ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

61 కోట్ల డోసుల మైలురాయి దాటిన భారతదేశ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

గత 24 గంటల్లో 79 లక్షలకు పైగా టీకాలు

97.60 శాతానికి చేరిన రికవరీ రేటు

గత 24 గంటల్లో 44,658 కొత్త కేసులు నమోదు

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు (3,44,899) 1.06 శాతం

రోజువారీ పాజిటివిటీ రేటు (2.45 శాతం) గత 32 రోజులుగా 3 శాతం కంటే తక్కువ

Posted On: 27 AUG 2021 10:00AM by PIB Hyderabad

దేశంలో కొవిడ్‌-19 టీకా కార్యక్రమం నిన్నటితో 61 కోట్ల డోసుల మైలురాయిని దాటింది. గత 24 గంటల్లో 79,48,439 డోసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం 7 గంటల వరకు తాత్కాలిక సమాచారం ప్రకారం 61.22 కోట్లను (61,22,08,542) టీకా కార్యక్రమం అధిగమించింది. 66,60,983 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 8 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

 

హెచ్‌సీడబ్ల్యూలు

మొదటి డోసు

1,03,56,368

రెండో డోసు

82,94,906

 

ఎఫ్‌ఎల్‌డబ్ల్యూలు

మొదటి డోసు

1,83,14,369

రెండో డోసు

1,28,61,222

 

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

23,25,61,664

రెండో డోసు

2,34,57,529

 

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

12,65,76,574

రెండో డోసు

5,13,99,879

 

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

8,50,29,798

రెండో డోసు

4,33,56,233

మొత్తం

61,22,08,542

 

దేశవ్యాప్తంగా టీకాల వేగాన్ని పెంచడానికి, పరిధిని విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది.

గత 24 గంటల్లో 32,988 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,18,21,428కి పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 97.60 శాతానికి చేరింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010ML1.jpg

 

కేంద్రం-రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నిరంతర, సహకార ప్రయత్నాల కారణంగా, వరుసగా 61వ రోజు కూడా 50,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 44,658 కొత్త కేసులు నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002DRXP.jpg

ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 3,44,899. దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇది 1.06 శాతం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033BVS.jpg

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 18,24,931 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 51.49 కోట్ల (51,49,54,309) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 2.10 శాతంగా ఉంది. గత 63 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. గత 32 రోజులుగా రోజువారీ పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా, వరుసగా 81 రోజులుగా 5 శాతం కంటే తక్కువగా నమోదవుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048QPR.jpg

 

****


(Release ID: 1749491) Visitor Counter : 188