విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ట్రాన్స్‌ఫ‌ర్మెటివ్ మొబిలిటీ' చొరవలో భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్రాల‌ను కోరిన కేంద్ర మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్


- ఈ విష‌య‌మై త‌గిన చొర‌వ చూపాల‌ని కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన కేంద్ర విద్యుత్, నూత‌న మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్

- అన్ని అధికారిక అవ‌స‌రాల‌ కోసం విద్యుత్‌ వాహనాలను ఉపయోగించాలని సూచించిన విద్యుత్ శాఖ మంత్రి

Posted On: 27 AUG 2021 10:50AM by PIB Hyderabad

దేశంలో విద్యుత్‌ వాహనాలను ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా.. కేంద్ర విద్యుత్ మరియు నూత‌న‌ & పునరుత్పాదక ఇంధన శాఖ‌ల మంత్రి శ్రీ ఆర్‌కె సింగ్ అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సహా కేంద్ర మంత్రులు, స‌హాయ మంత్రుల‌కు(స్వతంత్ర బాధ్యత) ఒక లేఖ రాశారు. భారత ప్రభుత్వం చేప‌ట్టిన సరికొత్త 'ట్రాన్స్‌ఫ‌ర్మెటివ్ మొబిలిటీ' చొరవలో భాగ‌స్వామ్యం కావాల‌ని కోరారు. సంబంధిత మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్‌లు తమ అధికారిక వాహనాల సముదాయాన్ని ప్రస్తుత ఉన్న అంతర్గత దహన యంత్రం (ఐసీఈ)/ పెట్రోల్/ డీజిల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలని సూచించారు. ఇక‌పై ప్ర‌భుత్వ‌పు అన్ని అధికారిక ప్రయోజనాల కోసం ఈ త‌ర‌హా వాహనాల‌ను వినియోగించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి కోరారు. ఈ త‌ర‌హా చర్య దేశంలోని సాధారణ ప్రజలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంద‌ని తెలిపారు. ఈ-మొబిలిటీకి మారడానికి ఈ చ‌ర్య ఎంత‌గానో ప్రోత్సహ‌క‌రంగా నిలుస్తుంద‌ని తాము  భావిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. బహుళ లక్ష్యాలను చేరుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ-ఎల‌క్ట్రిక్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ చొరవ నిలుస్తుంది - క‌ర్బ‌న్ ఉద్గారాల తగ్గింపు, ఇంధ‌న‌ భద్రత, ఇంధన సామర్థ్యం పెంపు మొదలైన లక్ష్యాలను సాధించేందుకు గాను ఈ చ‌ర్య ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని పేర్కొన్నారు. 

 

***


(Release ID: 1749527) Visitor Counter : 181