయుక్త కార్య‌ద‌ర్శి, ఛైర్మన్ శ్రీ రాజ్‌బీర్ సింగ్, ఈ సంద‌ర్భంగా తన ప్ర‌జెంటేష‌న్‌ను అందించారు. మంత్రిత్వ శాఖ, బోర్డు యొక్క ఇతర సీనియర్ అధికారులు, వివిధ రాష్ట్ర ఉద్యాన మిషన్ల అధికారులు మరియు ప్రముఖ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా కొబ్బరిని పండించే రైతుల కోసం ఒక విష‌యాత్మ‌క‌మైన సాంకేతిక సెషన్ కూడా నిర్వహించారు.
                                 

*****



(Release ID: 1751568) Visitor Counter : 154