రైల్వే మంత్రిత్వ శాఖ
ఇండియన్ రైల్వేస్భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ద్వారా చండీగఢ్ రైల్వేస్టేషన్కు 5స్టార్ ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ ప్రదానం చేసింది.
ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో ప్రమాణాలను పాటించిన రైల్వే స్టేషన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ ప్రదానం చేయబడుతుంది.
భారతదేశంలో ఈ సర్టిఫికేషన్ పొందిన ఐదవ రైల్వేస్టేషన్గా చండీగఢ్ రైల్వేస్టేషన్ నిలిచింది.
Posted On:
02 SEP 2021 1:22PM by PIB Hyderabad
భారతీయ రైల్వే చండీగఢ్ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు అత్యుత్తమ నాణ్యత, పుష్టికరమైన ఆహారాన్ని అందించినందుకు 5-స్టార్ 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్‌ను ప్రదానం చేసింది. ఈ ధ్రువీకరణ ప్రామాణిక ఆహార నిల్వ మరియు పరిశుభ్రత పద్ధతులకు కట్టుబడిన రైల్వే స్టేషన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా మంజూరు చేయబడింది. ప్రయాణికులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో ఉన్నత ప్రమాణాలు పాటించిన రైల్వే స్టేషన్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ద్వారా 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ ప్రదానం చేయబడుతుంది. 1 నుండి 5 రేటింగ్‌లతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎంపానెల్డ్ థర్డ్-పార్టీ ఆడిట్ ఏజెన్సీ ముగిసిన తర్వాత స్టేషన్‌కు సర్టిఫికేట్ అందించబడుతుంది. ప్రయాణికులకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందుబాటులో ఉండేలా స్టేషన్లలో చేపట్టే ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను ఈ 5స్టార్ రేటింగ్ సూచిస్తుంది.
'ఈట్ రైట్ ఇండియా' ఉద్యమంలో భాగంగా- భారతీయులందరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి, దేశ ఆహార వ్యవస్థను మార్చడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ చేస్తున్న ప్రయత్నాల్లో
భాగమే ఈ ధ్రువీకరణ. ఈట్ రైట్ ఇండియా అనేది నియంత్రణ, సామర్థ్యాల పెంపు, సహకార మరియు సాధికారత విధానాల న్యాయపరమైన కలబోత. ఇది మా ఆహారం ప్రజలకు, పర్యావరణానికి సరిపోయేలా ఉంటుందని సూచిస్తుంది.
భారతదేశంలో ఈ గుర్తింపు పొందిన ఐదవ స్టేషన్ చండీగఢ్ రైల్వే స్టేషన్. ఈ సర్టిఫికేషన్ ఉన్న ఇతర రైల్వే స్టేషన్లలో ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ (ఢిల్లీ), ఛత్రపతి శివాజీ టెర్మినస్; (ముంబై), ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్; (ముంబై) మరియు వడోదర రైల్వే స్టేషన్ ఉన్నాయి.
వినియోగదారులకు సురక్షితమైన, ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని పెంపొందించేలా మార్చడానికి భారతీయ రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్డీసీ) కి ఐదు రైల్వే స్టేషన్లలో సదుపాయాలను కల్పించాలని ఆదేశించబడింది. - ప్రయాణికులకు సురక్షిత, ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని కల్పించడానికి భారతదేశంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునరాభివృద్ధి, ఆపరేషన్ మరియు నిర్వహణకు అనుగుణమైన ప్రమాణాలను నిర్దేశించడానికి ఐఆర్ఎస్డీసీ ఏర్పాటుచేయబడింది.
ఐఆర్ఎస్డీసీ సదుపాయాల కల్పన, నిర్వహణలో భాగంగా రైల్వే స్టేషన్లలో 'వాటర్ ఫ్రమ్ ఎయిర్' అంటే.. వాటర్ వెండింగ్ మెషిన్, ఫిట్ ఇండియా స్క్వాట్ కియోస్క్, అత్యధిక రేటింగ్ కలిగిన ఈట్ రైట్ స్టేషన్, డిజిటల్ లాకర్, జనరిక్ మెడిసిన్ షాప్, మొబైల్ ఛార్జింగ్ కియోస్క్, రిటైల్ స్టోర్, ఫుడ్ ట్రక్తో సహా అనేక సదుపాయాలను మొదటిసారిగా కల్పించింది.
త్వరలో మరో 90 రైల్వే స్టేషన్లలో ఐఆర్ఎస్డీసీ ఈ సదుపాయాల కల్పన, నిర్వహణను దశలవారీగా చేపట్టనుంది.
***
(Release ID: 1751429)
Visitor Counter : 255