హోం మంత్రిత్వ శాఖ

ఆజాది కా అమృత్ మహోత్సవ్ సైకిల్ ర్యాలీని నిర్వహించనున్న సిఐఎస్‌ఎఫ్‌


ఎరవాడ జైలు నుండి రాజ్‌ఘాట్ వరకు సాగే ఈ సుదీర్ఘ సైకిల్ ర్యాలీని సెప్టెంబర్ 4 న ప్రారంభిస్తారు

పూణే నుండి ఢిల్లీ వరకు 27 రోజుల పాటు సాగే ఈ 1,703 కిలోమీటర్ల ర్యాలీ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేస్తుంది

Posted On: 02 SEP 2021 2:39PM by PIB Hyderabad

కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్‌) దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా 10 సైకిల్ ర్యాలీలను నిర్వహిస్తోంది. 10 ర్యాలీలలో పొడవైనది పుణేలోని చారిత్రక ఎరవాడ జైలు నుండి ప్రారంభమై ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద ముగుస్తుంది. 1,703 కిమీ పొడవైన మార్గంలో ర్యాలీ చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలు మరియు భారత స్వాతంత్ర్య పోరాట వీరుల జన్మస్థలాలను 27 రోజుల పాటు కవర్ చేస్తుంది.

ఈ ర్యాలీని  4 సెప్టెంబర్, 2021 శనివారం ఉదయం 8 గంటలకు పూణెలోని ఎరవాడ జైలు నుండి జెండా ఊపి ప్రారంభిస్తారు.  గాంధీ అవార్డ్‌కి వ్యతిరేకంగా నిరసన తెలిపినప్పుడు చారిత్రాత్మక పూనా చట్టంపై సంతకం చేసిన ప్రదేశం ఎర్వాడ జైలు.ఆయన  ఈ జైలులో మూడుసార్లు ఉంచబడ్డారు.

27 రోజుల ఈ ర్యాలీ జాతిపిత జయంతి అయిన అక్టోబర్ 2 న మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద ముగుస్తుంది. మన స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యసాహసాలు  మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గుర్తింపునకు నోచుకోని అనేకమంది వీరులు చేసిన త్యాగాలతో దేశంలోని యువతను దృష్టిలో పెట్టుకుని ర్యాలీని నిర్వహిస్తున్నారు.

12 మంది సిఐఎస్‌ఎఫ్‌ సైక్లిస్టుల బృందం ర్యాలీలో పాల్గొంటుంది. దీనికి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ నాయకత్వం వహిస్తారు. సిఐఎస్‌ఎఫ్‌ నుండి సీనియర్ అధికారులు మరియు ఇతర ప్రముఖులు సైకిల్ ర్యాలీని ప్రారంభిస్తారు. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీని నిర్బంధంలో ఉంచిన అఘాఖాన్ ప్యాలెస్‌కు ర్యాలీ వెళ్తుంది. ఆగష్టు 8, 1942 న క్విట్ ఇండియాకు పిలుపునిచ్చిన తర్వాత గాంధీజీ 21 నెలలు నివసించిన ప్రదేశం ఇది. ఈ కాలంలో మహాత్ముడు తన భార్య కస్తూర్బా మరియు అతని కార్యదర్శి నారాయణ్ దేశాయ్‌ని కోల్పోయారు. వారిద్దరి సమాధులు పుణెలోని గ్రాండ్ ప్యాలస్‌లో ఉన్నాయి. దీనిని ప్రముఖ వాస్తుశిల్పి చార్లెస్ కొరియా నిర్మించారు.

ఎరవాడ జైలు మరియు అఘ ఖాన్ ప్యాలెస్‌లో రెండు వేర్వేరు కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి గమ్యస్థానమైన రాజ్‌ గురునగర్‌ వెళ్లేముందు ర్యాలీ ఉదయం 10 గంటలకు అఘా ఖాన్ ప్యాలెస్‌కు చేరుకుంటుంది.  సైకిల్ ర్యాలీ రాజ్‌గురునగర్, సంతవాడి, సంగమ్నర్, నాసిక్ లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్, చంద్వాడ్, ఆర్వీ టౌన్ మరియు మహారాష్ట్రలోని షిర్పూర్ ఫటా గుండా వెళుతుంది.

15 వ రోజు సైకిల్ ర్యాలీ భోపాల్ చేరుకుంటుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ ధీరాజ్ కుమార్ జానైస్ నేతృత్వంలోని సైక్లిస్టుల బృందం 24 వ రోజు మధ్యప్రదేశ్‌లోని ధోల్పూర్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చేరుకుంటుంది.

ర్యాలీలో చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశాలలో రాజగురునగర్ (స్వాతంత్ర్య సమరయోధుడు రాజగురు జన్మస్థలం), మధ్య ప్రదేశ్‌లోని భవ్రా (చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం) మరియు శివపురి (తాత్యా తోపే మరణ స్థలం) ఉన్నాయి.

కొవిడ్‌ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.

సిఐఎస్‌ఎఫ్‌ అనేది యూనియన్ ఆఫ్ ఇండియా యొక్క సాయుధ శక్తి. ఇది జాతీయ స్మారక కట్టడాల యొక్క ముఖ్యమైన సంస్థాపనలను రక్షిస్తుంది.



 

***



(Release ID: 1751563) Visitor Counter : 169