విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అమెరికా రాష్ట్రపతి కొలువులో ప‌ర్యావ‌ర‌ణ విష‌యాల‌ను ప‌ర్య‌వేక్షించే శ్రీ‌జాన్ కెర్రీతో కేంద్ర విద్యుత్, ఎంఎన్ఆర్ఈ మంత్రి శ్రీ ఆర్‌కే సింగ్ టెలిఫోన్ సంభాష‌ణ‌


- ఎరువులు, చమురు శుద్ధిలో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించాలని ప్ర‌తిపాదించిన భారతదేశం

- 4000 మెగావాట్ల సామర్థ్యం క‌లిగిన ఎలక్ట్రోలైజర్‌, 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్ట‌మ్ కోసం బిడ్ల‌ను ఆహ్వ‌నించే యోచ‌న‌లో భారత్‌

Posted On: 27 AUG 2021 1:16PM by PIB Hyderabad

అమెరికా రాష్ట్రపతి కొలువులో ప‌ర్యావ‌ర‌ణ విష‌యాల‌ను ప‌ర్య‌వేక్షించే శ్రీ‌జాన్ కెర్రీతో భార‌త‌ కేంద్ర విద్యుత్, ఎంఎన్ఆర్ఈ శాఖ‌ల మంత్రి శ్రీ ఆర్‌కే సింగ్ టెలిఫోన్‌లో సంభాషించారు. భార‌త‌దేశం మొత్త‌గా 146 గిగావాట్ల పున‌రుత్సాద‌క ఇంధ‌న సామ‌ర్థ్యాన్ని చేరుకున్నందుకు శ్రీ‌జాన్ కెర్రీ అభినందించారు. ఇందులో 63 గిగావాట్ల పున‌రుత్పాద‌క‌పు కేంద్రాలు నిర్మాణంలో ఉండ‌గా.. మ‌రో 25 గిగావాట్ల మేర సామ‌ర్థ్యం క‌లిగిన పున‌రుత్పాదక‌ బిడ్‌ల‌తో ఈ రంగంలో సాధించిన‌ విజయాలకు గాను శ్రీ‌జాన్ కెర్రీ భారతదేశాన్ని అభినందించారు. ఈ సంద‌ర్భంగా ఎరువులు, చ‌మురు శుద్ధిలో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉపయోగించాలని భారతదేశం ప్రతిపాదించింది. గ్రే హైడ్రోజన్ స్థానంలో గ్రీన్ హైడ్రోజన్‌ భర్తీ చేయడం త‌మ‌ ప్రభుత్వ నిబద్ధతలో భాగ‌మ‌ని భార‌త్ పేర్కొంది. ఈ విష‌యాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు ఎంఎన్ఆర్ఈ శాఖ‌ల మంత్రి శ్రీ ఆర్‌కే సింగ్.. నిన్న సాయంత్రం అమెరికా దేశ‌ రాష్ట్రపతి కొలువులో ప‌ర్యావ‌ర‌ణ విష‌యాల‌ను ప‌ర్య‌వేక్షించే శ్రీ‌జాన్ కెర్రీతో టెలిఫోన్ సంభాష‌ణ సంద‌ర్భంగా వివ‌రించారు. గౌరవనీయులైన భార‌త‌ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పర్యావరణానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తారని శ్రీ సింగ్ అమెరికా అధ్యక్ష ప్రతినిధికి నొక్కిచెప్పారు. పునరుత్పాదక విద్యుత్ నిల్వ వ్యయాన్ని తగ్గించే అవసరాన్ని మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. విద్యుత్ మరియు సాంకేతికతల‌ ఆవిష్కరణల రంగంలో భారత్‌, అమెరికా దేశాలు కలిసి పనిచేయవచ్చని సూచించారు. 4000 మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజీల‌ కోసం బిడ్‌లను ఆహ్వానించే ప్రక్రియలో భార‌త్ ఉంద‌ని ఆయ‌న తెలిపారు. వ్య‌వ‌స్థాపిత సౌర మరియు వాయు సామర్థ్యంలో దాదాపు 100 గిగావాట్ల‌ను దాటి.. దేశం ఇటీవ‌ల సాధించిన మైలురాయి గురించి కూడా మంత్రి శ్రీ కెర్రీకి వివ‌రించారు. తాము హైడ్రో సామర్థ్యాన్ని కూడా జోడిస్తే మొత్తం వ్య‌వ‌స్థీకృత‌ పునరుత్పాదక సామర్థ్యం 147 మెగావాట్ల‌కు చేరింద‌ని వివ‌రించారు. దీనికి తోడు 63 గిగా వాట్ల‌ పునరుత్పాదక సామర్థ్యం నిర్మాణంలో ఉంద‌ని, దీంతో పునరుత్పాదక ఇంధ‌న సామర్ధ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భార‌త్ ఒకటిగా నిలిచింద‌ని వివ‌రించారు. అత్యంత ఖర్చుతో కూడిన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రారంభించడానికి నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ప్రారంభించబడిందని శ్రీ సింగ్ కెర్రీకి తెలియజేశారు. హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించేలా  మార్గం సుగమం చేయడానికి.. వచ్చే 3-4 నెలల్లో భారతదేశం గ్రీన్ హైడ్రోజన్ కోసం కాంపిటిటివ్ బిడ్‌లను ఆహ్వానించ‌నుందని ఆయన అన్నారు. 4000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ సామర్థ్యం కోసం బిడ్ల ఆహ్వానించాల‌ని భార‌త్ చూస్తోంద‌ని వివ‌రించారు. ఇతర దేశాలు కూడా త‌మ‌ ఖర్చులను తగ్గించడానికి మరిన్ని ఎలక్ట్రోలైజర్ ప్లాంట్లతో ముందుకు రావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఇన్‌పుట్స్ మెటీరియల్‌ను భద్రపరచేలా లిథియం కోసం.. ప్రత్యామ్నాయ సరఫరా గొలుసు ఏర్పాటుకు భారత్ మరియు అమరికా కృషి చేయాలని సూచించబడింది. శక్తి పరివర్తనపై చర్చలను మ‌రింత‌గా ముందుకు తీసుకెళ్లడానికి శ్రీ సింగ్, శ్రీ‌ కెర్రీ అతి త్వరలో స‌మావేశం కానున్నారు.
                     

*****


(Release ID: 1749627) Visitor Counter : 171