పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ నుంచి నడుస్తున్న జాతీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అదనంగా మరో రెండు సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్యఎం సింధియా ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ డాక్టర్ వీకే సింగ్ (రిటైర్డ్) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ ఖరోలా పాల్గొన్నారు.


గ్వాలియర్ - ఇండోర్ (మధ్యప్రదేశ్) - ఢిల్లీ మార్గంలో ఇండిగో సంస్థ నేరుగా నడపనున్న విమాన సర్వీసును ప్రారంభించిన మంత్రి ఇండోర్ (మధ్యప్రదేశ్) - దుబాయ్ (యుఎఇ) ల మధ్య ఎయిర్ ఇండియావిమాన సర్వీసును

Posted On: 01 SEP 2021 1:04PM by PIB Hyderabad

పునరుద్ధరించారు. 

వర్చువల్ విధానంలో భోపాల్ నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, మధ్యప్రదేశ్ మంత్రులు  శ్రీ ప్రధమాన్ సింగ్ తోమర్శ్రీ భరత్ సింగ్ కుష్వాహాలోక్ సభ సభ్యుడు శ్రీ వివేక్ నారాయణ షెజ్వాల్కర్గ్వాలియర్ ఈస్ట్ శాసనసభ సభ్యుడు డాక్టర్ సతీష్ సికర్వార్ వర్చువల్ విధానంలో  గ్వాలియర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జలవనరులుమత్స్య సంక్షేమం మరియు మత్స్య అభివృద్ధి మంత్రి శ్రీ తులసీరామ్ సిలావత్,  పర్యాటకసాంస్కృతికఆధ్యాత్మిక మంత్రి శ్రీమతి ఉషా ఠాకూర్లోక్ సభ సభ్యుడు  శ్రీ శంకర్ లల్వానిబిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కైలాష్ విజయవర్గీయశాసనసభ్యులు  శ్రీ రమేష్ మెండోలాశ్రీమతిమాలిని లక్ష్మణ్ సింగ్ గౌర్,  శ్రీ మహేంద్రహార్డియా,  శ్రీ ఆకాశవిజ్వర్గియాశ్రీ. సంజయ్ శుక్లా,  శ్రీ విశాల్ జగదీష్ పటేల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా  సీనియర్ అధికారులు  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా అందరికి విమాన సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఇండోర్ - గ్వాలియర్ - ఢిల్లీ మార్గంలో సర్వీసును ప్రారంభించామని అన్నారు. మధ్యప్రదేశ్ లోని రెండు నగరాలను విమాన సర్వీసులు  అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంతంలో వాణిజ్య పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. గత 53 రోజుల్లో మధ్యప్రదేశ్ నుంచి నడుస్తున్న విమానాల సంఖ్య 424 నుంచి 738కి పెరిగిందని వివరించిన మంత్రి ఇదే సమయంలో రాష్ట్రం నుంచి 58 నూతన సర్వీసులు ప్రారంభం అయ్యాయని అన్నారు. ఇంతవరకు ఇండోర్ నుంచి 8 నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్య 13కి పెరిగింది. అదేవిధంగా గ్వాలియర్ నుంచి ఇతర నగరాలకు నడుస్తున్న విమానాల సంఖ్య 4 నుంచి 6కి పెరిగింది.  

గ్వాలియర్ అందమైన కోటలుదేవాలయాలు,మ్యూజియం మరియు రాజభవనాలకు ప్రసిద్ధి చెందింది. పెరిగిన విమాన సెర్వీసులతో ఈ ప్రాంతంలో పర్యాటక  వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. 

ప్రస్తుతం ఎయిర్ ఇండియా భారతదేశంలోని వివిధ గమ్యస్థానాలకు భోపాల్ఇండోర్జబల్‌పూర్ మరియు బిలాస్‌పూర్ నుంచి  విమానాలను నడుపుతోంది. అంతర్జాతీయ మార్గంలో ఎయిర్ ఇండియా 2019 నుంచి  ఇండోర్ నుంచి  దుబాయ్‌కు నేరుగా విమానాన్ని నడుపుతోంది.  ఇది  నాన్-స్టాప్ కనెక్షన్‌గా తిరిగి ప్రారంభమవుతుంది.

 

విమాన షెడ్యూల్‌లు క్రింద పేర్కొనబడ్డాయి:

ఇండిగో గ్వాలియర్ - ఢిల్లీ - ఇండోర్

విమాన  నం.

 ఎక్కడ  నుండి

 ఎక్కడ  వరకు 

నడిచే రోజులు 

బయలుదేరే

సమయం 

చేరే  సమయం

విమానం

ప్రారంభ తేదీ  

6E 7356

ఢిల్లీ

గ్వాలియర్

ప్రతి రోజు 

7:10

8:10

ఎటీఆర్

1-సెప్టెంబర్ -21

6E 7358

గ్వాలియర్

ఇండోర్

ప్రతి రోజు

8:30

10:00

1-సెప్టెంబర్ -21

6E 7359

ఇండోర్

గ్వాలియర్

ప్రతి రోజు

10:20

12:00

1-సెప్టెంబర్ -21

6E 7357

గ్వాలియర్

ఢిల్లీ

ప్రతి రోజు

12:20

13:30

1-సెప్టెంబర్ -21

 

ఎయిర్ ఇండియా ఇండోర్ - దుబాయ్ విమాన షెడ్యూల్:

 

 

Flt నం.

ఎక్కడ  నుండి ఎక్కడ  వరకు  నడిచే రోజులు 

బయలుదేరే సమయం

చేరే సమయం

ప్రారంభ తేదీ 

AI0955

ఇండోర్

దుబాయ్

బుధవారం

12:35

15:05

1-సెప్టెంబర్ -21

AI0956

దుబాయ్

ఇండోర్

బుధవారం

16:05

20:55

1-సెప్టెంబర్ -21

 

***


(Release ID: 1751144) Visitor Counter : 185