ఆర్థిక మంత్రిత్వ శాఖ
వివాద్ సే విశ్వాస్ చట్టంలోని సెక్షన్ 3 కింద తేదీని పొడిగించిన సీబీడీటీ
Posted On:
29 AUG 2021 2:13PM by PIB Hyderabad
ప్రత్యక్ష పన్ను 'వివాద్ సే విశ్వాస్ చట్టం 2020' (ఇకపై నుంచి "వివాద్ సే విశ్వాస్ చట్టంస గా పేర్కొనబడుతుంది), డిక్లరెంట్ చెల్లించాల్సిన మొత్తం 'వివాద్ సే విశ్వాస్ చట్టం'లోని సెక్షన్ 3 కింద పట్టికలో పేర్కొనబడింది. తాజాగా 25 జూన్ 2021 నాడు వెలువడిన ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తాన్ని చెల్లించడానికి చివరి తేదీ (ఎలాంటి అదనపు మొత్తం లేకుండా) 31 ఆగస్టు 2021గా పేర్కొనబడింది. వివాద్ సే విశ్వాస్ చట్టం కింద మొత్తం (అదనపు మొత్తంతో కలిపి) చెల్లించడానికి చివరి తేదీ 31 అక్టోబర్, 2021 గా నిర్ణయించి తెలియజేయడమైంది. వివాద్ సే విశ్వాస్ చట్టం కింద డిక్లరెంట్ చెల్లింపు చేయడానికి అవసరమైన ఫారం నంః3 జారీ చేయడంలో మరియు సవరించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, ఆ మొత్తాన్ని చెల్లించే చివరి తేదీని (అదనపు మొత్తం లేకుండా) 30 సెప్టెంబర్, 2021కి పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన నోటిఫికేషన్ త్వరలో జారీ చేయబడుతుంది. ఏది ఏమయినప్పటికీ వివాద్ సే విశ్వాస్ చట్టం కింద మొత్తం (అదనపు మొత్తంతో) చెల్లింపు కోసం చివరి తేదీని మార్చే ప్రతిపాదన ఏదీ లేదని. ఇది 31 అక్టోబర్, 2021వ తేదీగానే ఇకపై కూడా కొనసాగుతుందని తెలియజేశారు.
****
(Release ID: 1750220)
Visitor Counter : 275