యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టోక్యో పారాలింపిక్స్‌లో మరియప్పన్, శరద్, సింఘరాజ్‌లు పతకాల సంఖ్యను పదికి చేర్చారు
Posted On:
31 AUG 2021 6:52PM by PIB Hyderabad
ప్రధాన ఆంశాలు:
- పారాలింపిక్ క్రీడల్లో మరియప్పన్‌కు ఇది రెండవ పతకం; రియో 2016 లో అతను స్వర్ణం గెలిచారు
మంగళవారం టోక్యో పారాలింపిక్స్‌లో జరిగిన పురుషుల హై జంప్ టి63 ఫైనల్‌లో మరియప్పన్ తంగవేలు మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌లుగా పనిచేస్తున్న శరద్ కుమార్ రజత సిల్వర్ మరియు కాంస్య పతకాలు సాధించి దేశం గర్వపడేలా చేశారు. పారాలింపిక్ క్రీడల్లో నుండి ఇది మరియప్పన్‌కు రెండవ పతకం; రియో 2016 లో అతను స్వర్ణం గెలిచారు.
ఇవాళ్టి ఈవెంట్‌ల తర్వాత భారత పతకాల సంఖ్య 10 కి చేరుకుంది. ఇంతకుముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో సింఘరాజ్ అధనా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
ఫైనల్లో మరియప్పన్ అత్యధికంగా 1.86 మీటర్లు జంప్ ఈ సీజన్ ఉత్తమ స్కోరు. శరద్ తన కాంస్య పతకానికి చేరే మార్గంలో 1.83 మీటర్ల సీజన్ బెస్ట్ జంప్‌ని పూర్తి చేశారు. ఇద్దరూ టి42 కేటగిరీ కింద వర్గీకరించబడ్డారు. అంటే అథ్లెట్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బలహీనత రకాలు ఒకటి లేదా రెండు అవయవాలలో హిప్ మరియు/లేదా మోకాలి పనితీరును ప్రభావితం చేస్తాయి మరియు కార్యాచరణ పరిమితులతో ఉంటాయి.
తమిళనాడుకు చెందిన పారా అథ్లెట్ మరియప్పన్ టోక్యో పారాలింపిక్స్‌కు ముందు కోచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో బెంగుళూరులోని సాయ్ కేంద్రంలో శిక్షణ తీసుకున్నారు. అతను 2017 లో పద్మశ్రీ మరియు అర్జున అవార్డులను అలాగే 2021 లో ఖేల్ రత్నను గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం సదుపాయం కల్పించిన మరియప్పన్ టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) నుండి రూ .13.04 లక్షల పొందారు. ఆయన ఐదు అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నారు. మరియు శిక్షణ మరియు పోటీ (ఎసిటిసి) కోసం వార్షిక క్యాలెండర్‌లో రూ .27.79 లక్షలు పొందారు.
టోక్యో పారాలింపిక్స్‌కు ముందు శరద్ కుమార్ రెండు సంవత్సరాలకు పైగా విదేశీ కోచ్ నికితిన్ యెవెన్ నేతృత్వంలో పూర్తిగా భారత ప్రభుత్వ ఖర్చుతో రెండు సంవత్సరాలకు పైగా ఉక్రెయిన్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆయనకు టాప్స్ నుండి రూ. 80.75 లక్షలు మరియు ఎసిటిసి నుండి రూ. 21.72 లక్షలు పొందారు. కోవిడ్ -19 ఉధృతంగా ఉన్న సమయంలో ఉక్రెయిన్ నుండి భారతదేశానికి తిరిగి రావడానికి మరియు సజావుగా వీసా ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో కూడా ప్రభుత్వం అతనికి సహాయం చేసింది. ఆసియా పారా గేమ్స్ 2018 లో శరద్ బంగారు పతకం మరియు వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2019 లో రజతం సాధించారు.
మొత్తం 216.8 పాయింట్లతో కాంస్య పతకం సాధించిన హర్యానాకు చెందిన షూటర్ సింఘరాజ్‌కు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సహకారం అందించడంతో పాటు ఎయిర్ పిస్టల్ కొనుగోలు మరియు వ్యక్తిగత కోచ్ కోసం కూడా భారత ప్రభుత్వం సహాయం అందించింది. అతనికి టాప్స్ నిధులు రూ. 18.65 లక్షలు మరియు ఎసిటిసి నుండి రూ. 36.65 లక్షలు అందించారు.
*******
(Release ID: 1750931)
Visitor Counter : 181