ఆయుష్
దేశంలో 75,000 హెక్టార్లలో ఔషధ మొక్కల సాగు
జాతీయ ఔషధ మొక్కల బోర్డు పర్యవేక్షణలో అమలు చేయనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో 7500, ఉత్తరప్రదేశ్ లో 750 ఔషధ మొక్కలు రైతులకు పంపిణీ
Posted On:
02 SEP 2021 1:00PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశంలో ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న జాతీయ ఔషధ మొక్కల బోర్డు జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతుల ఆదాయాన్ని ఎక్కువ చేసి హరిత భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏడాది కాలంలో 75,000 హెక్టార్ల భూమి లో ఔషధ మొక్కలను సాగు సహాయడానికి జాతీయ ఔషధ మొక్కల బోర్డు చర్యలను తీసుకుంటుంది. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్, మహారాష్ట్ర లోని పుణేలో ప్రారంభం అయ్యింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' కింద నిర్వహిస్తున్న కార్యక్రమాల శ్రేణిలో ఈ కార్యక్రమం రెండవది.
పూణేలో ఔషధ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. ఇప్పటికే ఔషధ మొక్కలను పండిస్తున్న వారిని సన్మానించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని పార్నర్ ఎమ్మెల్యే నీలేష్ లంకే, యునాని మెడిసిన్‌లో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అసిమ్ అలీ ఖాన్, జాతీయ ఔషధ మొక్కల బోర్డు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ చంద్ర శేఖర్ సన్వాల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ సన్వాల్ ఈ కార్యక్రమం దేశంలో ఔషధ మొక్కల సాగును ఎక్కువ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 75 మంది రైతులకు 7500 ఔషధ మొక్కలను అందజేశారు. 75000 మొక్కలను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
సహరాన్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ఆయుష్ సహాయ మంత్రి, శ్రీ ధరమ్ సింగ్ సైనీతో పాటు నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ రీసెర్చ్ ఆఫీసర్ సునీల్ దత్ మరియు ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఔషధ మొక్కలను పండిస్తున్న వారిని శ్రీ ధరమ్ సింగ్ సైనీ సన్మానించారు.150 మంది రైతులకు ఉచితంగా మొక్కలను అందించారు. రాత్రిపూట పుష్పించే మల్లె (పారిజాతం), గోల్డెన్ యాపిల్ (బెల్), మార్గోసా ట్రీ (వేప), ఇండియన్ జిన్సెంగ్ (అశ్వగంధ) మరియు ఇండియన్ బ్లాక్‌బెర్రీ (జామ) జాతి మొక్కలను అందించారు. 750 జామ మొక్కలను విడిగా రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు.
దేశంలో ఔషధ మొక్కల రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. 75000 హెక్టార్ల భూమిలో ఔషధ మొక్కల పెంపకం దేశంలో ఔషధాలను మరింత అనుదుబాటులోకి వస్తాయని అన్నారు. ఇది రైతులకు పెద్ద ఆదాయ వనరుగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం వల్ల ఔషధ రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత 1.5 సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఔషధ మొక్కల మార్కెట్ గణనీయంగా పెరిగింది. అశ్వగంధ అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన మూడవ ఉత్పత్తిగా గుర్తింపు పొందింది.
'ఆజాది కా అమృత్ మహోత్సవ్' లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో వై బ్రేక్ యాప్ను ప్రారంభించిన ఆయుష్ మంత్రిత్వ శాఖ రోగనిరోధక ఆయుష్ ఔషధాల పంపిణీ, 'మీ ద్వారా ఆయుష్' తో పాటు పాఠశాల , కళాశాల విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. వై బ్రేక్ యాప్ కార్యక్రమంలో భాగంగాసెప్టెంబర్ 5 న ఉపన్యాసాలు, వెబ్‌నార్ నిర్వహించబడతాయి.
***
(Release ID: 1751431)
Visitor Counter : 279